Coolie Movie Release Date: ఒకప్పుడు సినిమాలకు టీజర్ లు, ట్రైలర్ లు వంటివి ఉండేవి కాదు. విడుదలకు ముందు కేవలం ఒక ఆడియో క్యాసెట్ మాత్రమే వదిలేవారు. ‘జల్సా’ చిత్రం నుండి చిన్నగా ట్రెండ్ మారుతూ వచ్చింది. ప్రోమోలు, టీజర్లు, ట్రైలర్లు ఇలా చిన్నగా ఒక్కొక్కటి రావడం మొదలు పెట్టాయి. అదే ట్రెండ్ ని అందరు అనుసరిస్తూ ఇప్పుడు సినీ ట్రెడిషన్ లో ఒక భాగం అయిపోయింది. ఒక సినిమాకి ప్రేక్షకుడు థియేటర్ కి వచ్చి చూడాలా వద్దా అనేది ట్రైలర్ ని చూసి నిర్ణయం తీసుకునే పరిస్థితి ఏర్పడింది. ట్రైలర్ లేకపోతే కనీస స్థాయి ఓపెనింగ్స్ కూడా రావు అని అనుకునే ఈరోజుల్లో, టీజర్ లేకుండా, ట్రైలర్ లేకుండా సినిమాని నేరుగా థియేటర్స్ లోకి వదిలే ప్రయత్నం చేస్తున్నాడు డైరెక్టర్ లోకేష్ కనకరాజ్(Lokesh Kanagaraj). సూపర్ స్టార్ రజనీకాంత్(Superstar Rajinikanth) తో లేటెస్ట్ గా ఆయన ‘కూలీ'(Coolie Movie) అనే చిత్రం చేసిన సంగతి మన అందరికీ తెలిసిందే.
ఈ చిత్రం షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకొని చాలా రోజులే అయ్యింది. కేవలం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కోసం ఎక్కువ సమయాన్ని కేటాయించారు. ఈ సినిమా నుండి ఇప్పటి వరకు పాటలు విడుదల అయ్యాయి కానీ, టీజర్ ఇప్పటి వరకు విడుదల అవ్వలేదు. అందుతున్న లేటెస్ట్ సమాచారం ప్రకారం ట్రైలర్ కూడా వచ్చే అవకాశం లేదట. లోకేష్ గత చిత్రాలతో కూడా ఇలాంటి ప్రయోగాలు కొన్ని చేశాడు. షూటింగ్ మొదలైన కొన్ని రోజులకు ఒక స్పెషల్ వీడియో ని విడుదల చేస్తాడు. ఆ తర్వాత టీజర్ విడుదల చేస్తే ట్రైలర్ ఉండదు, ట్రైలర్ ఉంటే టీజర్ ఉండదు. ఇదే ప్యాట్రన్ ని అనుసరిస్తూ వచ్చాడు. ‘మాస్టర్’ చిత్రానికి కేవలం టీజర్ మాత్రమే విడుదలకు ముందు వచ్చింది. అదే విధంగా విక్రమ్ చిత్రానికి టీజర్ లాంటివి ఏమి లేవు , నేరుగా ట్రైలర్ వదిలాడు.
Also Read: ప్రియుడితో సమంత షికార్లు..సంచలనం రేపుతున్న రాజ్ నిడిమోరు మాజీ భార్య లేటెస్ట్ పోస్ట్!
ఇక ఆ తర్వాత లియో చిత్రానికి విడుదలకు ముందు టీజర్ లాంటివి ఏమి వదల్లేదు, నేరుగా ట్రైలర్ ని విడుదల చేశాడు. ఇప్పుడు ‘కూలీ’ చిత్రానికి టీజర్ ఉండదట, ట్రైలర్ కూడా ఉండదట. ఒక్కసారిగా పాత రోజులకు తీసుకెళ్లిపోయారు లోకేష్ కనకరాజ్. ఈ సినిమాకు మొదటి నుండి విపరీతమైన క్రేజ్ ఉంది. మార్కెట్ లో ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ కూడా హాట్ కేక్ లాగా అమ్ముడుపోయింది. కేవలం తెలుగు రాష్ట్రాలకే 50 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందంటే సాధారణమైన విషయం కాదు. ఇలాంటి క్రేజ్ ఉన్న సినిమాకు ట్రైలర్ తో పనేమీ ఉంటుంది చెప్పండి. విడుదల ముందు వరకు కూడా సినిమా కంటెంట్ గురించి ఎలాంటి సమాచారం లేకుండా నేరుగా థియేటర్స్ కి వెళ్లి చూసి థ్రిల్ ఫీల్ అయ్యే ప్లాన్ వేసాడు లోకేష్ కనకరాజ్. ఇది ఎంత వరకు సక్సెస్ అవుతుందో చూడాలి.