CSK Vs DC: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 20 ఓవర్లు పూర్తిస్థాయిలో ఆడింది. ఆరు వికెట్ల నష్టపోయి 183 పరుగులు చేసింది. ఢిల్లీ ఆటగాళ్లలో ఓపెనర్ కేఎల్ రాహుల్ (77) టాప్ స్కోరర్ గా నిలిచాడు. అభిషేక్ పొరేల్(33), స్టబ్స్(22), అక్షర్ పటేల్ (21), రిజ్వి (20) అదరగొట్టారు. ఫలితంగా ఢిల్లీ క్యాపిటల్స్ 183 పరుగులు చేసింది. చెన్నై జట్టులో ఖలీల్ అహ్మద్ రెండు వికెట్లు సాధించాడు. రవీంద్ర జడేజా, నూర్ అహ్మద్, మతిష పతిరణ తలా ఒక వికెట్ పడగొట్టారు.. అయితే ఒకానొక దశలో ఢిల్లీ జట్టు స్కోర్ 200 మార్కు చేరుకుంటుందని అందరూ అనుకున్నారు. కానీ చివరి ఓవర్లను చెన్నై బౌలర్లు కట్టుదిట్టంగా వేశారు. ముఖ్యంగా చివరి ఓవర్ ను పతీరణ అద్భుతంగా వేశాడు. చివరి ఓవర్లో అతడు కేఎల్ రాహుల్, స్టబ్స్ ను వరుస బంతుల్లో వెనక్కి పంపించాడు. ఏడు పరుగులు మాత్రమే ఇచ్చాడు. దీంతో ఢిల్లీ జట్టు 200 పరుగులు చేయలేకపోయింది.
Also Read: ధోని రిటైర్మెంట్.. సంకేతాలివే..
చెన్నై గెలిచేది అనుమానమే
సొంత మైదానంలో ఆడుతున్నప్పటికీ ఢిల్లీ జట్టుపై చెన్నై గెలిచేది అనుమానమేనని తెలుస్తోంది. ఎందుకంటే సొంతమైదానంపై చెన్నై జట్టు రెండు సందర్భాల్లో మాత్రమే చేజింగ్లో సత్తా చాటింది. చెన్నై జట్టు సొంత మైదానంలో ఒక్కసారి మాత్రమే 175 + టార్గెట్ ను చేజ్ చేసింది. 180+ టార్గెట్ ను రెండుసార్లు మాత్రమే పూర్తి చేసింది. ఇదే మైదానంలో చెన్నై బెంగళూరు జట్ల మధ్య 2012లో మ్యాచ్ జరిగినప్పుడు.. బెంగళూరు విధించిన 205 పరుగుల లక్ష్యాన్ని చెన్నై జట్టు చేదించింది.. ఇక 2023లో ఇదే మైదానంపై చెన్నై జట్టు, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్లో పంజాబ్ జట్టు విధించిన 201 పరుగుల లక్ష్యాన్ని చెన్నై జట్టు చేదించింది. ఆ తర్వాత ఇప్పటివరకు మరోసారి ఆ ఘనతలను చెన్నై జట్టు సాధించలేకపోయింది. ఇక ప్రస్తుతం ఢిల్లీ జట్టు చెన్నై ఎదుట 184 పరుగుల టార్గెట్ విధించింది. అయితే ఈ టార్గెట్ పినిచేయడం చెన్నై జట్టుకు అంత ఈజీ కాదు. ఎందుకంటే ఢిల్లీ జట్టులో మేటి బౌలర్లు ఉన్నారు. చెన్నై పిచ్ పై అద్భుతాలు చేయగలిగే సామర్థ్యాలను వారు కలిగి ఉన్నారు. అయితే సొంత మైదానంలో ఆడుతున్న నేపథ్యంలో చెన్నై ఆటగాళ్లను తక్కువ చేసి చూడకూడదని క్రికెట్ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇక ఢిల్లీ విధించిన 184 రన్ టార్గెట్ తో రంగంలోకి దిగిన చెన్నై జట్టు.. తొలి ఓవర్ లో మిచెల్ స్టార్క్ బౌలింగ్లో పది పరుగులు చేసింది. ఓపెనర్లు రచిన్ రవీంద్ర (3), డేవిడ్ కాన్వే (2) క్రీజ్ లో ఉన్నారు.