https://oktelugu.com/

Buying a Used Car: వాడేసిన కారు కొంటున్నారా? మెకానిక్ అవసరం లేకుండా.. ఈ విషయాలను మీరే తెలుసుకోండి..

కొత్త కారు కొనాలని చాలా మంది ఆసక్తి ఉంటుంది. కానీ సరైన బడ్జెట్ అందరికీ అందుబాటులో ఉండదు. దీంతో చాలా మంది సెకండ్ హ్యాండ్ కారు కొనాలని అనుకుంటారు. కానీ యూజ్డ్ కారు కొనుగోలు చేసిన తరువాత వాటిలో ఉండే రిపేర్లను చూసి చాలా ఆందోళన చెందుతారు. అందువల్ల ఇప్పటికే వాడిన కారును కొనాలా? లేదా? అనేది ఎవరైనా తెలిసిన మెకానిక్ ను తీసుకెళ్లి చూపిస్తాం..

Written By:
  • Srinivas
  • , Updated On : December 18, 2024 / 04:22 PM IST

    Second-Hand-Cars

    Follow us on

    Buying a Used Car: కొత్త కారు కొనాలని చాలా మంది ఆసక్తి ఉంటుంది. కానీ సరైన బడ్జెట్ అందరికీ అందుబాటులో ఉండదు. దీంతో చాలా మంది సెకండ్ హ్యాండ్ కారు కొనాలని అనుకుంటారు. కానీ యూజ్డ్ కారు కొనుగోలు చేసిన తరువాత వాటిలో ఉండే రిపేర్లను చూసి చాలా ఆందోళన చెందుతారు. అందువల్ల ఇప్పటికే వాడిన కారును కొనాలా? లేదా? అనేది ఎవరైనా తెలిసిన మెకానిక్ ను తీసుకెళ్లి చూపిస్తాం.. మెకానిక్ ఓకే అన్న తరువాత కొనుగోలు చేస్తాం. అయితే ఇప్పుడు మొబైల్ టెక్నాలజీ వచ్చిన తరువాత యూజ్డ్ కార్లు కొనే విషయంలో ఎవరినీ నమ్మడానికి వీలు లేదు. దీంతో సొంతంగా కారును చెక్ చేసుకునే కొన్ని టిప్స్ ఉన్నాయి. వీటి ప్రకారంగా కారును చెక్ చేసుకొని ఆ తరువాత కొనుగోలు చేయొచ్చు. అవేంటంటే?

    సెకండ్ హ్యాండ్ కార్లు కొనేవారి సంఖ్య కూడా చాలానే ఉంటుంది. కొత్త కారు కొనుగోలు చేసిన తరువాత కొందరిక బడ్జెట్ సరిపోక.. వీటిని మార్చి మరో కారు తీసుకోవాలని అనుకునేవారు.. తమ కార్లను అమ్మేస్తుంటారు. అయితే కొందరు యూజ్డ్ కారు కొని సేల్స్ చేసే వారు ఉంటారు. వారి వద్ద ఎప్పుడు వెళ్లినా సెకండ్ హ్యాండ్ కార్లు అందుబాటులో ఉంటాయి. అయితే ఇవి చూడ్డానికి పైకి బాగానే ఉంటాయి. కానీ ఇంజిన్ లేదా కారు లోపలి పార్ట్స్ దెబ్బతిని ఉంటాయి. వీటిపై అవగాహన లేక చాలా మంది యూజ్డ్ కారు కొనుగోలు చేసిన తరువాత మోసపోతుంటారు.

    యూజ్డ్ కారు కొనే ముందు ఈ విషయాల గురించి తెలిస్తే ఆ తరువాత ఎలాంటి నష్టం ఉండదు. అందులో మొదటిది.. కారులో నాలుడు డోర్లు కరెక్ట్ గా ఉన్నాయా? లేవా చూసుకోవాలి. వీటితో పాటు డిక్కీ గ్లాస్ కూడా చెక్ చేసుకోవాలి. ఎందుకంటే కారు ఏ చిన్న క్రాషెస్ జరిగినా మొదట డ్యామేజ్ అయ్యేది గ్లాస్. దీనిని బట్టి కారు ఇదివరకు క్రాష్ అయ్యిందో లేదో తెలుసుకోవచ్చు. అంతేకాకుండా ఈ గ్లాస్ అన్నీ ఒకే సంవత్సరంలో కొనుగోలు చేశారా? లేదా? కూడా చెక్ చేసుకోవాలి. తేడా ఉంటే గ్లాస్ మార్చారని అర్థం చేసుకోవాలి. కారులోని మెయిన్ పిల్లర్స్ సీల్ చేసి ఉన్నాయా? లేవా? చూసుకోవాలి. ఇవి ఓపెన్ చేసి ఉంటే వాటి రిపేర్ అయిందని అర్థం.

    కారుకు సంబంధించిన నాలుగు డోర్లకు ఉండే రబ్బర్ ను కూడా చెక్ చేయాలి. ఎప్పుడు మార్చారో? లేదా? కారుతో వచ్చిందా? అనేది చూసుకోవాలి. ఆ తరువాత కారుకు డోర్ ఫిల్లర్స్ డ్యామేజ్ అయ్యాయా? లేవా? అనేది చెక్ చేసుకోవాలి. ఇప్పుడు కారుకు కింది భాగంలో డ్యామేజ్ అయిందా అనేది చెక్ చేసుకోవాలి. రోడ్డు బాగా లేని ప్రదేశాల్లో కారు ఎక్కువగా తిరగడం వల్ల కారు కింది బాడీ క్రషెష్ అయ్యే అవకాశం ఉంది. వీటి డ్యామేజ్ గురించి తెలుసుకోవాలి. ఇక మెయిన్ విషయం ఏంటంటే? ఇంజిన్ ఆన్ చేసిన తరువాత ఇంజిన్ ఆయిల్ బయటకు రావొద్దు. అలా వస్తుందంటే అది సమస్యల్లో ఉన్నట్లు తెలుసుకోవాలి.

    కారుకు సైలెన్సర్ చెక్ చేయడం చాలి ఇంపార్టెంట్. సైలెన్షర్ నుంచి ఎక్కువగా పొగ వస్తుందా? లేదా? అనేది చెక్ చేసుకోవాలి. ఇంజిన్ సమస్య ఉంటే ఇందులో నుంచి ఎక్కువగా పొగ వస్తుంటుంది. ఇక కారు నడిపే సమయంలో స్టీరింగ్ సౌండ్ వస్తుందా? లేదా? అనేది చెక్ చేసుకోవాలి. స్టీరింగ్ సౌండ్ వస్తుందంటే దాని సమస్య గురించి తెలుసుకోవాలి.