Vaibhav Suryavanshi IPL 2025: యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ తన క్రికెట్ ఆడే విధానంతో అందరి మనసులను గెలుచుకున్నాడు. ముఖ్యంగా ఐపీఎల్ 2025లో అతను ఆడిన తీరు అందరినీ ఆకట్టుకుంది. అప్పుడు తనకు రెండు లగ్జరీ కార్లు బహుమతిగా వచ్చాయి. అతడి వద్ద అద్భుతమైన కార్ కలెక్షన్ ఉంది. కానీ, అతను ఈ కార్లను నడపలేడు. దీని వెనుక ఉన్న కారణం ఏంటో తెలుసుకుందాం. వైభవ్ సూర్యవంశీ ప్రస్తుత వయస్సు కేవలం 14 సంవత్సరాలు మాత్రమే. అతనికి ఇంకా డ్రైవింగ్ లైసెన్స్ లేదు. దీనివల్ల అతను ప్రస్తుతం ఏ వాహనాన్నీ నడపలేడు. ఎందుకంటే, భారతదేశంలో డ్రైవింగ్ లైసెన్స్ పొందడానికి కనీస వయస్సు 18 సంవత్సరాలు. కాబట్టి, వైభవ్ కారు నడపడానికి డ్రైవింగ్ లైసెన్స్ వచ్చే వరకు వేచి చూడాలి. భారతదేశంలో డ్రైవింగ్ లైసెన్స్ పొందడానికి 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అయితే, 50 సీసీ కంటే తక్కువ కెపాసిటీ ఉన్న, గేర్ లెస్ టూ వీలర్స్ నడపడానికి డ్రైవింగ్ లైసెన్స్ పొందడానికి కనీస వయస్సు 16 సంవత్సరాలు. కానీ, దీనికి కూడా కుటుంబ సభ్యుల అనుమతి కావాలి. ఐపీఎల్‌లో వైభవ్‌కు మొత్తం రెండు కార్లు బహుమతిగా వచ్చాయి. అందులో ఒకటి టాటా కర్వ్ ఈవీ, మెర్సిడెస్-బెంజ. ఈ రెండు కార్ల ధరలు, వాటి స్పెషాలిటీ ఏంటో చూద్దాం.
Also Read: ఏం షాట్ రా ఇదీ.. ఫ్యూజులు ఎగిరిపోయాయి
టాటా కర్వ్ ఈవీ
టాటా కర్వ్ ఈవీ టాప్ స్పెక్ వేరియంట్ ధర రూ.17.49 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 585 కిలోమీటర్ల వరకు రేంజ్ ఇస్తుంది. ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీకి సుమారు 502 కిలోమీటర్ల రేంజ్ ఉంటుంది. ఇది రెండు బ్యాటరీ ప్యాక్‌లతో వస్తుంది. ఒకటి 45kWh యూనిట్, మరొకటి 55kWh యూనిట్. ఇందులో లెవెల్-2 ఏడీఏఎస్, పనోరమిక్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ సీట్లు వంటి అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయి. భారతదేశంలో కాంపాక్ట్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీల సెగ్మెంట్లో ఇది ఎంజీ జెడ్‌ఎస్ ఈవీతో పోటీపడుతుంది.
మెర్సిడెస్-బెంజ్
మెర్సిడెస్-బెంజ్ అనగానే లగ్జరీ కార్ అన్న సంగతి తెలిసిందే. ఈ కారులో అద్భుతమైన టెక్నాలజీ ఉంటుంది. అలాగే, సేఫ్టీ పరంగా కూడా ఇది చాలా బలంగా ఉంటుంది. భారత మార్కెట్‌లో మెర్సిడెస్-బెంజ్ సి-క్లాస్ ధర రూ.59.40 లక్షలు. మెర్సిడెస్-బెంజ్ ఈ-క్లాస్ ధర రూ.76.25 లక్షలు. మెర్సిడెస్-బెంజ్ జీఎల్‌ఎస్ ధర రూ.1.13 కోట్ల నుండి మొదలవుతుంది. ఈ కారులో పెద్ద టచ్‌స్క్రీన్ ఉన్న ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, నావిగేషన్, క్రూయిజ్ కంట్రోల్, లేన్ కీపింగ్ అసిస్ట్, ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. దీంతోపాటు ఈ కారులో ఏబీఎస్, ఈఎస్‌సీ వంటి సేఫ్టీ ఫీచర్లు కూడా ఉన్నాయి.
ఇంత చిన్న వయసులోనే వైభవ్ సూర్యవంశీకి కోట్లు విలువ చేసే లగ్జరీ కార్లు సంపాదించుకున్నాడు. కానీ, భారత చట్టాల ప్రకారం డ్రైవింగ్ లైసెన్స్ పొందడానికి 18ఏళ్ల వయసు నిండాలి కాబట్టి, అతను ఇప్పుడు ఈ కార్లను స్వయంగా నడపలేకపోతున్నాడు.