Vijay Devarakonda: విజయ్ దేవరకొండ, రాహుల్ సంకృత్యాయన్ కాంబోలో వచ్చే సినిమాకి టైటిల్ ఏంటో తెలుసా..?

రవికిరణ్ డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తుంటే రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో మరొక సినిమా చేస్తున్నాడు. అయితే ఈ సినిమా పిరియాడికల్ డ్రామాగా తెరకెక్కుతుంది. ఇక 1854 నుంచి 1894 మంది జరిగే ఈ స్టోరీ నడవబోతున్నట్టుగా తెలుస్తుంది.

Written By: Gopi, Updated On : May 23, 2024 9:33 am

Vijay Devarakonda

Follow us on

Vijay Devarakonda: తెలుగు సినిమా ఇండస్ట్రీలో పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి లాంటి సినిమాలతో మంచి పేరు సంపాదించుకున్న విజయ్ దేవరకొండ రీసెంట్ గా చేసిన సినిమాలేవి కూడా సక్సెస్ లు సాధించడం లేదు. ఇక రీసెంట్ గా ఆయన చేసిన ఖుషి, ఫ్యామిలీ స్టార్ లాంటి సినిమాలు కూడా ఆశించిన ఫలితాన్ని అందించకపోవడంతో ఆయన ఇప్పుడు ఎలాంటి సినిమాలు చేయాలి అనే దాని మీదనే ఎక్కువ ఫోకస్ చేసినట్టుగా తెలుస్తుంది.

ఇక అందులో భాగంగానే ప్రస్తుతం రవికిరణ్ డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తుంటే రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో మరొక సినిమా చేస్తున్నాడు. అయితే ఈ సినిమా పిరియాడికల్ డ్రామాగా తెరకెక్కుతుంది. ఇక 1854 నుంచి 1894 మంది జరిగే ఈ స్టోరీ నడవబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ముఖ్యంగా ఈ సినిమాకి ‘రణభాలి ‘అనే టైటిల్ ని ఖరారు చేసినట్టుగా తెలుస్తుంది… ఇక మొత్తానికైతే ఈ సినిమా ఒక డిఫరెంట్ అటెంప్ట్ తో తెరకెక్కబోతున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి. ఇక ఇప్పటికే రాహుల్ సాంకృత్యాన్ చేసిన టాక్సివాలా, శ్యామ్ సింగారాయ్ సినిమాలు చాలా డిఫరెంట్ గా ఉంటాయి.

ఇక ఈ రెండు సినిమాలు కూడా మంచి సక్సెస్ లు సాధించడంతో రాహుల్ సంకృత్యన్ మీద తెలుగు సినిమా అభిమానులకు మంచి అభిప్రాయం అయితే ఏర్పడింది. ఇక మొత్తానికైతే ఈయన చేసిన ప్రతి సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించడంతో పాటుగా తనకు మంచి టేస్ట్ ఉన్న దర్శకుడిగా మంచి పేరైతే సంపాదించుకున్నాడు. ఇక అందులో భాగంగానే ఇప్పుడు చేయబోతున్న ఈ సినిమాలో కూడా స్టోరీ చాలా వైవిధ్యంగా ఉండబోతున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి.

ఇక ఇప్పటికే విజయ్ కి టాక్సీవాలా సినిమాతో మంచి విజయాన్ని అందించిన రాహుల్ ఈ సినిమాతో ఒక బ్లాక్ బాస్టర్ సక్సెస్ ను అందిస్తాడనే నమ్మకాన్ని అయితే వ్యక్తం చేస్తున్నాడు. మరి మొత్తానికైతే ఈ సినిమాలో విజయ్ ని చాలా డిఫరెంట్ గా చూపించాలని చూస్తున్నాడు…