Ind Vs Eng 2nd Test: 400 పరుగులకు దగ్గరగా లక్ష్యాన్ని ప్రత్యర్థి జట్టు ఎదుట ఉంచినప్పటికీ భారత్ విజయం సాధించలేకపోయింది. పైగా దారుణమైన బౌలింగ్ తో పరువు తీసుకుంది. మరో సెషన్ మిగిలి ఉండగానే ఓడిపోయి తలవంచింది.. శతాబ్దానికి మించిన టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యంత చెత్త రికార్డును సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఎడ్జ్ బాస్టన్ లో రెండవ టెస్ట్ బుధవారం నుంచి ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో.. టీమిండియా రికార్డులను ఒకసారి ఈ మైదానంలో పరిశీలిస్తే..
Also Read: చిరంజీవి సపోర్ట్ వల్లే ఆ నటుడు స్టార్ హీరోగా ఎదిగాడా..?
ఎడ్జ్ బాస్టన్ మైదానంలో భారతి ఇప్పటివరకు 7 టెస్ట్ మ్యాచ్లు ఆడింది. ఇందులో ఒక విజయం కూడా సాధించలేకపోయింది. ఒక మ్యాచ్ మాత్రం డ్రా చేసుకోండి. చివరిగా ఈ వేదిక మీద భారత 2022లో టెస్ట్ మ్యాచ్ ఆడింది. ఇక్కడ 7 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ప్రస్తుతం భారత జట్టు సారథిగా ఉన్న గిల్, ఉపసారథిగా ఉన్న రిషబ్ పంత్, బుమ్రా, సిరాజ్ నాటి మ్యాచ్లో ఆడారు. అప్పుడు తొలి ఇనింగ్స్ లో రిషబ్ పంత్ 146 పరుగులు చేశాడు. జడేజా 104 పరుగులు చేశాడు. 416 పరుగులు చేసిన భారత్.. ఇంగ్లీష్ జట్టును 284 కే ఆల్ అవుట్ చేసింది. సెకండ్ ఇన్నింగ్స్ లో భారత్ 245 ఫ్రెండ్స్ మాత్రమే చేసింది. ఇక 378 రన్స్ భారీ టార్గెట్ ను ఇంగ్లీష్ జట్టు కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి ఫినిష్ చేసింది. రూట్ 142 రన్స్ చేసి అదరగొట్టాడు. బెయిర్ స్టో 114 పరుగులు చేశాడు. రూట్, స్టో అజేయంగా నిలవడం విశేషం.. ఈ వేదిక భారత జట్టుకు ఎన్నడూ అచ్చిరాని నేపథ్యంలో ఈసారి ఎలా ఆడుతుంది అనేది చూడాల్సి ఉంది.
ఈ మైదానం పేస్ బౌలర్లకు స్వర్గధామం. అలాగని బ్యాటింగ్ కు అనుకూలించదని కాదు. బ్యాటింగ్ కు కూడా అనుకూలంగా ఉంటుంది. అయితే తొలి టెస్ట్ జరిగిన మైదానంలో ఉన్నంత అనుకూల పరిస్థితులు ఇక్కడ ఉండకపోవచ్చని తెలుస్తోంది. మరోవైపు తొలి టెస్టుల్లో ఓటమి నేపథ్యంలో భారత జట్టు లో మార్పులు చోటుచేసుకునే అవకాశం కల్పిస్తోంది.. కులదీప్ యాదవ్ కు చోటు దక్కుతుందని తెలుస్తోంది. ఎందుకంటే కులదీప్ కు ఆకాశం కల్పించాలని మాజీ ప్లేయర్లు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో.. మేనేజ్మెంట్ కూడా సానుకూలంగా స్పందిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ వేదికలో జరిగే రెండవ టెస్టులో జడేజా, కులదీప్, వాషింగ్టన్ సుందర్ స్పిన్ విభాగాన్ని పంచుకుంటారని సమాచారం. బుమ్రా స్థానంలో అర్ష్ దీప్ సింగ్ కు చోటు ఖాయమని తెలుస్తోంది. ఆకాష్ దీప్ కూడా తుది జట్టులో చోటు దక్కించుకుంటాడని సమాచారం.. అయితే తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డికి కూడా స్థానం లభిస్తుందని ప్రచారం జరుగుతోంది.. ఎందుకంటే తొలి టెస్టులో కరణ్, సుదర్శన్ విఫలమయ్యారు. శార్దూల్ ఠాకూర్ కూడా ఆకట్టుకోలేదు. అందువల్లే ఠాకూర్ స్థానంలో నితీష్ కుమార్ రెడ్డికి అవకాశం ఇస్తారని తెలుస్తోంది.
టీమిండియాలో ఓపెనర్లు బాగానే ఆడుతున్నారు. మిడిల్ ఆర్డర్ విఫలమవుతోంది. లోయర్ ఆర్డర్ చేతులెత్తేస్తోంది. తొలి మ్యాచ్లో రెండు ఇన్నింగ్స్ లలోనూ ఇదే జరిగింది. అందువల్లే జట్టులో అనేక మార్పులు చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. మరోవైపు తొలి టెస్ట్ లో విజయం సాధించిన ఇంగ్లీష్ జట్టు జోరు మీద ఉంది. రెండో టెస్టులో ఎటువంటి మార్పులు లేకుండానే బరిలోకి దిగుతోంది.