ప్రభాస్ కు ధీటుగా దీపిక పాత్ర ఉండనుందా?

‘బాహుబలి’.. సినిమా తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ క్రేజ్ వరల్డ్ వైడ్ గా మారింది. ఈ సినిమా విడుదలైన అన్ని భాషల్లో సూపర్ హిట్టుగా నిలిచి కలెక్షన్ల వర్షం కురిపించింది. ఈ మూవీ తర్వాత వచ్చిన ‘సాహో’ సైతం ప్రభాస్ క్రేజ్ ను మరింత పెంచింది. దీంతో ప్రభాస్ వరుసగా ప్యాన్ ఇండియా మూవీలు చేస్తూ నేషనల్ స్టార్ గా ఎదిగిపోయాడు. Also Read: సంక్రాంతికి హౌస్ ఫుల్ బోర్డ్.. కానీ అదొక్కటే మైనస్..! ఈక్రమంలోనే […]

Written By: NARESH, Updated On : October 26, 2020 1:38 pm
Follow us on

‘బాహుబలి’.. సినిమా తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ క్రేజ్ వరల్డ్ వైడ్ గా మారింది. ఈ సినిమా విడుదలైన అన్ని భాషల్లో సూపర్ హిట్టుగా నిలిచి కలెక్షన్ల వర్షం కురిపించింది. ఈ మూవీ తర్వాత వచ్చిన ‘సాహో’ సైతం ప్రభాస్ క్రేజ్ ను మరింత పెంచింది. దీంతో ప్రభాస్ వరుసగా ప్యాన్ ఇండియా మూవీలు చేస్తూ నేషనల్ స్టార్ గా ఎదిగిపోయాడు.

Also Read: సంక్రాంతికి హౌస్ ఫుల్ బోర్డ్.. కానీ అదొక్కటే మైనస్..!

ఈక్రమంలోనే ప్రభాస్ చేతిలోకి నాలుగైదు క్రేజీ ప్రాజెక్టులు వచ్చి చేరాయి. ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా మూవీలే కావడం విశేషం. డార్లింగ్ ప్రభాస్ తాజాగా ‘రాధేశ్యామ్’ మూవీని చేస్తున్నాడు. ఈ మూవీలో ప్రభాస్ కు జోడీగా పూజా హెగ్డే నటిస్తుంది. ఈ మూవీకి సంబంధించిన మోషన్ పోస్టర్ ప్రభాస్ పుట్టిన రోజు రిలీజై రికార్డులు సృష్టించింది.

‘రాధేశ్యామ్’ పూర్తయిన వెంటనే ప్రభాస్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ మూవీని.. బాలీవుడ్ దర్శకుడు ఓం రావత్ తెరకెక్కిస్తున్న ‘ఆదిపురుష్’లో నటించనున్నాడు. ఈ రెండు ప్రాజెక్టులపై కూడా అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. ‘మహానటి’ మూవీతో నాగ్ అశ్విన్ జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చుకున్నాడు. దీంతో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చే మూవీపై ప్రభాస్ ఫ్యాన్స్ అత్రుతగా ఎదురుచూస్తున్నారు.

వైజయంతీ మూవీస్ 50ఏళ్లు పూర్తి చేసుకోనున్న నేపథ్యంలో నిర్మాత అశ్వినీదత్ భారీ బడ్జెట్లో మూవీని నిర్మిస్తున్నాడు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కే సైంటిఫిక్ మూవీలో ప్రభాస్ హీరోగా నటిస్తుండగా దీపిక పదుకోన్ హీరోయిన్ గా నటించనుంది. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను నాగ్ అశ్విన్ అధికారికంగా ప్రకటించాడు.

Also Read: ట్రైలర్ టాక్: ‘ఆకాశం నీ హద్దురా’.. విమాన ప్రయాణం చేరువైందిలా?

ప్రభాస్ కు ధీటుగా దీపిక పదుకోన్ పాత్ర ఉండనుందనే టాక్ విన్పిస్తోంది. ప్రభాస్ కు నేషనల్ వైడ్ క్రేజ్ ఉన్నట్లే దీపికకు కూడా అంతే పాపులారిటీ ఉంది. దీంతో ఈ సినిమాలో ఆమె పాత్ర సైతం ప్రభాస్ ధీటుగా ఉంటుందని తెలుస్తోంది. ఈ సినిమాకు లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు క్రియేటివ్ హెడ్ గా పని చేయనున్నాడు. దీంతో ఈ మూవీపై ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు.