Pawan Kalyan-Nadendla Manohar: జనసేన పార్టీ(Janasena Party) లో ఇప్పుడంటే చాలా మంది లీడర్స్ ఉన్నారు కానీ, ఒకప్పుడు జనసేన పార్టీ అంటే పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) తర్వాత మన అందరికీ గుర్తుకు వచ్చే పేరు నాదెండ్ల మనోహర్(Nadendla Manohar). పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు కూడా మధ్యలో పార్టీ లో చేరాడు కానీ, నాదెండ్ల మనోహర్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ని స్థాపించిన రెండవ సంవత్సరం నుండే ఉన్నాడు. ఎంత మంది వచ్చినా వెళ్లినా పవన్ కళ్యాణ్ కి సపోర్టు గా నిలుస్తూ, సొంత సోదరుడిగా పార్టీ ని నడిపిస్తూ ముందుకెళ్లాడు. 2019 ఎన్నికలలో జనసేన పార్టీ ఘోరంగా ఓటమి చెందినప్పుడు, ఆ పార్టీ లోని నాయకులు చెల్లాచెదురు అయిపోయారు. కానీ నాదెండ్ల మనోహర్ మాత్రం పవన్ కళ్యాణ్ ని విడిచి వెళ్ళలేదు. ఆయనతోనే ప్రయాణం కొనసాగిస్తూ వచ్చాడు. పవన్ కళ్యాణ్ కూడా నాదెండ్ల మనోహర్ కి తన అన్నయ్య నాగబాబు కంటే ఎక్కువ ప్రాముఖ్యం ఇచ్చాడు.
Also Read : పవన్ కళ్యాణ్ చేతికి సెలైన్ బాటిల్..ప్రతీ రోజు ట్రీట్మెంట్ తీసుకోవాల్సిందేనా?
అందుకే కూటమి ప్రభుత్వం అధికారాన్ని ఏర్పాటు చేసిన వెంటనే నాదెండ్ల మనోహర్ కి అత్యంత కీలక శాఖ అయినటువంటి సివిల్ సప్లైస్ కి మంత్రిగా నియమించారు. ప్రభుత్వం లో ప్రస్తుతం నాదెండ్ల మనోహర్ పని తీరు గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ర్యాంకింగ్ లో ఆయన పవన్ కళ్యాణ్ కంటే ముందు స్థానం లో ఉన్నాడు. ఇదంతా పక్కన పెడితే రాజకీయ వర్గాల్లో లేటెస్ట్ గా వినిపిస్తున్న టాక్ ఏమిటంటే ఈమధ్య కాలంలో నాదెండ్ల మనోహర్ కి, పవన్ కళ్యాణ్ కి అసలు పడడం లేదని, వీళ్ళ మధ్య మాటలు పూర్తిగా తగ్గిపోయాయని, నాదెండ్ల మనోహర్ తనకు పార్టీ లో ప్రాధాన్యత తగ్గిపోతున్నట్టుగా భావిస్తున్నాడని, అందుకు కారణం కొత్తగా పార్టీ లోకి వచ్చిన వైసీపీ నాయకులే అని ప్రచారం జరుగుతుంది. అనేక మంది జనసేన పార్టీ లో నాదెండ్ల మనోహర్ పై ఇప్పటికే విమర్శలు చేస్తున్నారు.
ఒకవిధంగా చెప్పాలంటే జనసేన పార్టీ లో ఇప్పుడు రెండు వర్గాలు ఏర్పడ్డాయి. ఇదంతా పవన్ కళ్యాణ్ కి తెలిసినప్పటికీ కూడా మౌనంగా ఉంటున్నాడని నాదెండ్ల మనోహర్ అసహనం వ్యక్తం చేస్తున్నాడట. అంతే కాకుండా బొత్స సత్యనారాయణ, తోట త్రిమూర్తులు వంటి వారు త్వరలోనే జనసేన పార్టీ లో చేరబోతున్నారంటూ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అది రూమర్ కాదట, ముమ్మాటికీ నిజమేనట. వాళ్లిద్దరూ జనసేన పార్టీ లోకి రావడం నాదెండ్ల మనోహర్ కి ఏ మాత్రం ఇష్టం లేదట. ఈ విషయంలోనే పవన్ కళ్యాణ్ కి ఆయనకు మధ్య అభిప్రాయం బేధాలు వచ్చాయని తెలుస్తుంది. మరి ఈ బేధాలు తొలగిపోయి త్వరలోనే వీళ్ళు ఎప్పటిలాగా కలిసి ఉంటారా లేదా అనేది చూడాలి. ఒకవేళ నాదెండ్ల మనోహర్ కి కోపం వచ్చి జనసేన పార్టీ ని వదిలేస్తే మాత్రం, పార్టీ కి చాలా పెద్ద డ్యామేజ్ జరుగుతుందని అంటున్నారు విశ్లేషకులు.
Also Read : మొన్న కలెక్టర్ల రివ్యూ.. ఇప్పుడు క్యాబినెట్ భేటీ.. పవన్ ఎందుకలా?