WhatsApp : బిలియన్ల కొద్దీ యూజర్లను కలిగి ఉన్న నెంబర్ వన్ మెసేజింగ్ యాప్ వాట్సప్ మరో కొత్త ఫీచర్ ను జత చేసింది. ఈసారి సరికొత్త అప్డేట్ తో యూజర్లకు సర్ ప్రైజ్ ఇచ్చింది. ఇప్పటికే ఎన్నో రకమైన కొత్త ఫీచర్లను ప్రవేశపెట్టిన ఈ మెసేజింగ్ దిగ్గజం.. కొత్త ఫీచర్లో భాగంగా లోగో కలర్ పూర్తిగా మార్చేసింది. ఇప్పటివరకు నీలిరంగులో కనిపించిన వాట్సాప్ ఇంటర్ ఫేస్.. ఇప్పుడు ఏకంగా ఆకుపచ్చ రంగులోకి మారిపోయింది. ప్రపంచవ్యాప్తంగా యూజర్లకు అప్డేట్ వచ్చింది.. గతంలో వాట్సప్ అనేక ఫీచర్స్ ను జత చేసేది. ఇవి అత్యంత సూక్ష్మంగా ఉండేవి కాబట్టి యూజర్లు పెద్దగా ఐడెంటిఫై చేసే వాళ్ళు కాదు.. కానీ ఈసారి వాట్సాప్ భారీ మార్పునే తెరపైకి తీసుకువచ్చింది.
ఇటీవల యాపిల్ ఫోన్ యూజర్ల కోసం ఇంటర్ ఫేస్ లో వాట్సప్ యాజమాన్యం చిన్నచిన్న మార్పులు తీసుకొచ్చింది. ట్రెడిషనల్ బ్లూ కలర్ కు బదులుగా గ్రీన్ కలర్ బ్యాక్ గ్రౌండ్ ను యాడ్ చేసింది. వాస్తవానికి ఈ మార్పు అనేది ఈ ఏడాది ఫిబ్రవరిలోనే మొదలైంది. మెల్లిమెల్లిగా దీనిని వాట్సప్ చేంజ్ చేసుకుంటూ వచ్చింది. ఏప్రిల్ నెల ప్రారంభంలో ఈ కొత్త అప్డేట్ ఇండియన్ యూజర్లకు అందుబాటులోకి వచ్చింది. దీనిపై యూజర్లు ఒక్క విధంగా స్పందిస్తున్నారు. కొంతమంది ఆకుపచ్చ రంగు నచ్చలేదని ముఖం మీద చెప్పేస్తున్నారు. వాట్సప్ అధికారిక ట్విట్టర్ ఎక్స్ ఖాతాలో చాలామంది యూజర్లు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికిప్పుడు రంగు మార్చాల్సిన అవసరం ఏమొచ్చిందని మెటా కంపెనీని ప్రశ్నిస్తున్నారు. నీలిరంగు బాగుండేదని.. ఆకుపచ్చ రంగు చూడ్డానికి ఆకర్షణీయంగా లేదని చెబుతున్నారు. డిజైన్ కూడా నచ్చలేదని.. ఈ కొత్త మార్పు చాలా చెత్తగా ఉందని యూజర్లు వాట్సప్ యాజమాన్యాన్ని ఏకీపారిస్తున్నారు.
వాస్తవానికి బ్లూ కలర్ నుంచి గ్రీన్ కలర్ లోకి మారడానికి గల కారణాన్ని వాట్సప్ యాజమాన్యం ప్రకటించింది. యూజర్లకు సరికొత్త అనుభూతిని అందించేందుకు ఈ రంగు మార్చినట్టు ప్రకటించింది. ఫీచర్లను సైతం సులభంగా యాక్సెస్ చేసుకునే విధంగా మార్చినట్టు ప్రకటించింది. ఇంటర్ ఫేస్ రంగులు, ఐకాన్లు ఇతరత్రాలను కూడా గ్రీన్ కలర్ లోకి మార్చినట్టు కంపెనీ ప్రకటించింది. ఇప్పటికే చాలామంది భారతీయ iOS యూజర్లు చాలామంది వాట్సాప్ కొత్త అప్డేట్ ను స్వీకరించారు. వారి ఫోన్లో ఇంటర్ ఫేస్ సాధారణ నీలిరంగుకు బదులుగా ఆకుపచ్చ బ్యాక్ గ్రౌండ్లోకి చేంజ్ అయింది. ఆండ్రాయిడ్ డివైస్ ల లో కూడా ఇదే మార్పు కనిపిస్తోంది.