అక్కడ బీజేపీ మౌనం.. వ్యూహం ఏంటి?

తెలంగాణలో దుబ్బాక, గ్రేటర్ ఎన్నికల ఫలితాల తర్వాత రెట్టించిన ఉత్సాహంలో ఉంది బీజేపీ. ఈ జాబితాలో తిరుపతిని కూడా చేర్చేసి.. ఏపీలో పట్టు పెంచుకోవాలని ఆ పార్టీ నేతలు హడావిడి చేశారు. కానీ.. ఉన్నట్టుండి సైలెంట్ అయిపోయారు. తిరుపతి ఉప ఎన్నిక గురించి ఆ పార్టీ నేతలు ఎవరూ మాట్లాడట్లేదు. ఈ మౌనం వెనుక ఆంతర్యం ఏంటనే చర్చ సాగుతోంది. Also Read: విద్యాశాఖ మంత్రే.. విద్యార్థులను ఉన్నత విద్యను దూరం చేస్తున్నారా? మారిన సీన్.. రెండు […]

Written By: Neelambaram, Updated On : December 11, 2020 12:07 pm
Follow us on


తెలంగాణలో దుబ్బాక, గ్రేటర్ ఎన్నికల ఫలితాల తర్వాత రెట్టించిన ఉత్సాహంలో ఉంది బీజేపీ. ఈ జాబితాలో తిరుపతిని కూడా చేర్చేసి.. ఏపీలో పట్టు పెంచుకోవాలని ఆ పార్టీ నేతలు హడావిడి చేశారు. కానీ.. ఉన్నట్టుండి సైలెంట్ అయిపోయారు. తిరుపతి ఉప ఎన్నిక గురించి ఆ పార్టీ నేతలు ఎవరూ మాట్లాడట్లేదు. ఈ మౌనం వెనుక ఆంతర్యం ఏంటనే చర్చ సాగుతోంది.

Also Read: విద్యాశాఖ మంత్రే.. విద్యార్థులను ఉన్నత విద్యను దూరం చేస్తున్నారా?

మారిన సీన్..
రెండు వారాల క్రితం తిరుపతిలో బీజేపీ నేతలు హడావిడి చేశారు. ఉప ఎన్నికలో తాము పోటీ చేస్తున్నట్టు ప్రకటించుకున్నారు. అంతే కాదు.. రాష్ట్ర అధ్యక్షుదు సోము వీర్రాజు తిరుపతిలోనే కొన్ని రోజులు మకాం వేశారు. ఆయనకు తోడుగా జీవీఎల్ కూడా వచ్చారు. తిరుపతి అభివృద్ధిలో తమ పాత్ర చాలా ఉందని చెప్పడం ప్రారంభించారు. ఓ సందర్భంలో జీవీఎల్ కేంద్ర సంస్థల అధికారులతో సమీక్ష కూడా నిర్వహించారు. అయితే.. ఇదే సమయంలో.. మిత్రపక్షం జనసేన కూడా తాము పోటీ చేస్తామని రావడంతో సీన్ మారిపోయింది.

నేతలు సైలెంట్..
జనసేన పోటీకి రావడంతో బీజేపీ నేతలు సైలెంట్ అయ్యారు. మిత్రపక్షంగా ఉన్న రెండు పార్టీల్లో ఎవరు పోటీ చేయాలి? అనేది తేల్చడానికి రెండు పార్టీల నేతలతో కమిటీ వేయాలని నిర్ణయించారు. మరి, కమిటీని నియమించారా..? ఆ కమిటీలో ఎవరున్నారు..? అన్నదానిపై స్పష్టత లేదు. బీజేపీ నేతలు మాత్రం తిరుపతి గురించి మాట్లాడటం మానేశారు. పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రస్తుతం రాయలసీమలోనే ఉన్నారు. కడపలో బీజేపీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పోలవరం ప్రాజెక్టుకు ఇచ్చినట్లే రాయలసీమ ప్రాజెక్టులకూ నిధులిస్తామని పదే పదే చెప్పారు. రాజకీయంగా బలపడతామని కూడా అన్నారు. కానీ.. తిరుపతి ఉప ఎన్నిక గురించి మాత్రం మాట్లాడలేదు.

Also Read: ఇద్దరూ ఈ చట్టాలకు అనుకూలంగా మాట్లాడుతున్నారు

కారణం ఏంటో?
తిరుపతిలో ఎవరు పోటీ చేయాలి? ఎవరు మద్దతు ఇవ్వాలి? అన్నది ఇంకా తేలినట్టు లేదు. అందువల్లనే బీజేపీ నేతలు మాట్లాడటం లేదా? లేదంటే.. జనసేనకు సీటు కేటాయించాలని నిర్ణయించడం వల్లనా..? కాదంటే.. ఉమ్మడి అభ్యర్థిని నిర్ణయించే వరకూ ఇరుపార్టీలూ సైలెంట్ గా ఉండాలనే ఒప్పందం వల్లనా..? బీజేపీ మౌనానికి ఇందులో ఏది కారణం కావొచ్చు..? అనే చర్చ తిరుపతిలో సాగుతోంది.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్