Faf du Plessis: అలా ఆడి ఉండాల్సింది..అదే మా కొంపకు చేటు తెచ్చింది..ఫాఫ్ డూ ప్లెసిస్

సోమవారం రాత్రి జరిగిన మ్యాచ్ లో ముందుగా హైదరాబాద్ ను బెంగళూరు బ్యాటింగ్ కు ఆహ్వానించింది. ఈనేపథ్యంలో హైదరాబాద్ ఆటగాళ్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు.

Written By: Anabothula Bhaskar, Updated On : April 16, 2024 3:22 pm

Faf du Plessis

Follow us on

Faf du Plessis: “బౌలింగ్ లో మా బౌలర్లు దారాళంగా పరుగులు ఇచ్చారు. అది మా జట్టు విజయావకాశాలను దారుణంగా దెబ్బతీసింది. అలా ఆడి ఉండకుంటే బాగుండేదని” బెంగళూరు కెప్టెన్ ఫాఫ్ డూప్లెసిస్ అభిప్రాయపడ్డాడు. మ్యాచ్ అనంతరం అతడు కీలక వ్యాఖ్యలు చేశాడు.

సోమవారం రాత్రి జరిగిన మ్యాచ్ లో ముందుగా హైదరాబాద్ ను బెంగళూరు బ్యాటింగ్ కు ఆహ్వానించింది. ఈనేపథ్యంలో హైదరాబాద్ ఆటగాళ్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. దీంతో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఐపీఎల్ హిస్టరీలో హైయెస్ట్ స్కోర్ చేసింది. ఏకంగా 287 పరుగులు సాధించి సరికొత్త రికార్డు స్థాపించింది. హైదరాబాద్ ఆటగాడు హెడ్ సెంచరీ సాధించాడు. అతడికి తగ్గట్టుగా క్లాసెన్ 67 పరుగులు చేశాడు. దీంతో హైదరాబాద్ జట్టు స్కోర్ తుఫాన్ వేగంతో పరుగులు పెట్టింది.

అనంతరం బ్యాటింగ్ చేపట్టిన బెంగళూరు జట్టు 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 262 రన్స్ చేసింది. దినేష్ కార్తీక్ 83, ఫాఫ్ డూప్లెసిస్ 62 పరుగులు చేసినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. ఫలితంగా బెంగళూరు ఇన్నింగ్స్ 262 పరుగుల వద్ద ముగిసింది. దీంతో హైదరాబాద్ జట్టు 25 పరుగుల తేడాతో విజయం సాధించింది.

మ్యాచ్ అనంతరం కెప్టెన్ ఫాఫ్ డూప్లెసిస్ మాట్లాడాడు. “మా కుర్రాళ్ళు చివరి వరకు పోరాడారు. మా బ్యాటింగ్ ప్రదర్శన గతంతో పోలిస్తే చాలా మెరుగయింది. ఫలితం గురించి పక్కన పెడితే మేము మెరుగైన క్రికెట్ ఆడాం. ఫలితం గురించి పక్కన పెడితే మేము చివరి వరకు పోరాటం సాగించాం. 280 పరుగుల టార్గెట్ పెద్దది అయినప్పటికీ.. మేము ఏమాత్రం భయపడకుండా ఎదురుదాడిని నమ్ముకున్నాం. భిన్నమైన ప్రణాళికలతో మైదానంలోకి దిగినప్పటికీ.. కొన్ని సందర్భాల్లో ఆత్మవిశ్వాసం సన్నగిల్లింది. మా బౌలర్లు దారుణంగా బౌలింగ్ చేశారు. సిరాజ్ ను పక్కన పెట్టినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. బ్యాటింగ్ విభాగం లోనూ కొన్ని సమస్యలు ఉన్నాయి. వాటిని కూడా పరిష్కరించుకుంటాం. ఇకనుంచి సరికొత్త ఆట తీరు ప్రదర్శిస్తామని” ఫాఫ్ డూప్లెసిస్ అన్నాడు.

కాగా, ఈ మ్యాచ్లో హైదరాబాద్ ఆటగాళ్లు 22 సిక్స్ లు బాది ఐపీఎల్ చరిత్రలో ఒక ఇన్నింగ్స్ లో.. అత్యధిక సిక్సర్లు కొట్టిన ఘనతను సృష్టించారు. ఇదే సమయంలో బెంగళూరు పై ఉన్న రికార్డును బద్దలు కొట్టారు. 2013లో పూణే జట్టుతో జరిగిన మ్యాచ్లో బెంగళూరు 21 సిక్స్ లు కొట్టింది. అయితే ఆ రికార్డును హైదరాబాద్ జట్టు బ్రేక్ చేసింది.