Gautam Gambhir: గౌతమ్ గంభీర్ గత ఐపీఎల్ (IPL) కోల్ కతా నైట్ రైడర్స్ (Kolkata knight riders) కు మెంటార్ గా వ్యవహరించాడు.. ఆ సీజన్లో శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) నాయకత్వంలో కోల్ కతా జట్టు విజేతగా ఆవిర్భవించింది. ఆ తర్వాత గౌతమ్ గంభీర్ పేరు అంతర్జాతీయ స్థాయిలో మారుమోగిపోయింది. అదే సమయంలో రాహుల్ ద్రావిడ్ (Rahul Dravid) పదవి కాలం కూడా ముగింపుకు రావడంతో.. నాడు బిసిసిఐ సెక్రటరీగా ఉన్న జై షా(Jai sha) గౌతమ్ గంభీర్ (Gautam Gambhir) వద్దకు వెళ్లాడు. టీమిండియా కోచ్ గా రావాలని కోరాడు. దానికి మొదట్లో గౌతమ్ గంభీర్ ఒప్పుకోలేదు. ఆ తర్వాత జై షా అనేక మంతనాలు జరపడంతో గౌతమ్ ఒప్పుకున్నాడు. శ్రీలంక సీరీస్ ద్వారా గౌతమ్ గంభీర్ ప్రయాణం టీమిండియాతో మొదలైంది. ఆ సిరీస్లో టీమ్ ఇండియాకు మిశ్రమ ఫలితాలు వచ్చాయి. టి20 సిరీస్ వైట్ వాష్ చేయగా.. వన్డే సిరీస్ ఓడిపోయింది. 33 సంవత్సరాల తర్వాత శ్రీలంక చేతిలో తొలిసారిగా టీమిండియా సిరీస్ కోల్పోయింది. ఆ తర్వాత బంగ్లాదేశ్ లో జరిగిన టెస్ట్, టి20 సిరీస్ గెలిచిన టీమిండియా.. న్యూజిలాండ్ చేతిలో స్వదేశంలో టెస్ట్ సిరీస్ వైట్ వాష్ కు గురైంది. ఆ తర్వాత దక్షిణాఫ్రికా జరిగిన టి20 సిరీస్ ను టీమిండియా దక్కించుకుంది. ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని (border Gavaskar trophy) కోల్పోయింది.. ఈ ఓటమితో వరాల టెస్ట్ ఛాంపియన్ ఫైనల్స్ వెళ్లే అవకాశాలను కూడా టీమిండియా పోగొట్టుకుంది.
వరుస ఓటములతో
టి20ల పరంగా పర్వాలేదనిపించినప్పటికీ.. టెస్టుల పరంగా టీమ్ ఇండియా దారుణమైన ఆట తీరు ప్రదర్శిస్తోంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్స్ లో భారత జట్టు గత రెండు పర్యాయాలు ఫైనల్స్ వెళ్ళింది. . కానీ ఈసారి దారుణంగా ఓడిపోయింది. గెలిస్తేనే ఫైనల్స్ వెళ్లే ఆశలు ఉన్న మ్యాచులలో ఓటమిపాలైంది. ఇవన్నీ కూడా టీమిండియా పరువును గంగపాలు చేస్తున్నాయి. ఈ క్రమంలో గౌతమ్ గంభీర్ కోచింగ్ తీరుపై అనేక ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే గౌతమ్ గంభీర్, సీనియర్ ఆటగాళ్ల మధ్య ఉప్పు నిప్పులాగా పరిస్థితి ఉంది. ఇటీవల ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ జరిగినప్పుడు డ్రెస్సింగ్ రూమ్ లో విభేదాలు బయటపడ్డాయని వార్తలు వచ్చాయి. అయితే ఇవి దీర్ఘకాలంలో జట్టుకు మంచివి కావని మేనేజ్మెంట్ భావించినట్టు తెలుస్తోంది. అందువల్లే త్వరలో జరగబోయే ఛాంపియన్స్ ట్రోఫీ(champions trophy) లో టీమ్ ఇండియా మెరుగైన ఆట తీరు ప్రదర్శిస్తేనే గౌతమ్ గంభీర్ పదవీకాలం పొడగింపు ఉంటుందని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.. ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత సమీక్ష నిర్వహించి.. బీసీసీఐ తుది నిర్ణయం తీసుకుంటుందని జాతీయ మీడియా చెబుతోంది. ఒకవేళ ఆ ట్రోఫీలో భారత విఫలమైతే గంభీర్ ను పక్కన పెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. గత ఏడాది జూలై నెలలో గౌతమ్ గంభీర్ కోచ్ గా బాధ్యతలు స్వీకరించాడు. టీమిండియా 10 టెస్టులలో.. ఆరింట్లో ఓడిపోయింది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో గౌతమ్ గంభీర్ వ్యవహరించిన తీరు.. దానివల్ల చెలరేగిన వివాదాలు అందరికీ తెలిసినవే.