Champions Trophy : పాకిస్తాన్ లో జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడబోనని భారత్ ముందే చెప్పింది. దానికి ప్రత్యామ్నాయంగా హైబ్రిడ్ మోడ్ లో దుబాయిలో మ్యాచ్ లు నిర్వహించాలని సూచించింది. దానికి ఐసీసీ కూడా ఓకే అన్నది. భారత్ ఆడే మ్యాచ్ లు మాత్రమే దుబాయ్ లో ఐసీసీ నిర్వహించింది. బంగ్లాదేశ్ తో టీమ్ ఇండియా తొలి మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆ తర్వాత పాకిస్తాన్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆ తర్వాత న్యూజిలాండ్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో 44 పరుగుల తేడాతో గెలుపును సొంతం చేసుకుంది. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో నాలుగు వికెట్ల తేడాతో విక్టరీని అందుకుంది. మొత్తంగా దుబాయ్ మైదానాన్ని తనకు అత్యంత అచ్చి వచ్చిన గ్రౌండ్ గా టీమ్ ఇండియా మార్చుకుంది. ముఖ్యంగా ఆస్ట్రేలియా జట్టుతో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ కు ముందు టీ మీడియా కెప్టెన్ రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు చేశాడు. ” దుబాయ్ మాకు సొంతమైదానం కాదు. ఇక్కడ పిచ్ ఎలా ఉంటుందో మాకు తెలియదు. కాకపోతే మాకు ఉన్న ముందు చూపుతో నలుగురు స్పిన్నర్లతో బరిలోకి దిగుతున్నామని” రోహిత్ వ్యాఖ్యానించాడు. దీనిని బట్టి దుబాయ్ మైదానాలు ఎలా ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. అన్నట్టు దుబాయిలో నాలుగు స్టేడియాలు ఉన్నాయి. అయితే చాలామంది మాజీ సీనియర్ ఆటగాళ్లు దుబాయిలో ఒకటే గ్రౌండ్ ఉందని భావిస్తున్నారు. అది వారి అవివేకానికి నిదర్శనం. మరోవైపు దుబాయ్‌లో ఎప్పటికప్పుడు పిచ్ మారుస్తుంటారు. టీమిండియా ఆడే మ్యాచ్‌లలో ఎలాంటి మైదానాన్ని రూపొందిస్తున్నారో నిర్వాహకులు ఇంతవరకు బయటకు చెప్పలేదు. కానీ ఈ విషయాన్ని పక్కనపెట్టి ఇతర దేశాల మాజీ ఆటగాళ్లు భారత్ సాధిస్తున్న వరుస విజయాలను విమర్శించడం విశేషం.
Also Read : ఫైనలూ పాయే.. పాకిస్తాన్ కు ఏదీ కలిసిరావడం లేదే.. సోషల్ మీడియాలో పేలుతున్న మీమ్స్
మరి ఆ జట్లు ఎలా గెలిచాయి?
దుబాయిలో భారత్ వరుసగా విజయాలు సాధించిన నేపథ్యంలో.. మైదానాన్ని తమకు అనుకూలంగా మలుచుకున్నారని ఇతర దేశాల మాజీ ఆటగాళ్లు విమర్శిస్తున్న తరుణంలో.. కొన్ని కీలక విషయాలను ఇక్కడ గుర్తు చేయాల్సి ఉంటుంది. పాకిస్తాన్ వేదికగా జరిగిన మ్యాచ్‌లలో న్యూజిలాండ్ విజయం సాధించింది. అంతకుముందు జరిగిన ట్రై సిరీస్ లోను వరుస విజయాలు సొంతం చేసుకుంది. పాకిస్తాన్ క్రికెట్ జట్టు సొంత దేశంలో ఆడుతున్నప్పటికీ.. సొంత మైదానాలపై ఎందుకు గెలవలేదు? న్యూజిలాండ్ జట్టు వరుసగా అన్ని విజయాలు ఎలా సాధించింది? అక్కడిదాకా ఎందుకు ఇంగ్లాండ్ జట్టుపై ఆస్ట్రేలియా రికార్డు చేజింగ్ చేసింది. అంతకంటే ముందు ఇంగ్లాండ్ బీభత్సంగా బ్యాటింగ్ చేసింది. మరి సొంత మైదానాలే అయినప్పటికీ పాకిస్తాన్ కరాచీ, లాహోర్‌లో భారీగా పరుగులు ఎందుకు చేయలేకపోయింది? ఇక్కడ జట్లకు అనుకూలంగా మైదానాల రూపొందించరు. అలానే రూపొందిస్తారు అనుకుంటే 2023లో అహ్మదాబాద్ వేదికగా వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ఆస్ట్రేలియా భారత్ మధ్య జరిగింది. మరి అప్పుడు ఆ మైదానం భారత బ్యాటర్లకు ఏమాత్రం అనుకూలించలేదు. ఒకవేళ ఆతిథ్య జట్టుకు అనుకూలంగా మైదానాలు రూపొందిస్తారు అనుకుంటే.. భారత్ భారీగా పరుగులు చేసేది కదా.. ఆస్ట్రేలియాను ఓడించేది కదా.. ఇక్కడ ఆడలేక మద్దెల ఓడు అనే సామెతను గుర్తు చేస్తూ ప్రత్యర్థి జట్ల మాజీ ఆటగాళ్లు విమర్శలు చేయడం.. వారి లేకితనానికి నిదర్శనంగా నిలుస్తోంది. భారత్ దుబాయ్ వేదికగా ఆడిన నాలుగు మ్యాచ్‌లలోనూ బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాలలో అద్భుతమైన ప్రతిభను చూపింది. అందువల్లే వరుసగా విజయాలు సాధించింది. ఇక పాకిస్తాన్ జట్టుకు దుబాయ్ అనేది సెకండ్ ఓన్ గ్రౌండ్ లాంటిది. అలాంటి గ్రౌండ్లో పాకిస్తాన్ తేలిపోయింది. దుబాయ్ లాంటి మైదానాలలో తక్కువలో తక్కువ ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగుతారు. కానీ భారత జట్టుతో ఎదురైన మ్యాచ్‌లో పాకిస్తాన్ అబ్రార్ అహ్మద్ తోనే రంగంలోకి దిగింది. భారత్ మాత్రం నలుగురు స్పిన్నర్లను బరిలోకి దింపింది. దీనిని బట్టి మ్యాచ్ కు భారత్ ఎలా సన్నద్ధం అవుతుందో అర్థం చేసుకోవచ్చు. టీమ్ ఇండియా వరుస విజయాలు సాధించడం.. ఏకంగా చాంపియన్స్ ట్రోఫీని దక్కించుకోవడానికి అడుగులు వేయడాన్ని ప్రత్యర్థి జట్ల మాజీ ఆటగాళ్లు జీర్ణించుకోలేకపోతున్నారు. అందువల్లే అడ్వాంటేజ్ అంటూ చవకబారు విమర్శలు చేస్తున్నారు.
Also Read : దుబాయ్ స్టేడియంలో లవ్లీ మూమెంట్స్.. విరాట్–అనుష్కల యాక్షన్.. రియాక్షన్! వైరల్ వీడియో