DC Vs RR IPL 2025: ఢిల్లీలో గొప్ప గొప్ప ఆటగాళ్లు లేరని.. ఈసారి ఈ జట్టు గ్రూప్ దశను దాటడం కష్టమని ఐపిఎల్ విశ్లేషకులు అన్నారు. మహా అయితే రాహుల్, అక్షర్ పటేల్ మాత్రమే రాణిస్తారని జోస్యం చెప్పారు. కానీ ఇక్కడ పరిస్థితి ఒక్కసారిగా తారు మారయింది. ఇప్పటివరకు ఈ సీజన్లో ఢిల్లీ జట్టు కేవలం ముంబై చేతిలో మాత్రమే ఓడిపోయింది. ఆ మ్యాచ్ లో కనుక కరుణ్ నాయర్ అవుట్ అవకుండా ఉండి ఉంటే మ్యాచ్ పరిస్థితి ఢిల్లీకి అనుకూలంగా ఉండేది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక ఆ ఓటమి తర్వాత ఢిల్లీ జట్టు పెద్దగా తడబాటుకు గురి కాలేదు. రాజస్థాన్ జట్టుతో జరిగిన మ్యాచ్లో చివరి వరకు పోరాడింది. చివరికి విజయం సాధించింది. ఉత్కంఠలో సమర్థవంతంగా ఆడి విమర్శకుల ప్రశంసలు అందుకుంది.
Also Read: రోహిత్, హార్దిక్, సూర్య యాక్షన్.. రాజ్ కుమార్ హిరాని డైరెక్షన్.. ఏంటా కథ
రాజస్థాన్ ఇన్నింగ్స్ లో చివరి ఓవర్ వరకు మ్యాచ్ పై పట్టుకోల్పోవడానికి ఢిల్లీ జట్టు ఇష్టపడలేదు. అద్భుతమైన పోరాటపటిమను చూపించింది. సొంత గడ్డపై 200 స్కోర్ చేయకపోయినప్పటికీ.. చేసిన 188 పరుగులను కూడా జాగ్రత్తగా కాపాడుకుంది. చివరి ఓవర్లో అద్భుతంగా బౌలింగ్ వేసి.. 11 పరుగులు మాత్రమే ఇచ్చి.. రెండు వికెట్లు పడగొట్టి రాజస్థాన్ జట్టుకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది ఢిల్లీ. అయితే సూపర్ ఓవర్ లో ఢిల్లీ జట్టు విజయం సాధించడం ఇదే తొలిసారి కాదు. ఐపీఎల్ లో ఢిల్లీ జట్టు ఇప్పటివరకు ఐదుసార్లు సూపర్ ఓవర్లు ఆడింది. ఇందులో నాలుగు మ్యాచ్లో విజయం సాధించింది. 2013లో బెంగళూరు జట్టుతో సూపర్ ఓవర్ ఆడి ఓటమిపాలైంది. గతంలో ఈ రికార్డు మూడు విజయాలతో పంజాబ్ జట్టు పేరు మీద ఉండేది.. ఢిల్లీ క్యాపిటల్స్ 2019లో కోల్ కతా, 2020లో పంజాబ్, 2021 లో హైదరాబాదు, 2025లో రాజస్థాన్ రాయల్స్ పై విజయాలు సాధించింది. 2013లో మాత్రం బెంగళూరు జట్టుతో సూపర్ ఓవర్ ఆడినప్పటికీ.. ఓటమిపాలైంది. ఇక నిన్న జరిగిన సూపర్ ఓవర్ లో ఢిల్లీ జట్టు పకడ్బందీ ప్రణాళికతో రంగంలోకి దిగింది. ముఖ్యంగా ఢిల్లీ జట్టు ప్రధాన బౌలర్ స్టార్క్ కట్టుదిట్టమైన బంతులు వేశాడు. నిప్పులు చెరిగే విధంగా యార్కర్లు వేశాడు. ఫలితంగా ఢిల్లీ జట్టు 11 పరుగులు మాత్రమే ఇచ్చింది. నాలుగు బంతులు మాత్రమే వేసిన స్టార్క్.. ప్రమాదకరమైన యశస్వి జైస్వాల్, హిట్ మేయర్ ను రనౌట్ చేయడం విశేషం. రెండు వికెట్లు పోగానే.. రాజస్థాన్ జట్టు పూర్తి ఓవర్ ఆడలేకపోయింది. అందువల్లే 11 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ లక్ష్యాన్ని ఢిల్లీ జట్టు 4 బంతుల్లోనే పూర్తి చేసింది. మొత్తంగా ఓడిపోయే మ్యాచ్లో గెలిచింది.
Also Read: ఇదే మ్యాచ్ లో మలుపు.. ఆ బ్యాటర్ వల్లే రాజస్థాన్ ఓటమి