LSG Vs DC IPL 2024: అదృష్టం బాగలేకపోతే తాడే పామై కరుస్తుందట.. ఈ సామెత ఢిల్లీ ఆటగాడు డేవిడ్ వార్నర్ కు శుక్రవారం నాటి లక్నోతో జరిగిన మ్యాచ్ లో అనుభవంలోకి వచ్చింది.. లక్నో విధించిన 168 పరుగుల లక్ష్యాన్ని చేదించే క్రమంలో అతడు పృథ్వీ షా తో బరిలోకి దిగాడు. ధాటిగా ఆడే క్రమంలో ఔట్ అయ్యాడు. మామూలుగా అయితే ఒక బ్యాటర్.. “క్యాచ్, ఎల్బీడబ్ల్యు, క్లీన్ బౌల్డ్, రన్ అవుట్” రూపాల్లో పెవిలియన్ చేరుతాడు. కానీ శుక్రవారం రాత్రి లక్నోతో జరిగిన మ్యాచ్లో వార్నర్ అవుట్ అయిన విధానం మాత్రం ఈ ఐపీఎల్ చరిత్రలోనే అరుదైనది. క్రికెట్ చరిత్రలోనూ ఇలాంటి సంఘటనలు అరుదుగానే చోటు చేసుకున్నాయి.
లక్నో విధించిన 168 పరుగుల లక్ష్యాన్ని చేదించేందుకు డేవిడ్ వార్నర్ పృథ్వి షా తో కలసి ఓపెనింగ్ గా వచ్చాడు. వీరిద్దరూ 3.1 ఓవర్లలో 24 పరుగులు జోడించారు. 3.2 ఓవర్ వద్ద యశ్ ఠాకూర్ వేసిన ఒక బంతిని భారీ షాట్ ఆడేందుకు వార్నర్ ప్రయత్నించాడు. అయితే ఆ బంతి ని కొట్టే క్రమంలో వార్నర్ తప్పుగా అంచనా వేయడంతో షాట్ క్లిక్ కాలేదు. పైగా బ్యాట్ చివరి అంచును తగిలి ఆ బంతి వార్నర్ లెగ్ సైడ్ వైపు వెళ్ళింది. వెంటనే అది వికెట్లను గిరాటేసింది. అప్పటికే అప్రమత్తమైన వార్నర్ ఆ బంతి వికెట్లను తగలకుండా ప్రయత్నించినప్పటికీ జరగాల్సిన నష్టం జరిగిపోయింది.. దీంతో వార్నర్ నిరాశతో మైదానాన్ని వీడాడు.
ఐపీఎల్ 17వ సీజన్లో ఇలాంటి సంఘటనలు ఇప్పటివరకూ చోటు చేసుకోలేదు.. వాస్తవానికి ఆ బంతి కనుక సరైన స్ట్రోక్ లో తగిలి ఉంటే సిక్స్ గా వెళ్లేది.. కానీ వార్నర్ బంతిని సరిగా అంచనా వేయక బ్యాట్ ను అడ్వాన్స్ గా ఊపాడు. ఫలితంగా బంతి బ్యాట్ చివరి అంచు తగిలి లెగ్ సైడ్ వెళ్ళింది. అంతేకాదు వికెట్లను గిరాటేసింది. వార్నర్ కనుక ముందుగానే అప్రమత్తమై ఉంటే అవుట్ అయ్యే బాధ తప్పేది. కాగా, వార్నర్ అవుట్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.. ఈ వీడియో చూసిన నెటిజన్లు వార్నర్ పై సానుభూతి వ్యక్తం చేస్తున్నారు.. “చూసుకొని ఆడాలి కదా” అంటూ హితవు పలుకుతున్నారు.
ఈ సీజన్లో ఢిల్లీ తరఫున వార్నర్ కొన్ని మ్యాచ్ లలో మాత్రమే మెరిశాడు. కీలకమైన సమయంలో అనవసర షాట్ లు ఆడి నిర్లక్ష్యంగా వికెట్ పోగొట్టుకున్నాడు. శుక్రవారం నాటి మ్యాచ్ లోనూ అదే సంఘటన పునరావృతమైంది. వార్నర్ కనుక సరిగ్గా ఆడి ఉంటే అవుట్ అయ్యే ప్రమాదం ఉండేది కాదు. వార్నర్ లాంటి సీనియర్ ఆటగాడు అలా ఆడటం పట్ల సొంత జట్టు సభ్యులే విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
Dragged
As unfortunate as it gets for #DC opener David Warner as Yash Thakur strikes ⚡️⚡️
Watch the match LIVE on @StarSportsIndia and @JioCinema #TATAIPL | #LSGvDC pic.twitter.com/MQng1666XE
— IndianPremierLeague (@IPL) April 12, 2024