Ind vs Eng Test series: ఇప్పటికే జాతీయ జట్టు కాకుండా.. మన దేశానికి చెందిన ఇతర ప్లేయర్లు ఆంగ్ల గడ్డపై అడుగుపెట్టారు. ఆంగ్ల జట్టుతో అనధికారికంగా టెస్టులు ఆడుతున్నారు. తొలి టెస్టు డ్రా గా ముగిసిపోయింది. ఇక ఈసారి విరాట్, రోహిత్ లేకుండానే గిల్ ఆధ్వర్యంలో భారత జట్టు ఆంగ్ల గడ్డమీద అడుగుపెట్టింది. గిల్ నాయకత్వం వహిస్తుంటే.. పంత్ ఉప నాయకుడిగా బాధ్యతలు వహిస్తున్నాడు.. జూన్ నుంచి మొదలు పెడితే ఆగస్టు వరకు ఆంగ్ల జట్టుతో భారత్ 5 టెస్టుల సిరీస్ లో తలపడుతుంది.
ఇక గిల్ సారథ్యంలో భారత జట్టు శనివారం ఆంగ్ల దేశంలోకి అడుగు పెట్టింది.. ఆంగ్ల గడ్డమీద అడుగుపెట్టిన ఆటగాళ్లకు సంబంధించిన వీడియోను బీసీసీఐ తన అధికారిక సోషల్ మీడియాలో పంచుకుంది. ఆ వీడియోలో నాయకుడు గిల్, ఉప నాయకుడు రిషబ్ పంత్, ఓపెనర్ గా రంగంలోకి దిగే సాయి సుదర్శన్, పేస్ బౌలర్ బుమ్రా, ఆల్రౌండర్ రవీంద్ర జడేజా, మహమ్మద్ సిరాజ్ వంటి ప్లేయర్లు అందులో కనిపించారు. ఇక ఈ వీడియోలో పంత్ మాజీ కెప్టెన్ రోహిత్ కు సంబంధించిన ఒక మాటను ప్రస్తావించాడు. ఆ మాట అనుకుంటూ అతనిని మననం చేసుకున్నాడు. రోహిత్, విరాట్ ఇటీవల సుదీర్ఘ ఫార్మాట్ నుంచి శాశ్వతంగా తప్పుకుంటున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ పరిణామం తర్వాత ప్లేయర్ల వ్యవహార శైలి పూర్తిగా మారిపోయింది. ఇక ఈ సందర్భంగా పంత్ కామెడీ చేశాడు..” గార్డెన్ కి తో యాద్ ఆయేగి” అంటూ వ్యాఖ్యానించాడు. అతడు పలికిన ఆ మాట అభిమానుల్లో విపరీతమైన ఆనందాన్ని నింపింది. అయితే ఈ మాటలను టీమిండియా సారధిగా రోహిత్ శర్మ ఉన్నప్పుడు అనేవాడు. అతడు పలికే ఆ మాట జట్టులో ఆనందాన్ని నింపేది. అతడు ఒక రకమైన స్లాంగ్ లో ఆ మాటను పలికేవాడు. దీంతో జట్టులో ఉన్న ప్లేయర్లు మొత్తం బిగ్గరగా నవ్వేవారు. అదే విషయాన్ని పంత్ తోటి ప్లేయర్లతో పంచుకున్నాడు. రిషబ్ పంత్ రోహిత్ గతంలో చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించడంతో.. అతని అభిమానులు, టీమిండియా అభిమానుల్లో ఆనందం తాండవం చేస్తున్నది. ఇక రోహిత్ శర్మతో పంత్ కు మంచి స్నేహం ఉండేది. అనేక సందర్భాలలో రోహిత్ రిషబ్ పంత్ ను తిట్టాడు. కోన్ని సందర్భాలలో మందలించాడు. అయినప్పటికీ కూడా రిషబ్ పంత్ ఆ మాటలను సీరియస్ గా ఎన్నడూ తీసుకోలేదు. పైగా అనేక సందర్భాలలో రిషబ్ పంత్ రోహిత్ శర్మను బడే భాయ్ అని పేర్కొనేవాడు.
భారత్ జూన్ నుంచి ఆగస్టు వరకు ఆంగ్ల జట్టుతో టెస్ట్ సిరీస్ ఆడుతుంది. ఈ మ్యాచ్లు లీడ్స్ ప్రాంతంలోని హెడింగ్ లీ, బర్మింగ్ హమ్ ప్రాంతంలోని ఎడ్జ్ బాస్టన్, లండన్ లోని లార్డ్స్, దీ ఓవల్, మాంచెస్టర్ ప్రాంతంలోని ఓల్డ్ ట్రాఫోర్డ్ వంటి వేదికలలో ఐదు టెస్ట్ మ్యాచులు జరగబోతున్నాయి.. దాదాపు 18 సంవత్సరాల నుంచి భారత్ ఆంగ్ల గడ్డపై ఇంతవరకు టెస్ట్ సిరీస్ విజయాన్ని సొంతం చేసుకోలేదు. ఈసారి ఎలాగైనా టెస్ట్ సిరీస్ దక్కించుకోవాలని గిల్ సేన భావిస్తోంది. ఇందులో భాగంగా సమర్థవంతమైన ప్రణాళికలు రూపొందిస్తున్నది. ఏమాత్రం ప్రత్యర్థులకు అవకాశం ఇవ్వకుండా దూకుడుగా ఆడాలని భావిస్తున్నది. ఇప్పటికే జరుగుతున్న అనధికారిక టెస్టులలో భారత ఆటగాళ్ళు సత్తా చూపిస్తున్నారు. తొలి టెస్ట్ ఫలితం తేలకపోయినప్పటికీ భారత ఆటగాళ్లు తమ సామర్థ్యాన్ని ఆంగ్ల జట్టు ఆటగాళ్ల ముందు చూపించారు. ఈసారి పోటీ మామూలుగా ఉండదు అని హెచ్చరికలు పంపారు.
Touchdown UK #TeamIndia have arrived for the five-match Test series against England #ENGvIND pic.twitter.com/QK5MMk9Liw
— BCCI (@BCCI) June 7, 2025