https://oktelugu.com/

RCB Vs RR 2024: ఆర్సీబీని ఆటాడుకుంటున్న సీఎస్‌కే ఫ్యాన్స్‌!

ప్లేఆఫ్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ జట్టుతో ఆర్సీబీ ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో తలపడింది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన రాజస్థాన్‌ రాయల్స్‌ బౌలింగ్‌ ఎంచుకుంది. కీలక మ్యాచ్ లలో కుదురుగా ఆడిన ఆర్సీబీ ఆటగాళ్లు మొదట భారీ స్కోర్‌ దిశగా వెళ్తున్నట్లు కనిపించింది.

Written By:
  • Raj Shekar
  • , Updated On : May 23, 2024 / 09:25 AM IST

    RCB Vs RR 2024

    Follow us on

    RCB Vs RR 2024: ఐపీఎల్‌ 2024 సీజన్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు ప్రయాణం ముగిసింది. లీగ్‌ దశలో చావో రేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌ సీఎస్‌కేతో జరిగింది. ఈ మ్యాచ్‌లో పోరాట స్ఫూర్తి కనబర్చిన ఆర్సీబీ జట్టు… సీఎస్‌కేను ఓడించి ప్లేఫ్‌కు చేరింది. దీంతో సీఎస్‌కే ప్లేఆఫ్‌ ఆశలు ఆవిరయ్యాయి. టీమిండియా మాజీ కెప్టెన్, మిస్టర్‌ కూల్, జార్ఖండ్‌ డైనమైట్‌గా ఫ్యాన్స్‌ పిలుచుకునే ధోనికి ఈ ఐపీఎల్‌ చివరిదిగా అందరూ భావిస్తున్న వేళ.. వారి ఆశలపై ఆర్సీబీ నీళ్లు చల్లించింది. దీంతో సీఎస్‌కే ఫ్యాన్స్‌ కాస్త నొచ్చుకున్నారు. మరోవైపు మ్యాచ్‌ అనంతరం ఆర్సీబీ మాజీ సారథి, టీమిండియా మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ మిస్టర్‌ కూల్‌ ధోనీకి కనీసం కరచాలనం కూడా చేయలేదు. మరోవైపు ఆర్సీబీ ఫ్యాన్స్‌ సీఎస్‌కే జట్టును తెగ ట్రోల్‌ చేశారు.

    కీలక మ్యాచ్‌లో ఓటమి..
    ఇక ప్లేఆఫ్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ జట్టుతో ఆర్సీబీ ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో తలపడింది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన రాజస్థాన్‌ రాయల్స్‌ బౌలింగ్‌ ఎంచుకుంది. కీలక మ్యాచ్ లలో కుదురుగా ఆడిన ఆర్సీబీ ఆటగాళ్లు మొదట భారీ స్కోర్‌ దిశగా వెళ్తున్నట్లు కనిపించింది. కానీ, తర్వాత విటెట్లు పడడంతో 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. 173 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్‌ రాయల్స్‌ జట్టు నిదానంగా ఆడుతూ టార్గెట్‌ ఛేదించింది. చివరలో వరుసగా వికెట్లు పడడంతో కాస్త ఒత్తిడికి లోనైనా విజయం మాత్రం వరించింది. దీంతో కప్పు కొట్టాలన్న ఆర్సీబీ ఆశలు ఆవిరయ్యాయి. ఎలిమినేటర్‌ మ్యాచ్‌ కావడంతో ఆర్సీబీ ఆట ముగిసింది.

    సీఎస్‌కే ఫ్యాన్స్‌ ట్రోల్స్‌..
    ఇక ఈ మ్యాచ్‌ తర్వాత సీఎస్‌కే ఫ్యాన్స్‌ ఆర్సీబీని తెగ ట్రోల్‌ చేస్తున్నారు. లీగ్‌ మ్యాచ్‌లో కీలక విక్టరీతో చెన్నై ప్లేఆఫ్‌కు రాకుండా చేసినందుకు ఇప్పుడు బదులు తీర్చుకుంటున్నారు. మ్యాచ్‌లో సీఎస్‌కే ఫ్యాన్స్‌ రాజస్థాన్‌కు సపోర్టు చేశారు. వారు అనుకున్నట్లే ఆర్‌ఆర్‌ విజయం సాధించడంతో మ్యాచ్‌ అనంతరం ఆర్సీబీని ట్రోల్‌ చేసి ప్రతీకారం తీర్చుకున్నారు. సోషల్‌ మీ డియాలో మీమ్స్‌తో హోరెత్తిస్తున్నారు. ఆర్సీబీ పేరు, డ్రెస్సు మారినా రిజల్ట్‌ మారదంటూ సెటైర్లు వేస్తున్నారు.