Homeఎంటర్టైన్మెంట్BigBoss 19 Hindi: 20 కోట్లు ఇచ్చినా బిగ్ బాస్ కి వెళ్ళను అంటున్న నటుడు,...

BigBoss 19 Hindi: 20 కోట్లు ఇచ్చినా బిగ్ బాస్ కి వెళ్ళను అంటున్న నటుడు, కారణం తెలుసా?

BigBoss 19 Hindi: ఓ సీనియర్ నటుడు బిగ్ బాస్ షోపై వ్యతిరేకత వ్యక్తం చేశాడు. కోట్ల రూపాయలు ఆఫర్ చేసినా ఆ షోకి వెళ్లను అన్నాడు. అందుకు ఆయన కొన్ని కారణాలు వెల్లడించారు. సదరు నటుడి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

డచ్ రియాలిటీ షో బిగ్ బ్రదర్ స్ఫూర్తితో ఇండియాలో బిగ్ బాస్(BIGG BOSS REALITY SHOW) ఆరంభమైంది. బిగ్ బ్రదర్ షోలో కంటెస్ట్ చేసిన నటి శిల్పా శెట్టి టైటిల్ విన్నర్ కావడం విశేషం. హిందీలో మొదటిగా బిగ్ బాస్ ఆరంభమైంది. 2007లో ప్రసారమైన మొదటి సీజన్ కి అర్షద్ వార్సి హోస్ట్ గా వ్యవహరించారు. సీజన్ 2కి శిల్పా శెట్టి ఎంట్రీ ఇచ్చింది. సంజయ్ దత్, అమితాబ్ సైతం బిగ్ బాస్ హిందీ హోస్ట్ గా ప్రేక్షకులను అలరించారు. అయితే సల్మాన్ ఖాన్(SALMAN KHAN) రికార్డు స్థాయిలో బిగ్ బాస్ హోస్టింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

ఇప్పటి వరకు బిగ్ బాస్ హిందీ 18 సీజన్స్ పూర్తి చేసుకుంది. సీజన్ 4 నుండి సల్మాన్ ఖాన్ హోస్ట్ గా వ్యవహరించడం విశేషం. హిందీలో ఈ రియాలిటీ షో గ్రాండ్ సక్సెస్ కావడంతో పలు భాషల్లోకి పాకింది. మొదటగా కన్నడ, అనంతరం తెలుగు, తమిళ్, మలయాళ భాషల్లో సైతం ప్రసారం అవుతుంది. ప్రేక్షకుల ఆదరణ పొందినప్పటికీ బిగ్ బాస్ షోపై వ్యతిరేకత కూడా ఉంది. సాంప్రదాయవాదులు ఈ షోని తీవ్రంగా ఖండిస్తున్నారు. భారతీయ సంస్కృతికి బిగ్ బాస్ షో వ్యతిరేకం, యువతను తప్పుదోవ పట్టిస్తుంది అంటూ ఆందోళలన వ్యక్తం చేస్తున్నారు.

బిగ్ బాస్ షోలో పాల్గొని పరువు పోగొట్టుకున్న సెలెబ్స్ లేకపోలేదు. ఎడిటింగ్ మ్యాజిక్స్ తో కంటెస్టెంట్స్ ని తప్పుగా ప్రేక్షకుల్లో ప్రొజెక్ట్ చేస్తారనే ఆరోపణలు ఉన్నాయి. బిగ్ బాస్ షో కారణంగా ఉన్న ఇమేజ్ పోగొట్టుకుని కెరీర్ నాశనం చేసుకున్న సెలెబ్స్ ఉన్నారు. అందుకే చాలా మంది ప్రముఖులు ఈ షో పట్ల ఆసక్తి చూపడం లేదు. భారీగా రెమ్యూనరేషన్ ఆశజూపినా ససేమిరా అంటున్నారు. తాజాగా ఓ నటులు కోట్లు కుమ్మరించినా బిగ్ బాస్ షోలో పాల్గొనను అంటున్నారు.

బిగ్ బాస్ హిందీ సీజన్ 19 ఆగస్టు లో ఆరంభం కానుంది. ఈ క్రమంలో బాలీవుడ్ నటుడు రామ్ కపూర్ కంటెస్ట్ చేస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. ఈ కథనాలపై రామ్ కపూర్ స్పందించారు. బిగ్ బాస్ షోలో నేను ఎప్పటికీ పాల్గొనను. నాకు 20 కోట్లు ఆఫర్ చేసినా వెళ్ళను. అలా అని నేను ఆ షోని కించపరచడం లేదు. బిగ్ బాస్ షోకి వ్యతిరేకం కూడా కాదు. అది చాలా సక్సెస్ఫుల్ షో. కానీ నా మనస్తత్వానికి సూట్ కాదు. నేను నటుడిని నటుడిగానే ఉంటాను. బిగ్ బాస్ లో రియల్ టాలెంట్ బయటకు రాదు.. అని షాకింగ్ కామెంట్స్ చేశాడు. రామ్ కపూర్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

RELATED ARTICLES

Most Popular