Tourist Family Beats Chhaava: ఈ ఏడాది పెద్ద హీరోల సినిమాల హవానే లేదు. చిన్న సినిమాలే రాజ్యం ఏలుతున్నాయి. భారీ అంచనాల నడుమ విడుదల అవుతున్న పెద్ద సినిమాలు, మీడియం రేంజ్ హీరోల సినిమాలు కనీస స్థాయిలో కూడా ఆడడం లేదు. ఈ ఏడాది మన టాలీవుడ్ ని అయితే చిన్న సినిమాలే కాపాడాయి. తమిళనాడు లో కూడా అదే పరిస్థితి. పెద్ద సినిమాలలో ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ మినహా, మిగిలినవన్నీ ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్స్ గా నిలిచాయి. భారీ అంచనాల నడుమ విడుదలైన సూర్య(Suriya Sivakumar) ‘రెట్రో’, కమల్ హాసన్(Kamal Haasan) ‘థగ్ లైఫ్’ చిత్రాలు కనీసం 50 శాతం రీకవరీ రేట్ ని కూడా సొంతం చేసుకోలేకపోయాయి అంటేనే అర్థం చేసుకోవచ్చు, తమిళ సినిమా ఇండస్ట్రీ ప్రస్తుత పరిస్థితి. అలాంటి సమయం లో విడుదలైన ‘టూరిస్ట్ ఫ్యామిలీ'(Tourist Movie) అనే చిన్న చిత్రం కమర్షియల్ గా సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అయ్యింది.
మొదటి ఆట నుండే ఈ సినిమాకు విపరీతమైన పాజిటివ్ టాక్ రావడంతో, యూత్ ఆడియన్స్ నుండి ఫ్యామిలీ ఆడియన్స్ వరకు అందరూ ఈ సినిమాకు క్యూ కట్టారు. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రానికి 90 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఈ సినిమాని నిర్మించడానికి కేవలం 7 కోట్ల రూపాయిల బడ్జెట్ మాత్రమే ఖర్చు అయ్యింది. మొదటి వారం ఈ చిత్రానికి 23 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను మాత్రమే రాబట్టింది, కానీ రెండవ వారం నుండి ఈ చిత్రం 67 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టిందంటే ఏ రేంజ్ లాంగ్ రన్ వచ్చిందో మీ అందరికీ అర్థం అవుతుంది కదా. ఇది చూసిన తర్వాత కూడా ఇంకా థియేటర్స్ కి జనాలు రావడం లేదు అనేవాళ్ళని ఏమనాలి చెప్పండి?, దమ్మున్న కంటెంట్ తో సినిమా తీస్తే జనాలు నెత్తిన పెట్టుకొని మరీ ఆదరిస్తారు అనడానికి ఈ సినిమా ఒక ఉదాహరణ.
Also Read: Vishwambhara movie controversy: విశ్వంభర చిత్రాన్ని టార్గెట్ చేసి ఖతం చేస్తున్నారే
ఈ ఏడాది ఇండియా వైడ్ గా అత్యంత భారీ లాభాలను సొంతం చేసుకున్న చిత్రం గా ‘చావా'(Chhaava Movie) నిల్చింది. పెట్టి బిజినెస్ కి దాదాపుగా 800 శాతం లాభాలను రాబట్టిందట ఈ సినిమా. కానీ ‘ది టూరిస్ట్’ ఫ్యామిలీ చిత్రం 1200 శాతం లాభాలను రాబట్టి ఈ ఏడాది అత్యధిక లాభాలను రాబట్టిన ఏకైక ఇండియన్ సినిమాగా సరికొత్త చరిత్ర సృష్టించిందని అంటున్నారు ట్రేడ్ పండితులు. ఇది సాధారణమైన విషయం కాదు. కంటెంట్ ఉన్న సినిమా పవర్ ఇలా ఉంటుంది మరీ. రీసెంట్ గానే ఓటీటీ లో విడుదలైన ఈ సినిమాకు అక్కడ కూడా భారీ రెస్పాన్స్ వస్తుంది. ఇలాంటి మ్యాజిక్స్ ఈ ఏడాది తమిళ సినిమా ఇండస్ట్రీ లో చాలానే జరిగాయి. పెద్దగా స్టార్ క్యాస్ట్ లేని సినిమాలే ఈ రేంజ్ వసూళ్లను రాబడుతుంటే, ఇక స్టార్ క్యాచ్ ఉన్న సినిమాలను పర్ఫెక్ట్ గా తీస్తే ఎలాంటి వసూళ్లు వస్తాయో మీరే ఊహించుకోండి.