విద్యాశాఖ మంత్రే.. విద్యార్థులను ఉన్నత విద్యకు దూరం చేస్తున్నారా?

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. సీఎం కేసీఆర్ తొలి క్యాబినెట్లో మహిళలకు కనీసం చోటు దక్కలేదు. ఆ తర్వాత జరిగిన ముందస్తు ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ రెండోసారి ఘనవిజయం సాధించింది. ఈసారి మాత్రం ఇద్దరు మహిళలకు తెలంగాణ క్యాబినెట్లో చోటు కల్పించారు. Also Read: ఇద్దరూ ఈ చట్టాలకు అనుకూలంగా మాట్లాడుతున్నారు 2018లో మహేశ్వరం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీచేసిన గెలుపొందిన సబితా ఇంద్రారెడ్డి ఒకరుకాగా.. మరొకరు ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్. తెలంగాణ ఏర్పడిన తర్వాత […]

Written By: Neelambaram, Updated On : December 11, 2020 5:19 pm
Follow us on

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. సీఎం కేసీఆర్ తొలి క్యాబినెట్లో మహిళలకు కనీసం చోటు దక్కలేదు. ఆ తర్వాత జరిగిన ముందస్తు ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ రెండోసారి ఘనవిజయం సాధించింది. ఈసారి మాత్రం ఇద్దరు మహిళలకు తెలంగాణ క్యాబినెట్లో చోటు కల్పించారు.

Also Read: ఇద్దరూ ఈ చట్టాలకు అనుకూలంగా మాట్లాడుతున్నారు

2018లో మహేశ్వరం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీచేసిన గెలుపొందిన సబితా ఇంద్రారెడ్డి ఒకరుకాగా.. మరొకరు ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్. తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలి మహిళ మంత్రిగా సబితా ఇంద్రారెడ్డి రికార్డు సృష్టించింది. గతంలోనూ ఆమెకు మంత్రిగా చేసిన అనుభవం ఉండటంతో సీఎం కేసీఆర్ సబితా ఇంద్రారెడ్డికి విద్యాశాఖను కేటాయించారు.

ఇదిలా ఉంటే మంత్రి సొంత నియోజకవర్గమైన మహేశ్వరంలో కనీసం డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ప్రాంతంలో కేవలం ఇంటర్మీయట్ వరకు మాత్రమే అందుబాటులో ఉంది. దీంతో దూరం ప్రాంతాలకు వెళ్లలేక ప్రధానంగా మహిళలు ఉన్నత విద్యకు దూరమవుతున్నారు. వీరంతా కేవలం ఇంటర్ తోనే విద్యను ఆపేస్తుండటం శోచనీయంగా మారింది.

ఈ నియోజకవర్గంలో 30 గ్రామ పంచాయతీల్లో సుమారు 3వేల మంది డిగ్రీ విద్యార్థులున్నారని సమాచారం. స్థానికంగా డిగ్రీ కళాశాల లేకపోవడంతో విద్యార్థులంతా హైదరాబాద్లోని దిల్​సుఖ్​నగర్.. ఐఎస్ సదన్.. కోఠి.. ఇబ్రహీంపట్నం.. శంషాబాద్ ప్రాంతాల్లోని కళాశాలకు వెళుతున్నారు. దాదాపు 40కిలోమీటర్ల దూరంలో ఉన్న కళాశాలలలో రోజుకు అప్ అండ్ డౌన్ చేస్తూ విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు.

Also Read: ప్రతిపక్షాలు లేకున్నా.. ప్రశించేవారున్నారు..!

నియోజకవర్గంలోని మహేశ్వరం.. కందుకూరు మండలాల్లోని కొన్ని గ్రామపంచాయతీలకు ఉదయం పూట బస్సు సౌకర్యం లేకపోవడంతో కొందరు విద్యార్థులు మధ్యలోనే చదువుకు స్వస్తి చెబుతున్నారు. హైదరాబాద్ కు ఈ ప్రాంతం నుంచి వెళ్లి రావడానికే 4నుంచి 6గంటల సమయం పడుతుండటంతో విద్యార్థులు నానా ఇబ్బందులు పడుతున్నట్లు వాపోతున్నారు.

ఇప్పటికైనా మంత్రి సబితా ఇంద్రారెడ్డి తన నియోజకర్గంలో డిగ్రీ కళాశాలలను ఏర్పాటు చేయాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.తెలంగాణ తొలి మంత్రిగా రికార్డు సృష్టించిన సబితా ఇంద్రారెడ్డి మహిళలు ఉన్నత విద్యకు దూరమవుతున్నా పట్టించుకోకపోవడం ఏంటనే విమర్శలు వెల్లువెత్తున్నాయి. దీనిపై మంత్రి ఎలా స్పందిస్తారో వేచిచూడాల్సిందే..!

మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్