Transgender Manjamma Story: జీవితంలో అత్యున్నత శిఖరానికి ఎదగాలంటే ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కోవాలి. కొందరికి జీవితం పూల పాన్పులాగా ఉంటే.. మరికొందరికి మాత్రం ముళ్ళకంపలపై నడిచిన విధంగా ఉంటుంది. ఇంకొందరికి మాత్రం ఎన్నో అవమానాలు.. బాధలు.. తట్టుకుంటూ ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. ఈ క్రమంలో కొందరు ధైర్యం చెడి ప్రాణాలు తీసుకునే సందర్భాలు ఉన్నాయి. కానీ కొందరు మాత్రం ఎంత కష్టం వచ్చినా జీవితంలో ఎదగాలన్న ఆశతో ముందుకు వెళ్లి అందరి చేత ప్రశంసలు అందుకున్న వారు ఉన్నారు. వీరిలో ముఖ్యంగా ట్రాన్స్ జెండర్ ల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. పురుష, స్త్రీ కాకుండా మూడో రకమైన వీరిని సమాజంలో కొందరు ఇప్పటికీ యాక్సెప్ట్ చేయరు. వారు ఏ తప్పు చేయకపోయినా వారిని చూడగానే ఏదైనా చేస్తూ ఉంటారు. అయితే ఈ హేళనలు తట్టుకొని మిగతా వారి కంటే అత్యున్నత స్థాయికి ఎదిగి శభాష్ అనిపించుకున్న మంజమ్మ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఇంతకీ ఆమె ఎవరు? ఆమె చరిత్ర ఏంటి?
సాధారణంగా పద్మశ్రీ పురస్కారం వివిధ రంగాల్లో సేవ చేసిన వారికి ఇస్తూ ఉంటారు. కానీ దేశంలో మొట్టమొదటిసారిగా ఒక ట్రాన్స్ జెండర్ దేశంలో అత్యున్నత పురస్కారాల్లో ఒకటైన పద్మశ్రీని మంజమ్మ అందుకున్నారు. జానపద నృత్య కారినిగా గుర్తింపు పొందిన ఈమె గొప్ప సంఘసంస్కర్తగా ఎందరికో ఆదర్శంగా నిలిచారు. చిన్ననాటి నుంచి ఎన్నో అవమానాలు ఎదుర్కొన్న ఈమె నేడు సన్మానాలు అందుకుంటూ అందరి చేత శభాష్ అనిపించుకుంటున్నారు.
కర్ణాటక రాష్ట్రంలోని బళ్లారి జిల్లా కల్లు కంబ గ్రామానికి చెందిన మంజమ్మ అసలు పేరు మంజునాథ్ శెట్టి. అయితే యవ్వనంలోకి రాగానే తన శరీరంలో వచ్చిన మార్పులకు అనుగుణంగా మంజమ్మ అనే పేరుగా మార్చుకున్నారు. అయితే మొదట్లో కుటుంబం ఒప్పుకోకపోయినా ఆ తర్వాత మంజమ్మను జోగప్పగా మార్చారు. కర్ణాటక రాష్ట్రంలోని హాస్పేట్ సమీపంలో హులి గేయమ్మ ఆలయంలో జోగతిగా మారిన మంజమ్మ అప్పటినుంచి దేవతలను స్తుతిస్తూ జానపద పాటలు పాడుతూ వచ్చారు. అలా ఆమె జానపద నృత్యకారునిగా వృత్తిని ప్రారంభించి ప్రదర్శనలు చేసేవారు. అయితే ఈమెకు ఆశ్రయం ఇచ్చిన జోగిని కాలవ్వా మరణించడంతో మంజమ్మ జోగిని బృందం బాధ్యతలను స్వీకరించారు. ఆ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా ప్రదర్శనలు చేశారు.
Also Read: Padma Awards 2021: సామాన్యులే సాధించేశారు.. పద్మశ్రీ అవార్డు గ్రహీతల విజయగాథ ఇదీ..
ఇలా ఎన్నో ప్రదర్శనలు చేసిన మంజమ్మను కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం అనేక రకాలుగా సత్కరించింది ఇందులో భాగంగా మంజమ్మ 2006లో కర్ణాటక జానపద అకాడమీ అవార్డు అందుకున్నారు. ఆ తర్వాత 2019లో కర్ణాటక జానపద అకాడమీ సంస్థ అధ్యక్షురాలిగా నియమితులయ్యారు. అంతే కాకుండా 2010లో కర్ణాటక ప్రభుత్వం మంజమ్మ ను రాజోత్సవ అవార్డుతో సత్కరించింది. అలాగే 2021లో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా మంగమ్మ తనదైన స్టైల్ లో నమస్కరించి ఆకర్షణగా నిలిచారు.
సమాజంలో ఇప్పుడిప్పుడే గుర్తింపు తెచ్చుకుంటున్న ట్రాన్స్ సెంటర్ లో ఇప్పటికే ఎన్నో రకాలుగా విజయాలు సాధించారు. అయితే ముందు ముందు వీరికి అవకాశం ఇస్తే అన్నిట్లోనూ తమదే పై చేయి అన్నట్లుగా ఉంటారని కొందరు భావిస్తున్నారు. ఇలాంటి వారికి మంజమ్మ జమ్మ ఆదర్శంగా నిలుస్తారని చెబుతున్నారు.