Delhi team : ఖరీదైన ఆటగాళ్లు ఉన్న జాబితాలో ఢిల్లీ కూడా ఒకటి. గడచిన మెగా వేలంలో నటరాజన్ ను 10.75 కోట్లతో కొనుగోలు చేసింది. ఇతడు అద్భుతమైన బౌలర్. స్లో పిచ్ పై అద్భుతమైన బంతులు వేస్తాడు. స్లో బౌన్సర్లతో మేటి బ్యాటర్లను సైతం బోల్తా కొట్టిస్తాడు. అటువంటి ఈ ఆటగాడు ఈ సీజన్లో ఢిల్లీ జట్టులో ఇంతవరకు ఆడ లేక పోయాడు. కీలకమైన మ్యాచ్ లలో ఇతడితో బౌలింగ్ చేయించడానికి ఢిల్లీ యాజమాన్యం ఇన్ని రోజులపాటు రిజర్వ్ బెంచ్ కు పరిమితం చేసింది. గతంలో నటరాజన్ హైదరాబాద్ జట్టుకు ఆడాడు. సోమవారం హైదరాబాద్ జట్టుతో జరిగే మ్యాచ్లో ఇతడిని రంగంలోకి దింపాలని ఢిల్లీ జట్టు భావించింది. ఒకవేళ టాస్ కనుక గెలిస్తే నటరాజన్ తో ప్రారంభ ఓవర్ వేయించాలని భావించింది. ఇతడితోపాటు స్టార్క్ తో కూడా స్పెల్ వేయించాలని యోచించింది. ఎందుకంటే గత సీజన్లో జరిగిన ఫైనల్ మ్యాచ్లో కోల్ కతా నైట్ రైడర్స్ జట్టులో స్టార్క్ ఆడాడు. ఫైనల్ మ్యాచ్లో ప్రమాదకరమైన హెడ్ ను బోల్తా కొట్టించాడు. తద్వారా మ్యాచ్ మొత్తాన్ని కోల్ కతా వైపు ఒక్కసారిగా తిప్పాడు. దీంతో కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు ఊహించని విజయాన్ని అందుకుంది. శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలో ఛాంపియన్ గా ఆవిర్భవించింది.
తర్వాత మ్యాచ్లలో అవకాశం దక్కుతుందేమో..
నటరాజన్ ఐపీఎల్లో 61 ఇన్నింగ్స్లలో బౌలింగ్ చేశాడు. 29.38 సగటుతో 67 వికెట్లను నేలకూల్చాడు. 19/4 ఇతడి అత్యుత్తమ ప్రదర్శనగా ఉంది. 8.83 ఎకానమీ, 19.9 స్ట్రైక్ రేట్ కొనసాగిస్తున్నాడు. ఢిల్లీ కెప్టెన్ ఇతడిని తుది జట్టులోకి తీసుకున్నప్పటికీ.. హైదరాబాద్ జట్టు టాస్ గెలవడంతో ముందుగా బౌలింగ్ చేసే అవకాశం ఢిల్లీ జట్టుకు లభించలేదు. అయితే నటరాజన్ తో పాటు స్టార్క్, దుష్యంత చమీరాతో బౌలింగ్ వేయించాలని ఢిల్లీ జట్టు కెప్టెన్ అక్షర్ పటేల్ భావించాడు. స్లో పిచ్ పై వీరు ముగ్గురు అద్భుతంగా బంతులు వేస్తారు. వాస్తవానికి వీరి ముగ్గురితో పాటు కీలక దశలో తను కూడా బౌలింగ్ వేయాలని అక్షర్ పటేల్ భావించాడు. చేసింది 133 రన్స్ అయినప్పటికీ.. ఐపీఎల్ లో ఇది తక్కువ స్కోరే అయినప్పటికీ.. ఆ టార్గెట్ కాపాడుకోవాలని అక్షర్ భావించాడు. కానీ వర్షం వల్ల ఢిల్లీ జట్టు తదుపరి బౌలింగ్ చేసే అవకాశాన్ని కోల్పోయింది. దీంతో పది కోట్ల బౌలర్ తో ఉపయోగం లేకుండా పోయింది. అయితే తదుపరి మ్యాచ్లలో నటరాజన్ కు తుది జట్టులో అవకాశం దక్కుతుందని తెలుస్తోంది. నటరాజన్ స్లో పిచ్ ల పై బంతులను అద్భుతంగా వేస్తాడు. మెలికలు తిప్పుతూ చుక్కలు చూపిస్తాడు.
Also Read : హైదరాబాద్ కెప్టెన్ కమిన్స్ అద్భుతం.. ఐపీఎల్ లో సరికొత్త చరిత్ర