Nitish Kumar Reddy: సీనియర్ క్రికెటర్, గుజరాత్‌కు చెందిన హార్థిక్‌పాండ్యా అందుబాటులో లేకి కారణంగా టెస్టు జట్టులో అనూహ్యంగా తెలుగు కుర్రాడాకి స్థానం దక్కింది. నవంబర్ 8 నుంచి ప్రారంభమైన దక్షిణాప్రికా టీ20 జట్టులో చోటు దక్కకపోయినా.. ఆస్ట్రేలియా టూర్‌కు ఎంపిక చేసిన టీమిండియా జట్టులో అనూహ్యంగా స్థానం దక్కింది. అయినా టెస్టుల్లో అతినిక అంతగా ప్రాధాన్యం దక్కకపోవచ్చని చాలా మంది భావించారు. కానీ, తొలి టెస్టులో 11 మందిలో స్థానం దక్కించుకుని తన ఆటతీరుతో అందరినీ ఆకట్టుకున్నాడు. రెండో టెస్టులో సీయనియర్లు విఫలైమనా తను మాత్రం నిలబడి అందరి దృష్టిని ఆకట్టుకున్నాడు. ఆసిస్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు.
అతడే బెస్ట్ ఆప్షన్..
విశాఖపట్టణానికి చెందిన నితీశ్‌కుమార్‌రెడ్డి దేశవాళీ క్రికెట్‌లో ఆంధ్రా జట్టుకు, ఐపీఎఎల్ లీగ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడి సత్తా చాటాడు. 2023 ఐపీఎల్ వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ జటుట రూ.20 లక్షలకు కొనుగోలు చేసింది. ఐపీఎల్‌లో రాణించిన నితీశ్‌కు జాతీయ జట్టులో స్థానం దక్కింది. ఆల్‌రైండర్ పాత్రకు న్యాయం చేస్తాడని జట్టు మేనేజ్‌మెంట్ భావించింది. ఆస్ట్రేలియా టూర్‌కు ఎంపిక చేసింది. హార్ధిక్ పాండ్యా, శార్దూల్ పటేల్ అందుబాటులో లేకపోవడం నితీశ్‌కు కలిసి వచ్చింది. వారికి నితీశే బెస్ట ఆప్షన అని మేనేజ్‌మెంట్ భావించింది.
ఆటలో మెచ్యూరిటీ…
ఇక జట్టులో స్థానం దక్కించుకున్న నితీశ్ ఆటలో ఎంతో మెచ్యూరిటీ కనబరుస్తున్నారు. సీనియర్లు విఫలమైన పిచ్‌పై సత్తా చాటుతున్నాడు. ఆసీస్ పిచ్‌లపై రాణించడం అంత ఈజీ కాదు. కానీ, నితీశ్ ఆసీస్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటున్నాడు. నిలకడైన ఆటతీరుతో జట్టుకు కీలక పరుగులు అందిస్తున్నారు. ఆస్ట్రేలి బౌలర్లకు బెనకకుండా తొనక కుండా గౌరవ పదమైన పరుగుల చేస్తున్నాడు. దీంతో నితీశ్ ఉంటే.. జట్టుకు పరుగులు కాయం అన్న అభిప్రాయం క్రికెట్ అభిమానుల్లో నెలకొంది.
గవాస్కర్ ప్రశంస..
ఇక తాజాగా గబ్బా స్టేడియంలో జరిగిన ఐదో టెస్టులో నితీశ్ ఆటతీరుపై లెజెండ్ క్రికెటర్ గవాస్కర్ ప్రశంసలు కురిపించాడు. నాలుగో రోజు నితీశ్ 61 బంతులు ఎదుర్కొని 16 పరుగులు చేశాడు. జడేజాతో కలిసి 53 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. నితీశ్ ఆటతీరుపై గవాస్కర్ స్పందించారు. ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియా బౌలర్ల బౌన్సర్ల బ్యారేజీలోకి నితీశ్‌ను లాలాలని చూశారు. కానీ, అతను ఎలాంటి తప్పు చేయకుండా జాగ్రత్తగా ఆడాడు. అడిలైట్‌లో టెలయిలెండర్లు బ్యాటింగ్‌కు దిగే సరిని నితీశ్ ఔటయ్యాడు. ఈసారి మాత్రం ఆ తప్పు చేయలేదు. పుల్ షార్ట్ ఆడేందుకు యత్నించడం లేదు. టెంపర్మెంట్ కారణంగా నితీశ్ బాయ్ నుంచి మెన్‌గా మారుతున్నాడు అని అభినందించారు.