Rohit Sharma (6)
Rohit Sharma: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఆస్ట్రేలియా(Australia)పర్యటనలో పేలవ ఫామ్ కారణంగా ఆఖరి టెస్టు నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. ఆ సిరీస్‌లో మూడు మ్యాచ్‌లు ఆడిన అతడు కేవలం 31 పరుగులు మాత్రమే చేశాడు. ఈ నేపథ్యంలో అతడి టెస్టు కెరీర్ ముగిసినట్లే కనిపించింది. అయితే, ఛాంపియన్స్ ట్రోఫీ(Champions Trophy)లో జట్టును విజయతీరాలకు చేర్చిన తర్వాత, జూన్ 20, 2025న హెడింగ్లీలో ఇంగ్లాండ్‌తో జరిగే టెస్టు సిరీస్‌కు రోహిత్ కెప్టెన్‌గా ఉంటాడనే వార్తలు వచ్చాయి. కానీ, తాజా సమాచారం ప్రకారం, రోహిత్ ఈ సిరీస్ ఆడేందుకు సుముఖంగా లేడని, ఈ విషయాన్ని సెలక్టర్లకు స్పష్టం చేశాడని తెలుస్తోంది. దీంతో అతడి టెస్టు భవిష్యత్తుపై సందిగ్ధత నెలకొంది.
Also Read: తాగినంత మద్యం.. తిన్నంత తిండి.. DK ట్రీట్ మామూలుగా లేదు..
కోహ్లీ కొనసాగింపు..
మరోవైపు, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి(Virat Kohli) టెస్టు జట్టులో కొనసాగనున్నాడు. ఆస్ట్రేలియా సిరీస్‌లో ఒక సెంచరీతో రాణించిన కోహ్లి, ఇంగ్లాండ్ పర్యటనలోనూ కీలక ఆటగాడిగా ఉండనున్నాడు. 45 రోజుల ఈ పర్యటనలో టెస్టు సిరీస్‌తో పాటు, మే–జూన్‌లో ఇంగ్లాండ్ లయన్స్‌తో రెండు సన్నాహక మ్యాచ్‌ల కోసం భారత్–ఎ జట్టు పర్యటించనుంది. ఈ మ్యాచ్‌లలో టెస్టు జట్టు ప్రధాన ఆటగాళ్లు పాల్గొనే అవకాశం ఉంది.
కాంట్రాక్ట్ జాబితాలో మార్పులు..
బీసీసీఐ(BCCI) సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితాలో మార్పులు చోటు చేసుకోనున్నాయి. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, రవీంద్ర జడేజా ఎ ప్లస్ నుంచి ఎ కేటగిరీకి దిగజారే అవకాశం ఉంది. టీ20 అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన వీరికి, మూడు ఫార్మాట్లలో ఆడే ఆటగాళ్లకు ప్రాధాన్యత ఇస్తూ ఈ నిర్ణయం తీసుకోనున్నారు. అజిత్ అగార్కర్ నేతత్వంలోని సెలక్షన్ కమిటీ మార్చి 29, 2025న గవాహటిలో సమావేశమై, ఇంగ్లాండ్ సిరీస్ జట్టుతో పాటు కాంట్రాక్ట్ వివరాలను ప్రకటించనుంది.
గతంలో క్రమశిక్షణ చర్యలతో కాంట్రాక్ట్(Cantract) కోల్పోయిన శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ పేర్లు మళ్లీ పరిశీలనలోకి వచ్చాయి. 2023 వన్డే ప్రపంచకప్‌లో రాణించి, ఛాంపియన్స్ ట్రోఫీ విజయంలో కీలక పాత్ర పోషించిన శ్రేయస్ పేరు ఖాయంగా కనిపిస్తోంది. ఇషాన్ కిషన్ దేశవాళీలో స్థిరంగా ఆడుతూ, ఐపీఎల్–18లో సన్రైజర్స్ హైదరాబాద్ తరఫున సెంచరీ సాధించాడు. యువ ఆటగాళ్లు నితీష్ కుమార్ రెడ్డి, అభిషేక్ శర్మలకు కూడా కాంట్రాక్ట్ దక్కే అవకాశం ఉంది. ఇటీవల మహిళల సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితాను విడుదల చేసిన బీసీసీఐ, ఇప్పుడు పురుషుల విభాగంపై దష్టి సారించింది.