spot_img
Homeక్రీడలుక్రికెట్‌IPL Schedule: మారిన ఐపీఎల్‌ షెడ్యూల్‌.. చాంపియన్స్ ట్రోఫీ కోసం కొనసాగుతున్న టీమిండియా ఎంపిక కసరత్తు!

IPL Schedule: మారిన ఐపీఎల్‌ షెడ్యూల్‌.. చాంపియన్స్ ట్రోఫీ కోసం కొనసాగుతున్న టీమిండియా ఎంపిక కసరత్తు!

IPL Schedule: ఈ ఏడాది జరిగి ఛాంపియన్స్‌ ట్రోఫీ క్రికెట్‌ టోర్నీకి పాకిస్తాన్‌ ఆతిథ్యం ఇస్తుంది. భారత్‌ మ్యాచ్‌లు మాత్రం దుబాయ్‌ వేదికగా జరుగనున్నాయి. ఈమేరకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీంతో ఇండియన్‌ ప్రీమియర్‌లీగ్‌ (ఐపీఎల్‌) ట్రోఫీ షెడ్యూల్‌ను బీసీసీఐ ప్రకటించింది. తాజాగా షెడ్యూల్‌లో స్వల్పంగా మార్పులు చేసింది. ఈనెల 22 నుంచి ఇంగ్లండ్‌ జట్టు భారత్‌లో పర్యటించనుంది. ఆ సిరీస్‌ తర్వాత ఛాంపియన్స్‌ ట్రోఫీ జరుగనుంది. ఛాంపియన్స్‌ ట్రోఫీ ఆడే భారత జట్టు ఎంపిక కోసం కసరత్తు కొనసాగుతోంది. కాస్త సమయం కావాలని బీసీసీఐ ఐసీసీనికోరింది. ఈ నేపథ్యంలో ఛాంపియన్స్‌ ట్రోఫీ షెడ్యూల్‌పై క్లారిటీ వచ్చింది. మార్చి 23 నుంచి ఐపీఎల్‌ ప్రారంభం అవుతుంది. 65 రోజులపాటు సాగనున్న ఈ టోర్నీలో మే 25న ఫైనల్‌ మ్యాచ్‌ జరుగుతుంది. మొదట మార్చి 14న ప్రారంభించేలా షెడ్యూల్‌ ఖరారుచేశారు. బిహార్‌ ఎన్నికలు, భద్రతా కారణాల దృష్ట్యా షెడ్యూల్‌ మార్పు చేశారు.

నెలాఖరుకు వేదికల ఖరారు..
ఇదిలా ఉంటే.. జనవరి చివరి వారంలో వేదికలు, మ్యాచ్‌ల వివరాల షెడ్యూల్‌ ప్రకటించే అవకాశం ఉంది. ఆదివారం(జనవరి 12న) జరిగిన బీసీసీఐ సమావేశంలో ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు ఐపీఎల్‌ వేలంలో అన్ని జట్ల కూర్పు పూర్తయింది. లక్నో సూపర్‌ జెయింట్స్‌ రికార్డు ధరతో రిషబ్‌ పంత్‌ను సొంతం చేసుకుంది. పంత్‌ కోసం రూ.27 కోట్లు ఖర్చు చేసింది. ఆ తర్వాత శ్రేయస్‌ అయ్యర్‌ ను పంజాబ్‌ కింగ్స్‌ రూ.26.75 కోట్లతో కొనుగులు చేసింది.

భారత జట్టు ఎంపికకు కసరత్తు…
ఇదిలా ఉంటే ఛాంపియన్స్‌ ట్రోఫీ కోసం టీమిండియా టీం ఎంపికకు కసరత్తు జరుగుతోంది. తుది జట్టు ఎంపిక కోసం ఈనెల 18, 19 తేదీల్లో కీలక సమావేశం జరుగనుంది. ఈనెల 12వ వరకు గుడువు ఉండగా, బీసీసీఐ గడువు కావాలని ఐసీసీని కోరింది. దీంతో వారం రోజులు గడువు పెంచింది. అయితే భారత జట్టు ఎంపికలో తీవ్ర జాప్యం జరుగుతోంది. బూమ్రా కోసమే జట్టు ఎంపికను ఆలస్యం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆస్ట్రేలియాలో బూమ్రా గాయపడ్డాడు. బెంగళూరులో చికిత్స పొందుతున్నాడు. బూమ్రా ఫిట్‌నెస్‌పై క్లారిటీ వచ్చిన తర్వాత జట్టును ఎంపిక చేస్తారని తెలుస్తోంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

YSRCP

YSRCP: మారిన గిరిజనుల మనసు.. వైసీపీకి డేంజర్ బెల్!

YSRCP: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఒక భయం కనిపిస్తోంది. గిరిజన ప్రాంతాల్లో పార్టీ పుంజుకోకపోవడం పై ఆందోళన నెలకొంది. దశాబ్దాలుగా గిరిజనులు కాంగ్రెస్ సంప్రదాయ ఓటు బ్యాంకుగా ఉన్నారు. ఏపీలో కాంగ్రెస్ పతనమై.....
Perni Nani

Perni Nani: పేర్ని వారి నకిలీ పట్టాలు.. ఈ కథ మామూలుగా లేదు

Perni Nani: ఇటీవల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఒక వింత వైఖరి వెలుగు చూస్తోంది. చాలామంది నేతలకు పోలీస్ కేసులు చుట్టుముడుతున్నాయి. అయితే అవన్నీ తమ వారసుల ద్వారా.. వారసుల కోసం చేసే...
YS JaganMohan Reddy

Jagan Mohan Reddy: జగన్ వైఖరిపై ఆ ఫ్యామిలీ తీవ్ర అసంతృప్తి!

Jagan Mohan Reddy: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చాలామంది సీనియర్లు ఉన్నారు. వారంతా వైయస్ రాజశేఖర్ రెడ్డి కి సమకాలీకులు. కాంగ్రెస్ పార్టీ పతనం కావడంతో మరో ప్రత్యామ్నాయం లేక జగన్మోహన్ రెడ్డి...
YS Jagan Mohan Reddy

YS Jagan Mohan Reddy: టిక్కెట్ లేదు.. పార్టీ కోసం పని చెయ్.. ఆ సీనియర్ కు తేల్చి...

YS Jagan Mohan Reddy: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉంది. ఆ పార్టీ పుంజుకునే ప్రయత్నం చేస్తోంది. కానీ ఆశించిన స్థాయిలో ఫలితం ఇవ్వలేదు. కూటమి అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన...
Bhumana Karunakar Reddy

Bhumana Karunakar Reddy : సీదిరి అప్పలరాజు, తమ్మినేని సీతారాం… నెక్స్ట్ భూమన?!

Bhumana Karunakar Reddy : వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ల చుట్టూ ఇప్పుడు వివాదాలు, కేసులు, అరెస్టులు నడుస్తున్నాయి. వారి వ్యక్తిగత వ్యవహార శైలి, భూ కబ్జా ఆరోపణలు, నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్...
Oktelugu Epaper