MI Vs DC: ఐపీఎల్ 17వ సీజన్లో భాగంగా ఢిల్లీ వేదికగా ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు శనివారం తలపడ్డాయి. ఈ మ్యాచ్లో ఢిల్లీ ఆటగాడు జేక్ ఫ్రేజర్ మెక్ గుర్క్ సరికొత్త రికార్డు సృష్టించాడు.. ముంబై జట్టు ప్రధాన బౌలర్ బుమ్రా ను సైతం వదిలి పెట్టకుండా జేక్ ఫ్రేజర్ మెక్ గుర్క్ విధ్వంసం సృష్టించాడు. ఢిల్లీలోని అరుణ్ జెట్లీ మైదానాన్ని హోరెత్తించాడు. సిక్సర్లు, బౌండరీలు కసి కొద్దీ బాదుతూ అభిమానులను అలరించాడు. కేవలం 27 బంతులు మాత్రమే ఎదుర్కొని 84 రన్స్ చేశాడు. ఇందులో 11 ఫోర్లు, ఆరు సిక్సర్లు ఉన్నాయి.
ముంబై బౌలర్లను ఊచ కోత కోసిన జేక్ ఫ్రేజర్ మెక్ గుర్క్.. ఐపీఎల్ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించాడు. 15 బంతుల్లోనే అర్థ సెంచరీ సాధించాడు. ఈ క్రమంలో ఢిల్లీ తరఫున అత్యంత తక్కువ బంతుల్లో అర్థ సెంచరీ సాధించిన ఆటగాడిగా జేక్ ఫ్రేజర్ మెక్ గుర్క్ రెండవసారి రికార్డు నమోదు చేశారు. ఈ సీజన్లోనే హైదరాబాద్ జట్టుతో జరిగిన మ్యాచ్లో జేక్ ఫ్రేజర్ మెక్ గుర్క్ కేవలం 15 బంతుల్లోనే 50 పరుగులు చేసి సరికొత్త చరిత్ర సృష్టించాడు. శనివారం ముంబై జట్టుతో జరిగిన మ్యాచ్లో తన రికార్డును తనే తిరగ రాసుకున్నాడు.
ఈ మ్యాచ్ ద్వారా జేక్ ఫ్రేజర్ మెక్ గుర్క్ మరో అరుదైన ఘనతను తన పేరు మీద లిఖించుకున్నాడు. టి20 క్రికెట్లో 15 లేదా అంతకంటే తక్కువ బంతుల్లో అర్థ సెంచరీ సాధించిన మూడవ ఆటగాడిగా జేక్ ఫ్రేజర్ మెక్ గుర్క్ రికార్డులకెక్కాడు. ఇతడి కంటే ముందు వెస్టిండీస్ ఆటగాళ్లు ఆండ్రి రస్సెల్, సునీల్ నరైన్ అతి తక్కువ బంతుల్లో అర్థ సెంచరీ సాధించిన జాబితాలో ఉన్నారు.. స్థూలంగా చూసుకుంటే వేగంగా అర్థ శతకం సాధించిన ప్లేయర్ల లిస్టులో జేక్ ఫ్రేజర్ మెక్ గుర్క్ మూడవ స్థానంలో ఉన్నాడు..
ఈ జాబితాలో యశస్వి జైస్వాల్ (13 బాల్స్), కేఎల్ రాహుల్ (14 బాల్స్), ప్యాట్ కమిన్స్(14 బంతులు) వరుసగా ఒకటి, రెండు స్థానాల్లో కొనసాగుతున్నారు. యూసఫ్ పఠాన్ (15 బంతులు), సునీల్ నరైన్(15 బంతులు), నికోలస్ పూరన్(15 బంతులు)తో కలిసి జేక్ ఫ్రేజర్ మెక్ గుర్క్ సంయుక్త స్థానంలో కొనసాగుతున్నాడు.
ముంబై ఇండియన్స్ తో జరుగుతున్న మ్యాచ్లో ఢిల్లీ జట్టు జేక్ ఫ్రేజర్ మెక్ గుర్క్ దూకుడుకు పవర్ ప్లే లో ఏకంగా 92 పరుగులు చేసింది. ఐపీఎల్ చరిత్రలోనే పవర్ ప్లే లో అత్యధిక స్కోరు సాధించిన ఐదవ జట్టుగా ఢిల్లీ చరిత్ర సృష్టించింది. జాబితాలో హైదరాబాద్ జట్టు 125 పరుగులతో మొదటి స్థానంలో కొనసాగుతోంది.
Jake Fraser-McGurk redefining the Powerplay in #TATAIPL 2024 #IPLonJioCinema #DCvMI pic.twitter.com/vopxM9Btbh
— JioCinema (@JioCinema) April 27, 2024