Homeక్రీడలుక్రికెట్‌Shubman Gill 269 runs: గిల్ నుంచి సెహ్వాగ్ దాకా.. టెస్ట్ క్రికెట్లో సాధించిన రికార్డులు...

Shubman Gill 269 runs: గిల్ నుంచి సెహ్వాగ్ దాకా.. టెస్ట్ క్రికెట్లో సాధించిన రికార్డులు ఇవి.. మొదటి స్థానంలో ఉంది ఎవరో తెలుసా?

Shubman Gill 269 runs: ఇంగ్లీష్ జట్టుతో జరుగుతున్న 2వ టెస్టులో భారత జట్టు సారథి గిల్ ద్వి శతకం సాధించాడు. 269 పరుగులు చేసి అదరగొట్టాడు. అత్యంత చిన్న వయసులో ఈ ఘనత సాధించిన రెండవ టీమిండియా కెప్టెన్ గా రికార్డు సృష్టించాడు. గిల్ 269 పరుగులు చేయడంతో ఇండియా 587 రన్స్ కు ఆల్ అవుట్ అయింది. 269 పరుగులు చేయడం ద్వారా గిల్ సరికొత్త రికార్డులు సృష్టించాడు.. ఇటీవల తొలి టెస్టులో గిల్ సెంచరీ చేశాడు. రెండవ ఇన్నింగ్స్ లో తేలిపోయినప్పటికీ.. రెండవ టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో డబుల్ సెంచరీ చేసి అదరగొట్టాడు.. జట్టు పీకల్లోతు కష్టాల్లో ఉన్నప్పుడు రంగంలోకి వచ్చి రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ తో అత్యంత కీలకమైన భాగస్వామ్యాలు నెలకొల్పాడు.

Also Read: విరాట్ ను అధిగమించాడు.. సచిన్ కంటే ముందు నిలిచాడు.. అయినప్పటికీ గిల్ రెండవ స్థానంలోనే..

గిల్ 269 పరుగులు చేసి రికార్డు సృష్టించినప్పటికీ.. టెస్ట్ క్రికెట్ జాబితాలో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాళ్లల్లో అతని స్థానం ఏడు. ఈ జాబితాలో వీరేంద్ర సెహ్వాగ్ మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు.. వీరేంద్ర సెహ్వాగ్ టీమ్ ఇండియాకు పాడినప్పుడు ఏకంగా రెండు త్రి శతకాలు బాదాడు. ఇందులో ఒక ద్వి శతకం కూడా ఉంది. సుదీర్ఘ ఫార్మాట్లో టీమ్ ఇండియా తరఫున హైయెస్ట్ స్కోర్ వీరేంద్ర సెహ్వాగ్ చేసిన 319 పరుగులు కావడం విశేషం. రెండవ స్థానంలోనూ వీరేంద్రుడు చేసిన 309 పరుగులు ఉండడం గమనార్హం.. సెహ్వాగ్ తర్వాత కె. నాయర్ చేసిన 303* పరుగులు థర్డ్ హైయెస్ట్ స్కోర్ గా ఉన్నాయి. ఆ తర్వాత సెహ్వాగ్ చేసిన 293 పరుగులు నాలుగవ అత్యధిక స్కోర్ గా ఉంది. వీవీఎస్ లక్ష్మణ్ 281 రాహుల్ ద్రావిడ్ 270 , గిల్ 269, విరాట్ కోహ్లీ 254*, వీరేంద్ర సెహ్వాగ్ చేసిన 254 పరుగులు తదుపరి స్థానాలలో ఉన్నాయి.


వాస్తవానికి వీరేంద్ర సెహ్వాగ్ దూకుడుగా ఆడతాడు. బలంగా కొడతాడు. ఉన్నంత సేపు స్కోర్ బోర్డును పరుగులు పెట్టిస్తాడు. అంతే తప్ప అన్ని నిదానంగా ఆడటం అతనికి రాదు. పైగా సింగిల్స్ తీయడం అంటే అతడికి చెడ్డ చిరాకు. అందువల్లే బౌండరీలను ఇష్టానుసారంగా కొడుతుంటాడు. బౌలర్ ఎవరనేది పట్టించుకోడు. పిచ్ తో సంబంధం లేకుండానే బ్యాటింగ్ చేస్తాడు. అందువల్లే దశాబ్దాలు గడిచినప్పటికీ అతని రికార్డును ఏ ఆటగాడు కూడా బద్దలు కొట్టలేకపోతున్నాడు. వాస్తవానికి ఇంగ్లాండ్ జట్టుతో జరుగుతున్న రెండో టెస్టులో గిల్ ద్వి శతకం చేసిన నేపథ్యంలో సెహ్వాగ్ రికార్డు బద్దలవుతుందని అందరూ అనుకున్నారు. కానీ గిల్ అనుకోకుండా అవుట్ కావడంతో సెహ్వాగ్ రికార్డ్ పటిష్టంగా ఉంది..

సుదీర్ఘ ఫార్మాట్లో సమయోచితంగా బ్యాటింగ్ చేసే చరిత్ర లక్ష్మణ్, ద్రావిడ్ గా ఉంది. అయినప్పటికీ వారిద్దరినీ కాదని సెహ్వాగ్ తన పేరు మీద ఏకంగా రెండు త్రి శతకాలు, ఒక ద్వి శతకం నమోదు చేసుకున్నాడు. అయితే అతడు సాధించిన రెండు త్రి శతకాల రికార్డులను ఇంతవరకు ఏ ఆటగాడు కూడా బద్దలు కొట్టలేకపోవడం విశేషం. అయితే పాతిక సంవత్సరాల వయసులో గిల్ ఏకంగా 269 పరుగులు చేసిన నేపథ్యంలో.. అతనికి ఇంకా సుదీర్ఘ ఫార్మాట్ ఆడే అవకాశం ఉండడంతో.. భవిష్యత్తు కాలంలో సెహ్వాగ్ రికార్డు గిల్ బద్దలు కొట్టే అవకాశం లేకపోలేదు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular