ధోనీ.. ఇండియన్ క్రికెట్ మాజీ కెప్టెన్. నిల్చున్న చోట నుంచి సిక్స్‌లు బాదే ఘనుడు. చివరి నిమిషంలోనూ మ్యాచ్ తమ వైపు తిప్పడంలో ఆయనకు ఆయనే సాటి. దేశానికి వరల్డ్ కప్ అందించిన కెప్టెన్. అన్నింటికీ మించి ఆయన ఆట తీరు.. ఆయన వ్యవహార శైలి. అలాంటి ధోనీ జట్టు దుబాయి వేదికగా నడుస్తున్న ఐపీఎల్‌లో సత్తా చాటలేకపోయింది. కనీసం ప్లేఆఫ్స్‌కు కూడా చేరలేక చేతులెత్తేసింది.
Also Read: చెన్నై ఫ్యాన్స్ భావోద్వేగం.. గెలిచినా-ఓడినా CSKతోనే..!
ఐపీఎల్‌లో ఆడిన 10 సార్లూ ప్లే ఆఫ్ చేరి అరుదైన రికార్డు సృష్టించిన చెన్నై సూపర్ కింగ్స్ ఈ సారి పరాజయాల పరంపరంతో ఆ ఛాన్స్ దూరం చేసుకుంది. ఐపీఎల్ ప్రారంభం నుంచి ఇప్పటివరకు చెన్నై సూపర్ కింగ్స్ జట్టు అద్భుతమైన ఆటతీరుతో అందరినీ అలరించింది. కానీ ఈ సారి సెమీఫైనల్స్ కాదు కదా.. కనీసం ప్లేఆఫ్స్‌ను చేరకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించింది.
ఇప్పటివరకు మూడుసార్లు ఐపీఎల్ ఛాంపియన్‌గా నిలిచిన ఓ జట్టు ఇలా కనీసం ప్లేఆఫ్స్‌కు కూడా చేరకపోవడం అభిమానులను నిరాశ పరిచింది. గత సీజన్‌లో ఫైనల్స్ చివరి బంతి వరకూ వెళ్లింది. ఈ ఏడాది మాత్రం ఆ సత్తా చాటలేకపోయింది.
Also Read: ఆ‘రేంజ్ ఆర్మీ’.. లాస్ట్ పంచ్ లో సన్ ‘రైజర్స్’
ఐపీఎల్ ప్రారంభం నుంచి చెన్నై టీమ్‌ను పలు సమస్యలు వేధిస్తూనే ఉన్నాయి. కరోనా కారణంగా కొంత మంది టీంకు దూరం అయ్యారు. సరైన ప్రాక్టీస్‌కు సమయం దొరకలేదు. హర్భజన్ సింగ్, సురేశ్ రైనా వంటి కీలక ఆటగాళ్లు వ్యక్తిగత కారణాలతో తప్పుకున్నారు. అంతేకాదు, కీలకమైన మ్యాచ్‌లలో ధోనీ సరిగా ఆడలేదని విమర్శకులు అంటున్నారు. ఇమ్రాన్ తాహిర్ లాంటి మంచి బౌలర్‌కు అవకాశం ఇవ్వకపోవడం, బ్రావో గాయపడడం జట్టు వైఫల్యానికి ముఖ్య కారణాలుగా నిపుణులు చెబుతున్నారు.