Champions Trophy 2025 Final: టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన నేపథ్యంలో సోషల్ మీడియాలో ప్రశంసల జల్లు కురుస్తోంది. మీమ్స్, వీడియోలతో అభిమానులు హోరెత్తిస్తున్నారు. టీమిండియా ఆటగాళ్ళను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. 2017లో ఓడిపోయారని.. ఇప్పుడు గెలిచి తమలో ఉన్న సత్తాను చాటారని వ్యాఖ్యానిస్తున్నారు.. రోహిత్ అద్భుతమైన ప్రతిభతో జట్టును ముందుండి నడిపించాడని వ్యాఖ్యానిస్తున్నారు.
ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్లో న్యూజిలాండ్ పై భారత్ గెలిచిన నేపథ్యంలో సోషల్ మీడియా షేక్ అవుతోంది. ప్రజాదరణ పొందిన సినిమాల్లోని దృశ్యాలను టీమిండియా ఆటగాళ్లకు ఆపాదిస్తూ నెటిజన్లు వీడియోలను రూపొందిస్తున్నారు. ఇప్పటికే షామా మహమ్మద్ పై నెటిజన్లు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. రోహిత్ ను ఫ్యాట్ గా ఉన్నాడని ఇటీవల ఆమె వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది. ఫైనల్ మ్యాచ్లో న్యూజిలాండ్ చేతిలో టీమిండియా గెలవడం.. టీమిండియా గెలుపులో రోహిత్ శర్మ కీలక పాత్ర పోషించడంతో నెటిజన్లు రెచ్చిపోయారు. రోహిత్ శర్మ సూపర్ హీరోను చేశారు. రోహిత్ అంటే ఫ్యాట్ కాదు సూపర్ హిట్ అంటూ వీడియోలు రూపొందించారు. పుష్ప సినిమాలో ఫ్లవర్ కాదు ఫైర్.. స్థానంలో ” ఫ్యాట్ కాదు.. సూపర్ హిట్” అనే వీడియోను అనే పదాలను యాడ్ చేశారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ సంచలనం సృష్టిస్తున్నది. ఇప్పుడు కల్కి సినిమాలో శ్రీకృష్ణుడు, అర్జునుడి పాత్రధారి మధ్య జరిగిన సంభాషణలో.. కర్ణుడు తెరపైకి రావడం.. కర్ణుడిని గొప్ప యోధుడిగా చెప్పడం వంటి దృశ్యాలను.. టీమిండియా సాధించిన విజయానికి నెటిజన్లు ఆపాదిస్తున్నారు.
కర్ణుడి పాత్రధారిలో రోహిత్ శర్మ
కల్కి సినిమాలో శ్రీకృష్ణుడికి – అర్జునుడికి కురుక్షేత్రం సమయంలో సంవాదం జరుగుతుంది. ఆ సమయంలో కృష్ణుడు కర్ణుడి గురించి చెబుతాడు. ఆ కర్ణుడు యోధుడని.. మాటకు విలువిచ్చే వ్యక్తి అని.. అతడు దుష్ట సహవాసం వల్ల వేరే వర్గం లోకి చేరిపోయాడని శ్రీకృష్ణుడు చెబుతుంటాడు. దానికి అర్జునుడు వాదిస్తాడు. అయితే కురుక్షేత్రంలో కర్ణుడు చేసిన పోరాటపటిమను శ్రీకృష్ణుడు అంశాలవారీగా వివరించడం కల్కి సినిమాకు హైలైట్ గా నిలిచింది. కల్కి సినిమాలో కర్ణుడి మాదిరిగానే రోహిత్ శర్మ న్యూజిలాండ్ జట్టుతో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్లో ఆడాడని.. అద్భుతమైన పోరాటపటి మను ప్రదర్శించాడని నెటిజన్లు పేర్కొంటున్నారు. కల్కి సినిమాలో బహుళ ప్రజాధరణ పొందిన ఆ వీడియోను ఇప్పుడు టీమ్ ఇండియా సాధించిన ఛాంపియన్స్ ట్రోఫీ విజయానికి నెటిజన్లు ఆపాదిస్తున్నారు. ” న్యూజిలాండ్ జట్టుతో జరిగిన ఫైనల్ మ్యాచ్ కురుక్షేత్ర మహాసంగ్రామాన్ని తలపించింది. అందులో కర్ణుడి లాగానే రోహిత్ పోరాడాడు. న్యూజిలాండ్ జట్టును ఎదిరించాడు. బౌలింగ్ కు సహకరించిన మైదానంపై పరుగుల వర్షం కురిపించాడు. అందుకే అతడు టీమ్ ఇండియాకు ఎప్పటికీ హిట్ మ్యాన్ . పోటాపోటీగా సాగిన మ్యాచ్లో నిలబడ్డాడు. తన స్థాయికి తగ్గట్టుగా ఇన్నింగ్స్ ఆడాడు. అందువల్లే టీమిండియా గెలిచిందని” అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు.
Rohit vs Kohli debate ends here #RohitSharma #INDvsNZ pic.twitter.com/4UvOqecJQe
— lakshman (@rebel_notout) March 9, 2025