Nitish Kumar Reddy : ఇటీవలి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో (border Gavaskar trophy)లో నితీష్ కుమార్ రెడ్డి మెరుగైన ఇన్నింగ్స్ ఆడాడు..మెల్ బోర్న్ మైదానంలో అద్భుతమైన ఆట తీరుతో ఆకట్టుకున్నాడు. సూపర్ సెంచరీ చేసి ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాడు.. అతడు సెంచరీ చేయడంతో రవిశాస్త్రి (Ravi Shastri) లాంటి ఆటగాడు కన్నీరు పెట్టుకున్నాడు. సునీల్ గవాస్కర్(Sunil Gavaskar) స్టాండింగ్ ఓ వేషన్ ఇచ్చాడు.. వాషింగ్టన్ సుందర్ లాంటి ఆటగాడితో నితీష్ కుమార్ రెడ్డి మెరుగైన భాగస్వామ్యం నెలకొల్పడంతో టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా కు దరిదాపుల్లోకి వచ్చింది. అయితే సెకండ్ ఇన్నింగ్స్ లో టీమిండియా అదే స్థాయిలో మ్యాజిక్ కంటిన్యూ చేయలేకపోవడంతో ఓడిపోక తప్పలేదు. అయితే నితీష్ కుమార్ రెడ్డి ఆ స్థాయిలో ఇన్నింగ్స్ ఆడటంతో.. మెల్ బోర్న్ మైదానంలో అతడికి అద్భుతమైన గౌరవం ఇచ్చారు. సెంచరీ చేసినందుకు గుర్తుగా అతని పేరును స్టేడియం లోని బోర్డుపై రాశారు. స్ఫూర్తిదాయకమైన సెంచరీ చేశారని కొనియాడారు.. ఇక ఇదే మైదానంలో టీమిండియా బౌలర్ బుమ్రా పదికిమించి వికెట్లు తీయడంతో.. అతని పేరు కూడా అందులో నమోదు చేశారు.
తిరుమల కొండపైకి..
తెలుగువాడైన నితీష్ కుమార్ రెడ్డి క్రికెటర్ కావాలని ఆశయంతో తీవ్రంగా కష్టపడ్డాడు. నితీష్ కుమార్ రెడ్డి కోసం అతడి తండ్రి తన ఉద్యోగానికి ఉన్నట్టుండి రాజీనామా చేశారు. హిందుస్థాన్ జింక్ లో పనిచేస్తున్న అతను తన ఉద్యోగానికి రాజీనామా చేసి కొడుకు కోసం త్యాగం చేశాడు. తండ్రి తనకోసం చేసిన త్యాగాన్ని ఏమాత్రం విస్మరించలేదు నితీష్ కుమార్ రెడ్డి. అద్భుతంగా తన కెరియర్ మలుచుకున్నాడు. దీనికోసం తీవ్రంగా కష్టపడ్డాడు.. చివరికి తను అనుకున్న లక్ష్యాన్ని సాధించాడు.. ప్రఖ్యాత మెల్ బోర్న్ మైదానంలో తక్కువ బంతుల్లో సెంచరీ చేసిన భారతీయ ఆటగాళ్ల జాబితాలో అతడు కూడా నిలిచాడు. తన కెరియర్ ఈ స్థాయిలో ఉండడంతో నితీష్ కుమార్ రెడ్డి తిరుమల దర్శనానికి వెళ్ళాడు.. దైవభక్తి ఎక్కువగా ఉండే నితీష్ కుమార్ రెడ్డికి.. తిరుమల(tirumala) వెంకటేశ్వర స్వామి(Venkateswara Swamy)ని దర్శించుకోవడం చాలా ఇష్టం. అందువల్లే తిరుమలకు కాలినడకన వెళ్లాడు. అంతేకాదు కొండపైకి వెళ్లిన అనంతరం మోకాళ్ళపై మెట్లు ఎక్కారు. దానికి సంబంధించిన వీడియోను ఇన్ స్టా గ్రామ్ లో నితీష్ కుమార్ రెడ్డి షేర్ చేశారు.. మంగళవారం నితీష్ కుమార్ రెడ్డి తెల్లవారుజామున స్వామివారిని దర్శించుకున్నారు. ఆయన దర్శనానికి కావలసిన ఏర్పాట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు పూర్తి చేశారు. దర్శనం అనంతరం స్వామివారి లడ్డు ప్రసాదాన్ని నితీష్ కుమార్ రెడ్డికి అందజేశారు.
తెలుగు యువ క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి కాలినడకన తిరుమలకు వెళ్లారు.. మోకాళ్లపై మెట్లు ఎక్కారు.. దానికి సంబంధించిన వీడియోను తన ఇన్ స్టా లో పోస్ట్ చేశారు.. మంగళవారం తెల్లవారుజామున స్వామి వారిని నితీష్ కుమార్ రెడ్డి దర్శించుకుంటారు. #nitishkumarreddy #Tirumala pic.twitter.com/zaF6oSwWgF
— Anabothula Bhaskar (@AnabothulaB) January 13, 2025