CSK Vs DC: ధోని వయసు ప్రస్తుతం 43 సంవత్సరాలు. సాధారణంగా ఈ వయసులో క్రికెట్ ఆడేవారు జాగ్రత్తగా ఉంటారు. ఎందుకంటే ఒకప్పటిలాగా వారికి శరీరం సహకరించదు. బ్యాటింగ్ లేదా బౌలింగ్ లేదా ఫీల్డింగ్ చురుకుగా చేయలేరు. పైగా ఈ వయసులో ఎముకలు బలహీనంగా మారుతుంటాయి.
Also Read: ఢిల్లీ 183.. చెన్నై గెలిచేది కష్టమే.. ఎందుకంటే
పై ఉపోద్ఘాతం మిగతా ఆటగాళ్లకు వర్తిస్తుందేమో గాని.. ధోనికి అది నప్పదు. ధోని వయసు 43 సంవత్సరాలు అయినప్పటికీ.. అతడు ఇప్పటికీ 25 సంవత్సరాల యువకుడి లాగానే ఆడుతున్నాడు. చెన్నై జట్టు లో కీలక ఆటగాడిగా కొనసాగుతున్న అతడు.. తనదైన మార్క్ ఆటతీరుతో ఆకట్టుకుంటున్నాడు. ఇటీవల ముంబై జట్టుతో జరిగిన మ్యాచ్లో సూర్య కుమార్ యాదవ్ ను మెరుపు వేగంతో స్టంప్ అవుట్ చేసి ధోని అతడినే కాదు.. యావత్ క్రికెట్ అభిమానులను ఆశ్చర్యంలో ముంచాడు. తనను చెన్నై జట్టు యజమాన్యం ఎందుకు రిటైన్ చేసుకుందో.. తనను మాత్రమే ఎందుకు కావాలి అనుకుంటున్నదో.. ఆటతీరుతో నిరూపించాడు ధోని.. ఇక శనివారం ఢిల్లీ జట్టుతో జరుగుతున్న మ్యాచ్ లోనూ ధోని తనదైన మార్క్ చూపించాడు. తనకు మాత్రమే సాధ్యమైన కీపింగ్ తో మరోసారి క్రికెట్ అభిమానులకు వీనుల విందైన ట్రీట్ ఇచ్చాడు.
అశు తోష్ శర్మ బిత్తర పోయాడు..
ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఢిల్లీ జట్టు ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. ఢిల్లీ జట్టు ఓపెనర్ రాహుల్ 77 పరుగులతో సత్తా చాటాడు. అభిషేక్ పోరెల్ 33 పరుగులతో ఆకట్టుకున్నాడు. స్టబ్స్ 22 పరుగులు చేసి సత్తా చాటాడు. అక్షర్ పటేల్ 21, రిజ్వి 20 తమదైన శైలిలో ఆడారు. 19 ఓవర్ వరకు ఢిల్లీ 176/4 వద్ద ఉంది. అప్పటికి క్రీజ్ లో కేఎల్ రాహుల్ (77), స్టబ్స్(21) ఉన్నారు. చివరి ఓవర్ మతిషా పతీరణ వేయడం మొదలుపెట్టాడు. తొలి బంతి వైడ్ వెల్లింది. మరో బంతి కూడా వైడ్ వెళ్ళింది. తర్వాత బంతిని స్టబ్స్ సింగిల్ తీశాడు. మరుసటి బంతి కేఎల్ రాహుల్ బ్యాట్ అంచును తగులుతూ కీపర్ ధోని చేతుల్లో పడింది. దీంతో 77 పరుగుల వద్ద కేఎల్ రాహుల్ అవుట్ అయ్యాడు. ఈ దశలో క్రీజ్ లోకి అశు తోష్ శర్మ వచ్చాడు. పతిరణ వేసిన బంతిని స్టబ్స్ సింగిల్ తీసేందుకు ప్రయత్నించాడు.
అశు తోష్ శర్మ వేగంగా పరిగెత్తినప్పటికీ..మిడ్ ఆన్ లో ఉన్న రవీంద్ర జడేజా వేగంగా బంతిని విసరడంతో వికెట్ల వెనుక ఉన్న ధోని అమాంతం అందుకున్నాడు. రెప్పపాటు లోనే వికెట్లను పడగొట్టాడు. దీంతో అశు తోష్ శర్మ నిరాశగా మైదానాన్ని వీడాడు. ధోని చేసిన మెరుపురన్ అవుట్ తో ఢిల్లీ జట్టు భారీ స్కోరు చేయలేకపోయింది. ఒకవేళ గనుక అశు తోష్ శర్మ రన్ అవుట్ కాకపోయి ఉండి ఉంటే ఢిల్లీ జట్టు స్కోరు దాదాపు 195 పరుగుల వరకు వెళ్ళేది కానీ ధోని చాకచక్యంతో అశు తోష్ శర్మ అవుట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన ఆటగాళ్లు పెద్దగా ప్రభావం చూపించలేకపోయారు. మొత్తంగా తనకు మాత్రమే సాధ్యమైన కీపింగ్ తో ధోని చెన్నై అభిమానులనే కాదు యావత్ క్రికెట్ ప్రేమికులను ఫిదా చేశాడు.
Jadeja Dhoni = Chennai’s Delight
Enjoy this moment of fielding brilliance from the two #CSK greats
Scorecard ▶ https://t.co/5jtlxucq9j #TATAIPL | #CSKvDC | @msdhoni | @imjadeja | @ChennaiIPL pic.twitter.com/rdC5qgDivB
— IndianPremierLeague (@IPL) April 5, 2025