Hari Hara Veeramallu Runtime : ఎన్నో కష్టనష్టాలను ఎదురుకొని ఎట్టకేలకు ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం ‘హరి హర వీరమల్లు'(Hari Hara Veeramallu). పవన్ కళ్యాణ్(Deputy Pawan Kalyan) కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో, క్వాలిటీ పరంగా ఎక్కడా వెనకడుగు వేయకుండా నిర్మాత AM రత్నం ఈ చిత్రాన్ని ఎంతో గ్రాండ్ గా తెరకెక్కించాడు అనే విషయం థియేట్రికల్ ట్రైలర్ ని చూసిన తర్వాతే అర్థం అయ్యింది. రీసెంట్ గానే ఓవర్సీస్ లో అడ్వాన్స్ బుకింగ్స్ ని మొదలు పెట్టగా, అక్కడి నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. కచ్చితంగా ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద వండర్స్ ని క్రియేట్ చేస్తుంది అనే నమ్మకం అభిమానుల్లో కలిగింది. రాబోయే రోజుల్లో ఆ నమ్మకం మరింత బలపడబోతుంది. ఇకపోతే ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికరమైన విషయం ఒకటి ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.
ప్రస్తుత ట్రెండ్ లో ఒక సినిమా రన్ టైం పరిమితి కి తగ్గట్టుగా ఉంటే ఆడియన్స్ బోరింగ్ ఫీల్ అయ్యే అవకాశం ఉండదు. ఈమధ్య కాలం లో విడుదలైన ‘కుబేర’,’కన్నప్ప’ చిత్రాల రన్ టైం మూడు గంటలకు పైమాటే. ఆ కారణం చేత ఈ రెండు సినిమాలకు టాక్ బాగా వచ్చినప్పటికీ ప్రేక్షకులు చాలా పరిమితంగానే చూసారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్. కుబేర చిత్రం కమర్షియల్ గా హిట్ అయిపోయింది కానీ, కన్నప్ప చిత్రం మాత్రం ఫ్లాప్ అవ్వడానికి మూడు గంటల రన్ టైం కారణం అని అంటున్నారు. కానీ ‘హరి హర వీరమల్లు’ మూవీ రన్ టైం అంత నిడివితో ఉండదట. కేవలం 2 గంటల 34 నిమిషాల నిడివి మాత్రమే ఉంటుందట. స్క్రీన్ ప్లే కూడా చాలా వేగంగా ఉంటుందట. ఇది సినిమాకు చాలా పెద్ద ప్లస్ అవ్వొచ్చు. మల్టీప్లెక్స్ షోస్ కూడా ఈ రన్ టైం కి భారీ సంఖ్యలో ప్లాన్ చేయొచ్చు.
సాధారణంగా పీరియడ్ డ్రామా చిత్రాల లెంగ్త్ ఎక్కువగా ఉంటే చూసే ఆడియన్స్ కి బోరింగ్ గా అనిపిస్తుంది. అందుకే ఈ విషయాన్ని ముందుగానే పసిగట్టి రన్ టైం ని బాగా తగ్గించి క్రిస్పీ గా ఉండేలా చూసుకున్నారట. ఇప్పుడు ప్రేక్షకుడు కూడా ధైర్యం గా థియేటర్ కి రావొచ్చు. ఇకపోతే ఈ సినిమాకు సంబంధించిన ఫైనల్ కాపీ ఈ నెల 11 లోపు రెడీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. వచ్చే వారం లో సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి కాబోతున్నాయి. ఇది వరకు లవ్ స్టోరీస్, మాస్ మసాలా సినిమాలు చేస్తూ వచ్చిన పవన్ కళ్యాణ్ ని ఇలాంటి స్పెషల్ రోల్ లో చూడడం అభిమానులకు చాలా పెద్ద సర్ప్రైజ్. ట్రైలర్ చూస్తుంటే ఆయన ఈ సినిమా కోసం తన వైపు నుండి నూటికి నూరు శాతం ఇచ్చినట్టుగా అనిపిస్తుంది. చూడాలి మరి ఎలా ఉండబోతుంది అనేది.