Sudheer And Rashmi: సుడిగాలి సుధీర్ – రష్మీ గౌతమ్ జంట గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. జబర్దస్త్ లో ఓ వెలుగు వెలిగిన ఈ జంటకు బుల్లితెరపై స్టార్ హీరో, హీరోయిన్లకుండే రేంజ్ లో పాపులారిటీ ఉంది. ఈ జంట కొన్నేళ్లుగా బుల్లితెరపై పలు కార్యక్రమాలు చేసి ప్రేక్షకులకు చాలా దగ్గర అయ్యారు. వీరి మధ్య వచ్చే లవ్ సీన్లుగానీ, ఇతరత్రా సన్నివేశాలుకానీ, ప్రోగ్రాంలో భాగంగా జరిగిన పెళ్లికానీ.. ఇలా వీరిని స్టార్ కపుల్స్ ను చేసేశాయి. తెలుగు రాష్ట్రాల్లో వీరికీ కొన్ని లక్షలమంది ఫ్యాన్స్ ఉన్నారు. వీరిద్దరూ ఎప్పటికైనా పెళ్లిచేసుకోవాలని కోరుకునే వాళ్లు కూడా కొన్ని వేల మంది ఉన్నారు. ఎన్నాళ్లుగా చూస్తున్న వారి కోరిక మాత్రం తీరడంలేదు. రెండేళ్ల నుంచి వీరిద్దరి మధ్య కొంత గ్యాప్ వచ్చింది. అందుకు కారణం.. సుధీర్ హీరోగా వరుస పెట్టి సినిమాలు తీస్తుండడం.
కొన్ని సినిమాలు తీయగా అవి రిలీజ్ అయ్యాయి. కానీ అతడి కెరీర్ కు ఉపయోగపడే విధంగా సక్సెస్ అందుకోలేదు. ఈ క్రమంలో మరికొన్ని సినిమాలు షూటింగ్ దశలోనే ఆగిపోయాయి. దీంతో బెల్లితెరపైకి సుధీర్ రీఎంట్రీ ఇచ్చేశాడు. ఈటీవీ, మాటీవీలో ప్రోగ్రామ్స్ చేస్తున్నాడు. సంక్రాంతి పండగ సందర్భంగా ఈనెల 14వ తేదీన ఈటీవీలో సంక్రాంతికి వస్తున్నాం పేరుతో ఓ స్పెషల్ ప్రోగ్రాం రాబోతోంది. దీనికి సంబంధించిన ప్రోమోను మేకర్స్ తాజాగా విడుదల చేశారు. ఇందులో సుడిగాలి సుధీర్ – రష్మి జంట మరోసారి తళుక్కుమంది. ఇద్దరూ రొమాంటికి సన్నివేశాలతో ఆకట్టుకోబోతున్నారని ప్రోమోను చూస్తే అర్థమవుతోంది. అంతేకాదు.. ఈ కార్యక్రమంలో స్పెషల్ గా హైపర్ ఆది పుష్ప2 స్పూఫ్ చేశాడు. అంతేకాదు.. విక్టరీ వెంకటేష్ హీరోగా నటిస్తున్న సంక్రాంతికి వస్తున్నాం సినిమా కూడా 14న విడుదల కాబోతోంది.
దర్శకుడు అనిల్ రావిపూడి కాగా మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. వాళ్లు ఈ ప్రోగ్రాంకు హాజరు కాబోతున్నారు. పూర్ణ స్పెషల్ గెస్ట్ గా రాబోతున్నారు. ఇదే ప్రోగ్రాంలో తండేల్ సినిమాలోని బుజ్జితల్లి పాటకు సుధీర్, రష్మి డ్యాన్స్ చేశారు. వింటేజ్ లో వీరిద్దరూ చాలా అద్భుతంగా ఫర్ఫామ్ చేశారు. ఇద్దరూ పోటీపడుతూ రొమాంటిక్ సీన్లలో రెచ్చిపోయారు. అభిమానులు కూడా ఇదేకదా వారిద్దరి నుంచి మాకు కావల్సింది అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఏదేమైనపపటికీ మరోసారి ఈ జంట మెరవబోతుంది. అదేరోజు ఏమైనా విషయం చెబుతారేమోనని కొందరు నెటిజన్ల సోషల్ మీడియాలో చర్చ పెట్టారు.
Web Title: Sudigali sudheer and rashmi gautam who is going to give good news soon
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com