Shreyas vs Gambhir Captaincy: బీభత్సంగా బ్యాటింగ్ చేస్తాడు. అద్భుతంగా పరుగులు రాబడతాడు. ముఖ్యంగా వికెట్ల మధ్య అత్యంత వేగంగా పరుగులు తీస్తాడు. ఎప్పటికప్పుడు వ్యూహాలు మార్చుతూ ప్రత్యర్థి జట్టు మీద విపరీతమైన ఒత్తిడి తీసుకొస్తాడు. మైదానంలో మాత్రం అత్యంత నిదానంగా ఉంటాడు. అందువల్లే ఐపీఎల్ లో షారుక్ ఖాన్ జట్టు విజేతగా నిలిచింది. ఇటీవల ప్రీతిజింతా జట్టు జస్ట్ వెంట్రుక వాసిలో ట్రోఫీని కోల్పోయింది. ఇంతటి స్థాయి ఉంది కాబట్టే శ్రేయస్ అయ్యర్ కు విపరీతమైన క్రేజ్ ఉంది.
Also Read: Gautam Gambhir: గౌతమ్ గంభీర్ కోచ్ పదవికి ముప్పు.. ఆ టోర్నీ లో టీమిండియా సత్తా చాటకపోతే ఇక అంతే సంగతులు!
అయ్యర్ గొప్ప ఆటగాడు అయినప్పటికీ జట్టులో అతని స్థానం స్థిరంగా ఉండడం లేదు. గత ఏడాది అతనికి ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు. దీంతో అతడు రంజి ట్రోఫీలో తనను తాను నిరూపించుకున్నాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అదరగొట్టాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో దుమ్మురేపాడు. ఇక ఐపీఎల్ లో అతని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇంత గొప్పగా ఆడుతున్నప్పటికీ అయ్యర్ కు ఇంగ్లీష్ జట్టుతో జరిగే టెస్ట్ సిరీస్ లో అవకాశం లభించలేదు. పైగా అతడి స్థానం గురించి విలేకరులు ప్రశ్నిస్తే.. మేనేజ్మెంట్ పొంతన లేని సమాధానాలు చెప్పింది. ఈ ప్రకారం చూసుకుంటే జట్టు కోచ్ గౌతమ్ గంభీర్ అడ్డుపడుతున్నాడని.. అయ్యర్ కు అవకాశాలు లభించకుండా చూస్తున్నాడని ఆరోపణలు వినిపించడం మొదలుపెట్టాయి. దీనికి తగ్గట్టుగానే అయ్యర్ పై గౌతమ్ గంభీర్ వ్యవహార శైలి ఉండడంతో.. పై ఆరోపణలకు బలం చేకూరినట్టవుతోంది.
ప్రస్తుతం టీమిండియా ఇంగ్లీష్ జట్టుతో సిరీస్ ముగించిన తర్వాత.. బంగ్లా జట్టుతో పొట్టి ఫార్మాట్లో సిరిస్ ఆడుతుంది. టీమిండియాకు పొట్టి ఫార్మాట్ విభాగంలో సూర్య కుమార్ యాదవ్ నాయకత్వం వహిస్తున్నాడు. అయితే బంగ్లా తో జరిగే పొట్టి సిరీస్ కు అతడు అందుబాటులో ఉండడు. ఎందుకంటే అతడు పొత్తికడుపు ప్రాంతంలో నొప్పి) తో చాలాకాలంగా బాధపడుతున్నాడు. అయితే ఇలాంటి ఇబ్బంది ఉన్న ప్లేయర్లు లండన్ లో శస్త్ర చికిత్స చేయించుకుంటారు. అయితే స్పోర్ట్స్ హెర్నియాతో ఇబ్బంది పడటం సూర్య కుమార్ యాదవ్ కు ఇది రెండవసారి. గతంలో అతడు దీనికి శస్త్ర చికిత్స కూడా చేయించుకున్నాడు. అయితే అది మళ్లీ తిరగబెట్టిన నేపథ్యంలో సూర్య కుమార్ యాదవ్ శస్త్ర చికిత్స కోసం లండన్ వెళ్లిపోతున్నాడు.
సూర్య కుమార్ యాదవ్ గైర్హాజరీ వల్ల పొట్టి ఫార్మాట్ విభాగంలో భారత జట్టుకు శ్రేయస్ అయ్యర్ నాయకత్వం వహిస్తాడని.. జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. త్వరలోనే అయ్యర్ ను సారధిగా మేనేజ్మెంట్ ప్రకటిస్తుందని.. అయ్యర్ ఆధ్వర్యంలో భారత జట్టు బంగ్లాదేశ్ ను ఢీకొంటుందని జాతీయ మీడియాలో కథనాలు ప్రసారమవుతున్నాయి. అయితే దీనిపై అధికారికంగా బీసీసీఐ ఇంతవరకు స్పందించలేదు. ఒకవేళ అయ్యర్ కనుక సారధి అయితే.. గౌతమ్ గంభీర్ పై విమర్శలు మరింత పెరిగిపోతాయని.. సోషల్ మీడియాలో అతడిని నెటిజన్లు ఒక ఆట ఆడుకుంటారని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు.