Akhanda 2 Collection: ఈ ఏడాది భారీ అంచనాల నడుమ విడుదలైన సినిమాల్లో ఒకటి ‘అఖండ 2’. నందమూరి బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్ అంటే ఆడియన్స్ బుర్ర ఫ్రిడ్జ్ లో పెట్టి వెళ్తారు. ఎందుకంటే వీళ్ళ సినిమాల్లో కేవలం మ్యాజిక్స్ మాత్రమే చూస్తారు ఆడియన్స్, లాజిక్స్ అసలు పట్టించుకోరు. ఇదే అంచనాలతో వెళ్లినప్పటికీ కూడా ఈ సినిమా ఆడియన్స్ ని అలరించలేదంటే, ఏ రేంజ్ కళాఖండం అనేది అర్థం చేసుకోవచ్చు. ఈ చిత్రంపై నందమూరి అభిమానుల్లో మామూలు అంచనాలు ఉండేవి కాదు. నందమూరి ఫ్యాన్స్ అయితే ఈ సినిమాతో ఏకంగా పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ కలెక్షన్స్ 316 కోట్లను దాటేస్తామని కూడా ఛాలెంజ్ చేశారు. కానీ 316 కోట్ల గ్రాస్ కాదు కదా, కబీజం 100 కోట్ల గ్రాస్ వసూఒళ్ళు రావడం కూడా కష్టం లాగా తయారైంది పరస్థితి. ఈ ఏడాది జులై 24 న విడుదలైన పవన్ కళ్యాణ్ ‘హరి హర వీరమల్లు’ చిత్రం ఎంత పెద్ద డిజాస్టర్ ఫలపు అయ్యిందో మన అందరికీ తెలిసిందే.
కానీ బాక్స్ ఆఫీస్ వద్ద ఈ చిత్రం 70 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది. ‘అఖండ 2’ కి ఈ రేంజ్ వసూళ్లు రావడం కష్టమే అని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ప్రస్తుతానికి ఈ చిత్రం 54 కోట్ల రూపాయిల షేర్ వద్ద ఆగింది. మరో పది కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టే అవకాశాలు ఈ సినిమాకు ఉన్నాయని అంటున్నారు కానీ, 70 కోట్ల వరకు వెళ్లే అవకాశాలు మాత్రం లేవని అంటున్నారు. దీంతో పవన్ ఫ్యాన్స్ బాలయ్య ని వెక్కిరించడం మొదలు పెట్టారు. ఓజీ ని లేపేస్తాం అని సవాలు విసిరారు, చివరికి ‘హరి హర వీరమల్లు’ కూడా కదిలేలా లేదు,ఇది మీ హీరో స్టామినా అంటూ సోషల్ మీడియా లో పెద్ద ఎత్తిన ట్రోల్స్ వేస్తున్నారు. చూడాలి మరి లాంగ్ రన్ లో ఏమైనా మ్యాజిక్ క్రియేట్ చేస్తుందా లేదా అనేది.