Hardik Pandya divorce: వైవాహిక జీవితంలో ఆటుపోట్లు చోటు చేసుకుంటే ఎవరికైనా ఇబ్బందిగానే ఉంటుంది. ఇక్కడ పురుషులు, మహిళలు అని వేరుగా చూడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎవరైనా మనుషులే.. ఎవరిదైనా మనసే. కాకపోతే ఆడవాళ్ళ విషయంలో ఉదారత చూపించే ఈ సమాజం.. మగవాళ్ళ విషయంలో అలా ఉండదు. పైగా మగవాళ్లదే తప్పంతా అన్నట్టుగా మాట్లాడేస్తూ ఉంటుంది. దీనికి సామాన్యులే కాదు సెలబ్రిటీలు కూడా మినహాయింపు కాదు. ఈ జాబితాలో హార్దిక్ పాండ్యా కూడా ఉన్నాడు.
గత ఏడాది నటాషాకు విడాకులు ఇచ్చిన తర్వాత హార్దిక్ పాండ్యా పై తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తం అయ్యాయి. ఆరోపణలు కూడా అదే స్థాయిలో వినిపించాయి. ఇక ముంబైజట్టుకు సారధిగా వచ్చిన తర్వాత అతనిపై జరిగిన సోషల్ యుద్ధం తారా స్థాయి అని కూడా దాటిపోయింది. కొంతమంది అయితే నేరుగా విమర్శించారు. ఇక సోషల్ మీడియా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. . అయినప్పటికీ హార్దిక్ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. పరిమిత ఓవర్ల ప్రపంచకప్లో అద్భుతమైన ప్రదర్శన చేసి భారత జట్టు విజయంలో తనవంతు పాత్ర పోషించాడు హార్దిక్ పాండ్యా.
Also Read: Ind Vs Eng 2nd Test: భారత్ ను కలవర పెడుతున్న ఎడ్జ్ బాస్టన్.. గత రికార్డులు అలా ఉన్నాయి మరి
ఎప్పుడైతే పరిమిత ఓవర్ల ప్రపంచ కప్ లో ప్రతిభ చూపించాడో.. హార్దిక్ ఒకసారి గా మైదానంలో చిన్నపిల్లాడి మాదిరిగా ఏడ్చేశాడు. చాలామంది అది కప్ సాధించిన సందర్భంలో వ్యక్తం చేసిన భావోద్వేగం అని అనుకున్నారు. కానీ హార్దిక్ అలా ఏడవడానికి కారణం వేరే ఉంది. ఇక ఆ తర్వాత హార్దిక్ అధికారికంగా తన విడాకుల ప్రకటన చేశాడు. విడాకుల ప్రకటన చేసిన తర్వాత కూడా హార్దిక్ మీద తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమయ్యాయి.
తన చుట్టూ.. తన ముందు ఇన్ని జరుగుతున్నప్పటికీ హార్దిక్ ఏనాడూ నోరు విప్పలేదు. విమర్శలు చేస్తున్న వారిని మందలించలేదు. ఆరోపణలు చేస్తున్న వారితో వాగ్వాదానికి దిగలేదు. నిశ్శబ్దంగా తన పని తాను చేసుకుంటూ వెళ్లిపోయాడు. ఈ ఆరు నెలల కాలంలో అతడు ఒకరకంగా మనోవేదన ను అనుభవించాడు. ఏం చేయాలో తెలియక ఒంటరిగా కాలాన్ని గడిపాడు. మానసిక ప్రశాంతత కోసం వేరే ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడ దిగిన ఫోటోలను కొంతమంది భూతద్దంలో చూసి రకరకాల సంబంధాలు అంటగట్టారు.. అయితే ఇదే విషయాలపై హార్దిక్ పాండ్యా తొలిసారి స్పందించాడు.
Also Read: MS Dhoni Business : ధోని కొత్త యాపారం.. ఏ బిజినెస్ పెడుతున్నాడో తెలుసా?
” నన్ను తిట్టని వ్యక్తి లేడు. విమర్శించని నోరు లేదు. అయినప్పటికీ నేను నిశ్శబ్దంగానే ఉన్నాను. నా వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఆటుపోట్లు ఉన్నాయి. అవన్నీ కూడా నాకు సంబంధించినవి. మిగతా వాళ్లకు అంత ఆసక్తి ఏమిటో అర్థం కావడం లేదు. నేను సెలబ్రిటీ అవ్వడానికి చాలా కష్టపడ్డాను. నేను సామాన్యంగా ఉన్నప్పుడు ఏ సెలబ్రిటీని కూడా తిట్టలేదు. కానీ నేను సెలబ్రిటీ అయిన తర్వాత తిట్టడానికి చాలామందికి నోర్లు వస్తున్నాయి. నిజంగా వారు అంత ఖాళీగా ఉన్నారా.. అంత ఖాళీగా ఉంటే వేరే పని మీద దృష్టి సారించవచ్చు కదా.. నన్ను ఎందుకు తిట్టడం అంటూ” హార్దిక్ వ్యాఖ్యానించాడు. అయితే తన వైవాహిక జీవితం విచ్చిన్నమైన తర్వాత తొలిసారిగా హార్దిక్ స్పందించడం.. తన సహజ శైలికి భిన్నంగా వ్యాఖ్యలు చేయడం విశేషం. హార్దిక్ ఈ వ్యాఖ్యలు చేసిన తర్వాత ఇప్పటికైనా అతని మీద విమర్శలు తగ్గుతాయో చూడాలని అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు.
A day I’ll never forget. A day we’ll never forget. For all of us, India ❤️ pic.twitter.com/gWxxbdcCv0
— hardik pandya (@hardikpandya7) June 29, 2025