Cricket In Olympics 2028: సాధారణంగా ఒలంపిక్స్ క్రీడలను ప్రపంచ క్రీడా పోటీలుగా వ్యవహరిస్తుంటారు. ప్రపంచంలోని వివిధ దేశాల చెందిన ఆటగాళ్లు ఒలంపిక్స్ లో పాల్గొంటారు. ఒలంపిక్స్ లో మెడల్స్ సాధించడానికి తమ జీవితాశయంగా భావిస్తుంటారు. ఇందుకోసం ఏళ్లకు ఏళ్లుగా శ్రమిస్తుంటారు. కొంతమంది అయితే నిద్రాహారాలు కూడా మానేస్తుంటారు. హోరాహోరీగా పోటీ సాగే ఈ క్రీడాంశాలను నిర్వాహకులు న భూతో న భవిష్యతి అనే స్థాయిలో నిర్వహిస్తుంటారు. ఇక ఇటీవల నిర్వహించిన పారిస్ ఒలంపిక్స్ లో వేడుకలు అంబరాన్ని తాకాయి. ప్రతి అంశం లోను నిర్వాహకులు తమదైన ముద్ర ప్రదర్శించారు. నది నుంచి ఒలంపిక్స్ జ్యోతిని తీసుకురావడం.. ఆ జ్యోతి కి ప్రపంచంలోని వివిధ దేశాలకు చెందిన క్రీడాకారులు స్వాగతం పలకడం వంటివి చూసే ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కలిగించాయి. అంతేకాదు పారిస్ ఒలంపిక్స్ ద్వారా .. ఒలంపిక్స్ పోటీలను ఇలా కూడా నిర్వహించవచ్చని నిర్వాహకులు ప్రపంచానికి సరికొత్తగా చాటి చెప్పారు. 2028 లో లాస్ ఏంజిల్స్ లో ఒలంపిక్స్ జరగబోతున్నాయి.
Also Read: సాయి సుదర్శన్.. మరో ఎబి డివిలియర్స్ అవుతాడా?
అభిమానులకు గుడ్ న్యూస్
మన దేశంలో క్రికెట్ ను చాలామంది చూస్తుంటారు. చాలామంది కూడా ఆడేందుకు ఇష్టపడుతుంటారు. క్రికెటర్ గా ఒక్కసారి గుర్తింపు తెచ్చుకుంటే జీవితం లో స్థిరపడవచ్చు అని అనుకోవడమే ఎందుకు కారణం. పైగా మనదేశంలో క్రికెటర్లకు విపరీతమైన ఫాలోయింగ్ ఉంటుంది. డబ్బుకు డబ్బు.. పేరుకు పేరు.. గుర్తింపుకు గుర్తింపు లభిస్తుంది. అయితే క్రికెట్ కంటే ఎక్కువగా ప్రపంచంలో ఫుట్ బాల్ కు ఆదరణ ఉంటుంది. ఒలంపిక్స్ లో వీటికంటే విభిన్నమైన క్రీడాంశాలలో నిర్వాహకులు పోటీలు నిర్వహిస్తుంటారు. అయితే లాస్ ఏంజిల్స్ లో నిర్వహించే ఒలంపిక్స్ లో కొత్తగా క్రికెట్ ను ప్రవేశపెడతారని తెలుస్తోంది. అదే కనుక నిజమైతే భారత అభిమానులకు పండగే. ఎందుకంటే భారతదేశంలో ఇప్పటివరకు వెయిట్ లిఫ్టింగ్, బ్యాడ్మింటన్, షూటింగ్ వంటి వాటిల్లోనే మెడల్స్ సాధించింది. అయితే వచ్చే ఒలంపిక్స్ లో కనుక క్రికెట్ కు చోటు కల్పిస్తే మాత్రం భారతదేశానికి మెడల్స్ పంట పండుతుందని క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు. ఇక ఒలంపిక్స్ కి వెళ్లే జట్లు ఆరు అని.. అవి ఇండియా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, సౌత్ ఆఫ్రికా, పాకిస్తాన్ అని చర్చ జరుగుతున్నది. అయితే దీనిపై అధికారికంగా ఇప్పటివరకు ఎటువంటి వివరాలు బయటకు వెల్లడి కాలేదు. ఒకవేళ ఈ జట్లు గనుక అధికారికంగా ఓకే అయితే.. పోటీ మాత్రం రసవత్తరంగా ఉండే అవకాశం ఉంది. అంతేకాదు ఈ పోటీలను ప్రసారం చేసేందుకు దిగ్గజ టీవీ సంస్థలు ముందుకు వచ్చే అవకాశం లేకపోలేదు. అదే జరిగితే ఒలింపిక్స్ నిర్వాహకులకు కాసుల పంట పండుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే ఒలంపిక్స్ లో క్రికెట్ ను కూడా ఒక పోటీ అంశంగా భావించేందుకు ఐసీసీ ఒప్పుకుంటుందా అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఐసీసీకి చైర్మన్ గా భారతదేశానికి చెందిన జై షా వ్యవహరిస్తున్నారు.
CRICKET WILL HAVE 6 TEAMS IN THE 2028 LOS ANGELES OLYMPICS pic.twitter.com/qYDS81qKLM
— Johns. (@CricCrazyJohns) April 10, 2025