Rishabh Pant Controversy: టీమిండియా యువ ఆటగాడు రిషబ్ పంత్ మైదానంలో అత్యంత దూకుడుగా ఉంటాడు. తోటి ప్లేయర్లను నవ్విస్తూ మైదానంలో ఉత్సాహమైన వాతావరణాన్ని క్రియేట్ చేస్తాడు. అయితే రిషబ్ పంత్ ప్రస్తుతం ఇంగ్లీష్ జట్టుతో జరుగుతున్న తొలి టెస్ట్ లో రెండవ ఇన్నింగ్స్ లో ఆడే అవకాశం లేదని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
ఇంగ్లీష్ జట్టుతో జరుగుతున్న తొలి టెస్ట్ లో మూడోరోజు ఆటలో ఫీల్డ్ అంపైర్ క్రిస్ గఫాని పై పంత్ తీవ్రస్థాయిలో అసహనం వ్యక్తం చేశాడు. బంతిని మార్చాలని అతడు కోరాడు. గిల్ కూడా పంత్ కు వంత పాడాడు. అయినప్పటికీ ఫీల్డ్ అంపైర్ ఒప్పుకోలేదు. అయితే పంత్ ఇదే విషయాన్ని అనేక సందర్భాలలో ఫీల్డ్ అంపైర్ ను కోరాడు. దానికి అతడు నిరాకరించాడు. చివరిసారిగా పంత్ అడిగినప్పుడు గాగ్ లో ఫీల్డ్ అంపైర్ బంతిని పరిశీలించాడు. కొత్త బంతిని ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పాడు. దీంతో పంత్ ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేశాడు. అంతేకాదు తన చేతిలో ఉన్న బంతిని విసురుగా అలా విసిరేశాడు. ఆ తర్వాత అక్కడి నుంచి అతడు ముందుకు వెళ్లిపోయాడు.. అయితే 75 ఓవర్ కు కాస్త ముందు పంత్ అభ్యర్థించడంతో గాగ్ లో పరిశీలించి.. బంతి ఆ ప్రమాణాలకు అనుగుణంగా లేకపోవడంతో కొత్త బంతిని ఫీల్డ్ అంపైర్ ఇచ్చాడు.
Also Read: Rishabh Pant : పూర్ రిషబ్..27 కోట్లు పెట్టి కొంటే 128 పరుగులు.. ఎంత నామర్ద!
అదరగొట్టాడు
రిషబ్ పంత్ వికెట్ల వెనుక ఉండి ఇంగ్లాండ్ ఆటగాళ్లను కొన్ని సందర్భాలలో ఉక్కిరి బిక్కిరి చేశాడు. తనదైన వ్యాఖ్యానాలతో వారిని డిఫెన్స్ లో పడేశాడు. ముఖ్యంగా బ్రూక్ ను అవుట్ చేసిన విధానం మూడోరోజు ఆట మొత్తాని కే హైలైట్. అప్పటిదాకా మైదానంలో చలాకీగా తిరిగిన పంత్ తన పాదాలకు నొప్పి కలిగిందని జట్టు ఫిజియోకు సంకేతాలు ఇచ్చాడు. అప్పటికే బ్రూక్ 99 పరుగుల వద్ద ఉన్నాడు. బౌలింగ్ ప్రసిద్ వేస్తున్నాడు. ఈ నేపథ్యంలో పంత్ అభ్యర్థన మేరకు ఫిజియో వచ్చిన తర్వాత.. అతని పాదాలకు కట్టు కట్టాడు. ఈ సమయంలోనే జట్టు ఆటగాళ్లు చర్చలు జరిపారు. చివరికి ఆట ప్రారంభమైన తర్వాత ప్రసిద్ అద్భుతమైన బౌన్సర్ వేశాడు. దానిని బౌండరీ అవతల పంపించాలని బ్రూక్ గట్టిగానే కొట్టాడు. చివరికి అది శార్దూల్ చేతిలో పడింది. మొత్తంగా 99 పరుగుల వద్ద బ్రూక్ చరిత్ర ముగిసిపోయింది. ఇలా అనేక సందర్భాలలో తనదైన పాత్ర పోషించాడు కాబట్టి భారత్ కాస్తలో కాస్త స్వల్ప ఆధిక్యాన్ని సాధించింది. అయితే అంపైర్ పై అసహనం వ్యక్తం చేసిన నేపథ్యంలో పంత్ పై వేటు పడుతుందని.. నాలుగు రోజు అతనికి ఆడే అవకాశం ఉండదని కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు. కాకపోతే పంత్ నేరుగా ఫీల్డ్ అంపైర్ పై విమర్శలు చేయలేదు. పైగా అతడు తన అసహనం మాత్రమే వ్యక్తం చేశాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే ఫీల్డ్ అంపైర్ కొత్త బంతిని అందించాడు. ఈ పరిణామం రకరకాల చర్చలకు కారణమైనప్పటికీ అంతిమంగా.. పంత్ పై ఎటువంటి వేటు పడదని టీమ్ ఇండియా మేనేజ్మెంట్ క్లారిటీ ఇచ్చింది. జాతీయ మీడియా కూడా అదే తీరుగా కథనాలను ప్రసారం చేసింది.
“పంత్ అసహనం వ్యక్తం చేశాడు. ఎంత చెప్పినప్పటికీ బంతిని మార్చకపోవడంతో అతడు తన ఆగ్రహాన్ని మరో రూపంలో వ్యక్తం చేశాడు. అయినంత మాత్రాన అది మ్యాచ్ వేటు కు దారి తీయదు. క్రికెట్ నిబంధనల ప్రకారం అదేమీ క్షమించరాని నేరం కాదు. సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు వచ్చినప్పటికీ.. వాటిని నమ్మడానికి లేదని” జాతీయ మీడియా ప్రసారం చేసిన కథనాలలో పేర్కొంది.