Kajal Aggarwal 7/G Brindavan Colony: ఒక సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధించడం అనేది అంత ఈజీ అయితే కాదు. దానికోసం చాలా రకాలుగా కష్టపడాల్సిన అవసరమైతే ఉంది. ఒక మంచి కథ దొరికినంత మాత్రాన సక్సెస్ అయితే రాదు. దానికి తగ్గట్టుగా దర్శకుడు ఆ సినిమాని స్క్రీన్ మీద ప్రజెంట్ చేసినప్పుడు మాత్రమే ఆ సినిమా సక్సెస్ అవుతుంది…
Also Read: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెట్స్ లో మెగాస్టార్ చిరంజీవి..ఫ్యాన్స్ కి స్వీట్ సర్ప్రైజ్ ఇవ్వనున్న టీం?
సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలామంది నటులు వాళ్లకు ఫేమ్ వచ్చేదాకా ఇతర హీరోల సినిమాల్లో సైడ్ ఆర్టిస్టులుగా నటిస్తూ ఉంటారనే విషయం మనందరికీ తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) నుంచి నాని (Nani) వరకు ప్రతి ఒక్కరు ఏదో ఒక సినిమాలో చిన్న క్యారెక్టర్లు చేస్తూ వచ్చిన వారే కావడం విశేషం… ఒకప్పుడు తన అందచందాలతో కుర్రకారు మతులు పోగొట్టిన కాజల్ లాంటి నటి సైతం ‘లక్ష్మీ కళ్యాణం’ సినిమాతో ఇండస్ట్రీ కి పరిచయం అయింది. నిజానికి ఆ సినిమా కంటే ముందే ఒకటి రెండు సినిమాల్లో సైడ్ ఆర్టిస్ట్ గా నటించింది. సెల్వరాఘవన్ దర్శకత్వంలో రవికృష్ణ హీరోగా వచ్చిన 7/G బృందావన కాలనీ (7/G Brundavana Colony) సినిమాలో ఆమె ఒక పాటలో కనిపించడం విశేషం…మేము వయసుకు వచ్చాం అనే పాటలో హీరో పక్కన డాన్స్ చేస్తూ అలరించింది. తను హీరోయిన్ అవ్వడం వల్ల ఆమెను చూసిన ప్రతి ఒక్కరు కాజల్ అప్పుడు ఇలాంటి చిన్న పాత్రలో కూడా నటించిందా? అంటూ సోషల్ మీడియా లో కామెంట్లు పెడుతున్నారు. మరి ఏది ఏమైనా కూడా ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది…ఇక మొత్తానికైతే యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని ముందుకు తీసుకెళ్తున్న మన స్టార్ హీరోల సినిమాల్లో హీరోయిన్ గా నటించిన కాజల్ ఇప్పుడు పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల్ అయిపోయింది.
అడపదడప మంచి క్యారెక్టర్లు ఉంటే తప్ప ఆమె సినిమాలో నటించడం లేదు. రీసెంట్ గా కన్నప్ప (Kannappa) సినిమాలో పార్వతి దేవిగా నటించి మంచి గుర్తింపును సంపాదించుకుంది. సీనియర్ హీరోలకి జోడిగా నటించడానికి తను ఎప్పుడు సిద్ధంగా ఉన్నానని చెబుతోంది. బాలయ్య బాబుతో ‘భగవంతు కేసరి’ (Bhagavanrh Kesari) సినిమాలో హీరోయిన్ గా నటించి మెప్పించింది.
రాబోయే మరి కొంతమంది స్టార్ హీరోల పక్కన కూడా తను హీరోయిన్ గా నటించే అవకాశాలైతే ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక ఏది ఏమైనా కూడా మగధీర (Magadheera) సినిమాతో యూత్ లో మంచి ఫాలోయింగ్ ను సంపాదించుకొని అప్పటినుంచి ఇప్పటివరకు తన క్రేజ్ ను కంటిన్యూ చేస్తూ రావడం విశేషం…
ఇండస్ట్రీ కి వచ్చి 20 సంవత్సరాలు అవుతున్నప్పటికి ఆమె ఇప్పటికి కూడా చాలా అందంగా ఉండడం నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి. ఇక ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలందరితో నటించిన హీరోయిన్ గా తనకు గొప్ప గుర్తింపు కూడా లభించింది…