Kuberaa Movie Collections: సరైన హిట్టు లేక ఇబ్బంది పడుతూ వెంటిలేటర్ పై ఉన్న టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ కి ఆక్సిజెన్ ని అందించిన చిత్రం ‘కుబేర'(Kuberaa Movie). శేఖర్ కమ్ముల(Sekhar Kammula) దర్శకత్వం లో అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna), ధనుష్(Dhanush K Raja) కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ సినిమా మొదటి ఆట నుండే అద్భుతమైన పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకొని ముందుకు దూసుకెళ్లింది. ఈ సినిమా చాలా సినిమాలే విడుదలయ్యాయి, కానీ థియేటర్స్ కి ఇప్పటికీ కలెక్షన్స్ ని అందిస్తున్న ఏకైక చిత్రం ఇది మాత్రమే. 19 వ రోజు కూడా ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల నుండి 20 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిందంటే సాధారణమైన విషయం కాదు. మల్టీప్లెక్స్ థియేటర్స్ లో అద్భుతమైన రన్ ని సొంతం చేసుకుంటుంది. ఫ్యామిలీ ఆడియన్స్ ఆదరణ విశేషంగా ఉండడం వల్లే ఈ సినిమాకు ఇంతమంచి లాంగ్ రన్ వస్తుందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.
అయితే ఈ చిత్రం త్వరలోనే ఆంధ్ర ప్రదేశ్ లో ఒక మైలు రాయిని దాటబోతుంది. ఇప్పటి వరకు ఈ చిత్రానికి 39 కోట్ల 30 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఈ వారం ఇదే రేంజ్ స్టడీ రన్ ని సొంతం చేసుకుంటే 40 కోట్ల రూపాయిల ప్రెస్టీజియస్ మార్కుని ఈ సినిమా దాటుతుందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. అదే విధంగా నైజాం ప్రాంతం లో 19 రోజులకు దాదాపుగా 18 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం ఈ నెల 24 వ తేదీ లోపు 20 కోట్ల రూపాయిల మార్కుని టచ్ చేసే అవకాశం ఉంటుంది అని ఆశిస్తున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఇది కూడా నైజాం లో ప్రెస్టీజియస్ బెంచ్ మార్క్ అనొచ్చు. ఇక ఆంధ్ర ప్రాంతం ఉత్తరాంధ్ర నుండి ఈ చిత్రానికి మంచి వసూళ్లు వచ్చాయి.
Also Read: ‘గబ్బర్ సింగ్’ గ్యాంగ్ ఏమయ్యారు..? ఫిష్ వెంకట్ ని పట్టించుకోకపోవడానికి కారణం అదేనా!
19 రోజుల్లో దాదాపుగా 6 కోట్ల 21 లక్షల రూపాయిలు వచ్చాయి. ఫుల్ రన్ ముగిసే సమయానికి 7 కోట్ల మార్కుని ముట్టుకునే అవకాశాలు ఉన్నాయి. ఓవరాల్ గా ఈ చిత్రానికి ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా 135 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. 150 కోట్ల మార్కుని అందుకొని ఉండుంటే బాగుండేది కానీ, ప్రస్తుతానికి అయితే ఆ పరిస్థితి కనిపించడం లేదు. 140 కోట్ల మార్కుని మాత్రం కచ్చితంగా అందుకునే అవకాశం ఉంది. అక్కినేని అక్కడి వరకు ఈసారికి సంతృప్తి పడాలి. వాస్తవానికి ఈ చిత్రం తమిళనాడు లో డిజాస్టర్ ఫ్లాప్ అయ్యింది. అక్కడ కనీస స్థాయి వసూళ్లను రాబట్టి ఉన్నా ఈరోజు 150 కోట్ల మార్కుని అవలీల గా దాటి ఉండేది. కానీ అది జరగకపోవడం వల్లే ఈ సినిమా అనుకున్న టార్గెట్ ని చేరుకోలేదు. ఇదంతా పక్కన పెడితే మరో పక్క ఈ చిత్రం జులై 20 న ఓటీటీ లో స్ట్రీమింగ్ కాబోతుంది.