Fish Venkat Health Condition: గత కొద్దిరోజులుగా ఫిష్ వెంకట్(Fish Venkat) ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో మనమంతా చూస్తూనే ఉన్నాం. రెండు కిడ్నీలు పూర్తిగా చెడిపోవడం తో గత పది రోజులుగా ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో వైద్యం తీసుకుంటూ ఉన్నాడు. నేడు మెరుగైన వైద్యం కోసం మరో హాస్పిటల్ కి ఫిష్ వెంకట్ ని షిఫ్ట్ చేశారు. ఆరోగ్య పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదని, ఇప్పటికీ విషమంగానే ఉందని ఆయన కూతురు చెప్పుకొచ్చింది. ఇదంతా పక్కన పెడితే ఫిష్ వెంకట్ ఒక మంచి బిజీ ఆర్టిస్ట్ అనే సంగతి తెలిసిందే. విలన్స్ రౌడీ గ్యాంగ్ లో ఫిష్ వెంకట్ లేని సినిమా అంటూ ఉండేది కాదు. అయితే అతనికి సినిమాల్లో మొట్టమొదట అవకాశం ఇచ్చింది పవన్ కళ్యాణే(Deputy CM Pawan Kalyan). ఖుషి చిత్రమే ఫిష్ వెంకట్ మొదటి చిత్రం. ఆ తర్వాత ఆయన వీవీ వినాయక్ దృష్టిలో పడడం, తన ప్రతీ సినిమాలోనూ ఫిష్ వెంకట్ ని తీసుకోవడం వంటివి జరిగింది.
అలా వరుసగా సినిమాలు చేస్తూ వచ్చిన ఫిష్ వెంకట్ కెరీర్ ని మరో లెవెల్ కి తీసుకెళ్లిన చిత్రం ‘గబ్బర్ సింగ్’. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఎన్నో సంచలనాత్మక రికార్డ్స్ ని నెలకొల్పిన గబ్బర్ సింగ్ చిత్రం లో అంత్యాక్షరి సన్నివేశం ఎంత హైలైట్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ సన్నివేశం లో ఫిష్ వెంకట్ నటన అప్పట్లో ఆడియన్స్ ని విశేషంగా ఆకట్టుకుంది. కేవలం ఫిష్ వెంకట్ కి మాత్రమే కాదు, ఆ సన్నివేశం లో నటించిన ప్రతీ ఒక్కరికి టాలీవుడ్ లో సరికొత్త లైఫ్ వచ్చింది. అందుకే పవన్ కళ్యాణ్ అంటే గబ్బర్ సింగ్ గ్యాంగ్ కి ఎంతో ఇష్టం. 2019 ఎన్నికల సమయంలోనూ, అదే 2024 ఎన్నికల సమయం లోనూ ‘గబ్బర్ సింగ్’ గ్యాంగ్ ప్రచార కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనింది.
Also Read: ప్రియుడితో సమంత షికార్లు..సంచలనం రేపుతున్న రాజ్ నిడిమోరు మాజీ భార్య లేటెస్ట్ పోస్ట్!
అయితే ఫిష్ వెంకట్ మాత్రం ఒక్కసారి కూడా పవన్ కళ్యాణ్ తరుపున ఎన్నికల ప్రచారం లో పాల్గొనలేదు. అందుకు కారణంగా రాజకీయంగా ఆయన జగన్ అభిమాని కాబట్టి. 2019 ఎన్నికల సమయం లో జగన్ పాదయాత్ర చేస్తున్న సమయం లో ఫిష్ వెంకట్ కూడా ఆయనతో కలిసి ఆ కార్యక్రమం లో ఒక రోజు పాల్గొన్నాడు. అందుకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. అయితే ఫిష్ వెంకట్ ఆరోగ్య పరిస్థితి ఇంత దయనీయంగా మారితే గబ్బర్ సింగ్ గ్యాంగ్ కనీసం పట్టించుకోలేదేంటి అని చాలా మందిలో కలిగిన సందేహం. అందుకు కారణం ఇదే, ఫిష్ వెంకట్ జగన్ కి వీరాభిమాని అవ్వడం వల్ల, గబ్బర్ సింగ్ గ్యాంగ్ ఆయన్ని పూర్తిగా దూరం పెట్టేసిందని, అందుకే కనెక్షన్ పోవడం వల్ల ఇప్పుడు ఫిష్ వెంకట్ ని పట్టించుకోక పోయి ఉండొచ్చని సోషల్ మీడియా లో నెటిజెన్స్ అనుకుంటున్నారు.