Homeక్రీడలుAsian Mixed Doubles Squash Tournament: దీపిక మెరిసే...కార్తిక్ మురిసే !

Asian Mixed Doubles Squash Tournament: దీపిక మెరిసే…కార్తిక్ మురిసే !

Asian Mixed Doubles Squash Tournament: భారతదేశానికి చెందిన టాప్ స్క్వాష్ క్రీడాకారులు దీపిక పల్లికల్, హరేంద్ర పాల్ సింగ్ జోడి హ్యాంగ్ జూ వేదికగా జరుగుతున్న ఏషియన్ మిక్స్డ్ డబుల్స్ స్క్వాష్ టోర్నమెంట్ అద్భుత విజయాన్ని నమోదు చేసి ఫైనల్ కు దూసుకెళ్లారు. మలేషియా కు చెందిన సైఫిక్ కమల్, ఐఫా అజ్మ జోడిపై భారతదేశానికి చెందిన ఈ జోడి విజయాన్ని నమోదు చేశారు. ఈ విషయాన్ని దీపిక పల్లికల్ భర్త దినేష్ కార్తీక్ ట్విట్టర్లో షేర్ చేసి ఆనందాన్ని పంచుకున్నాడు.

చైనాలోని హ్యాంగ్ జూ వేదికగా ఏషియన్ మిక్స్డ్ డబుల్స్ స్క్వాష్ టోర్నమెంట్ ఈనెల 26 నుంచి ప్రారంభమైంది. ఈ టోర్నమెంట్ లో భారతదేశానికి చెందిన టాప్ స్క్వాష్ క్రీడాకారిని దీపిక పల్లికల్, హరేంద్ర పాల్ సింగ్ జోడి భారతదేశం తరఫున బరిలోకి దిగారు. గురువారం మలేషియాకు చెందిన సైఫిక్ కమల్, ఐఫా అజ్మతో సెమీఫైనల్ లో తలపడి అద్భుత విజయాన్ని నమోదు చేశారు. ఈ విజయంతో ఈ జోడి ఫైనల్ లోకి దూసుకు వెళ్ళింది. మలేషియా జోడి పై 2-0 నాతో భారత జోడి విజయాన్ని నమోదు చేయడం ద్వారా ఫైనల్ కు చేరుకుంది.

మురిసిపోతున్న క్రికెటర్ దినేష్ కార్తీక్..

దీపిక పల్లికల్, హరేంద్ర పాల్ సింగ్ జోడి అద్భుత విజయాన్ని నమోదు చేసి ఫైనల్ కు చేరుకోవడంతో క్రికెటర్ దినేష్ కార్తీక్ మురిసిపోతున్నాడు. ఈ విజయానికి సంబంధించిన న్యూస్, ఫోటోలను షేర్ చేసి తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. దీపిక పల్లికల్ దినేష్ కార్తీక్ భార్య అయిన విషయం తెలిసిందే. వీరికి రెండేళ్ల  కింద కవలలు జన్మించారు.  దీపికా పల్లికల్, దినేష్ కార్తీక్ ఒక జిమ్ లో పరిచయం ఏర్పడి ప్రేమ చిగురించింది. ఆ తర్వాత వీరిద్దరూ వివాహం చేసుకున్నారు.

Exit mobile version