RCB Controversy: ఐపీఎల్ అనేది రిచ్ క్రికెట్ లీగ్ లాంటిది. పైకి క్రికెట్ నిబంధనలు కనిపిస్తున్నప్పటికీ.. ఇందులో ప్రతిదీ కూడా డబ్బుతోనే ముడిపడి ఉంటుంది. కార్పొరేటర్లు తెరవెనుక ఉండి ఆడే గేమ్ కాబట్టి ఇదంతా కూడా కాసుల క్రీడమాదిరిగానే కనిపిస్తుంది. పైగా ఇందులో పైసా పెట్టుబడి పెడితే అంతకుమించి రాబడిని ఆశిస్తాయి కార్పొరేట్ కంపెనీలు. అందువల్లే క్రికెట్ ను జెంటిల్మెన్ గేమ్ లా కాకుండా పూర్తిగా కమర్షియల్ గేమ్ గా మార్చేశాయి. అందువల్లే ఐపిఎల్ అంటే కొంతమంది ఏవగింపు ప్రదర్శిస్తారు. చిరాకును వ్యక్తం చేస్తారు.
ఇక ఇటీవలి ఐపిఎల్ లో బెంగళూరు జట్టు విజేతగా నిలిచింది. దాదాపు సంవత్సరాల పాటుగా ఎదురు చూస్తే కన్నడ జట్టు విజయం సాధించింది. ఈ విజయం తర్వాత నిర్వహించిన పరేడ్ విషాదంగా మారింది. చాలామంది కన్నడ అభిమానులు కన్నుమూశారు. అందులో కొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. వారు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. ఈ నేపథ్యంలో బీసీసీఐ విజయ యాత్ర విషయంలో కఠిన నిబంధనలు విధించింది. అంతేకాదు అభిమానులకు నష్టం చేకూర్చే విషయమైనా సరే తీవ్రంగా తీసుకుంటామని హెచ్చరించింది. ఇక కన్నడ జట్టు విజయ యాత్ర సమయంలో చోటుచేసుకున్న విషాదానికి సంబంధించి కొంతమందిని ఇప్పటికే కన్నడ పోలీసులు అరెస్ట్ చేశారు. వారు విచారణ ఖైదీలుగా ఉన్నారు. మరోవైపు కన్నడ జట్టుకు సంబంధించిన ఒక వార్త ఇప్పుడు సంచలనంగా మారింది.
Also Read:ఉదయ్ కిరణ్ చనిపోవడమే మంచిది.. ఎవరెవరు హింసించారో నాకు తెలుసు..
ఇటీవల కన్నడ జట్టు ట్రోఫీ గెలిచిన నేపథ్యంలో.. అత్యంత విలువైన జట్టుగా రూపాంతరం చెందింది. ఈ ఏడాది కన్నడ జట్టు విలువ 12.2% పెరిగింది . తద్వారా 25 మిలియన్ డాలర్లతో అత్యంత విలువైన జట్టుగా అవతరించింది. ముంబై ఇండియన్స్ జట్టు 249 మిలియన్ డాలర్లతో రెండవ స్థానంలో ఉంది. 235 మిలియన్ డాలర్లతో చెన్నై జట్టు మూడో స్థానంలో కొనసాగుతోంది. ఇక ఐపీఎల్ బ్రాండ్ ఏకంగా 1.56 లక్షల కోట్లకు చేరుకుంది. ఐపీఎల్ బ్రాండ్ విలువ ప్రారంభంలో తక్కువగానే ఉండేది. 2015 నాటికి అది 50వేల కోట్లను మించిపోయింది. ఇక ఆ తర్వాత ఐపీఎల్ విలువ అంతకంతకు పెరుగుతోంది. ప్రతి ఏడాది నిర్వహించే సీజన్లో ఐపిఎల్ తన బ్రాండ్ విలువను పెంచుకుంటున్నది. తాజా సీజన్లో కూడా ఐపీఎల్ తన బ్రాండ్ వ్యాల్యూను అమాంతం పెంచేసుకుంది. ఏకంగా 1.58 లక్షల కోట దాకా వెళ్ళింది అంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఐపీఎల్ లో బెంగళూరు జట్టు విజేతగా నిలిచిన నేపథ్యంలో.. ఆ జట్టు విలువ పెరుగుతుందని అందరూ అనుకున్నారు. అనుకున్నట్టుగానే జట్టు విలువ పెరిగింది. వాస్తవానికి కొంతమంది అభిమానులు మినహా మిగతా వారంతా బెంగళూరు జట్టు యాజమాన్య వైఖరిని తీవ్రస్థాయిలో విమర్శిస్తున్నారు. ఇటీవల జరిగిన గొడవను యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే జరిగిందని మెజారిటీ అభిమానులు చెబుతున్నారు. “బెంగళూరు జట్టు మీద విపరీతమైన ఆగ్రహం వ్యక్తం అవుతున్న నేపథ్యంలో దానిని తగ్గించడానికి తెరవెనక ఈ ప్రయత్నం చేసినట్టు తెలుస్తోంది. వాస్తవానికి ఈ జట్టు విలువను ఎవరు లెక్కించారు? బెంగళూరు ట్రోఫీ గెలవగానే జట్టు విలువ అమాంతం ఎలా పెరుగుతుంది? విలువ పెరగడం వల్ల ఎవరికి లాభం? అంతిమంగా జట్టుకే కదా.. జట్టు విలువ పెరగడం వల్ల మేనేజ్మెంట్ భారీగా లాభాలను కళ్ళజూస్తోంది. అంటే దీని వెనుక ఏదో జరిగి ఉంటుంది. కార్పొరేట్ వ్యక్తులు ఆడే గేమ్ కాబట్టి తెరవెనుక ఏదైనా జరుగుతుంది. ఇదంతా కూడా డబ్బుతో కూడుకున్న వ్యవహారం కాబట్టి.. త్వరగా బయటపడదని” అభిమానులు పేర్కొంటున్నారు.
Also Read:హరి హర వీరమల్లు’ రన్ టైం ఇంతేనా..? ఈమధ్య కాలంలో చాలా అరుదు!
బెంగళూరు జట్టు విలువ పెరగగానే అందులో పెట్టుబడులు పెట్టడానికి చాలామంది వస్తారు. పైగా వచ్చే సీజన్లో బెంగళూరు అనేక విధాలుగా ఆదాయాన్ని మరింత ఎక్కువగా పొందుతుంది. ఒక సీజన్లో విజేతగా నిలిచి బెంగళూరు జట్టు విపరీతంగా ఆదాయాన్ని వెనకేసుకుంటుందని క్రికెట్ నిపుణులు చెబుతున్నారు. ఈ ప్రభావం కన్నడ జట్టుమీద చాలా సంవత్సరాల వరకు ఉంటుందని క్రికెట్ నిపుణులు చెబుతున్నారు.