Homeక్రీడలుక్రికెట్‌Champions Trophy 2025: టీమిండియా గెలుపు.. ఆఫ్ఘనిస్తాన్ లో సంబరాలు అంబరాన్నంటాయి.. వైరల్ వీడియో

Champions Trophy 2025: టీమిండియా గెలుపు.. ఆఫ్ఘనిస్తాన్ లో సంబరాలు అంబరాన్నంటాయి.. వైరల్ వీడియో

Champions Trophy 2025: 2017 తర్వాత ఐసీసీ మరోసారి ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహించలేదు. దాదాపు 8 సంవత్సరాల తర్వాత పాకిస్తాన్ వేదిక గా ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహించింది. ఈ ట్రోఫీలో ఎనిమిది జట్లు పాల్గొన్నాయి. 8 జట్లలో టీమిండియా ఫైనల్ వరకు, ఫైనల్ లోనూ వరుస విజయాలు సాధించింది. 2013 తర్వాత మరోసారి ఛాంపియన్స్ ట్రోఫీ దక్కించుకుంది. ఛాంపియన్స్ ట్రోఫీ దక్కిన నేపథ్యంలో టీమిండియా ఆటగాళ్లకు, అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఫైనల్ లో న్యూజిలాండ్ చేతిలో గెలిచిన తర్వాత భారత ఆటగాళ్లు ఆనందంతో ఎగిరి గంతులు వేశారు.

ఆఫ్గనిస్తాన్ లో..

భారతదేశానికి ఆఫ్ఘనిస్తాన్ మొదటి నుంచి నమ్మకమైన దేశంగా ఉంది. కాందహార్ ఘటన మినహా.. మిగతా అన్ని సందర్భాల్లో భారత్ -ఆఫ్ఘనిస్తాన్ కు పెద్దగా విభేదాలు చోటు చేసుకోలేదు. క్రికెట్ కు అంతగా ప్రోత్సాహం లభించని నేపథ్యంలో ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ జట్టు తన హోమ్ గ్రౌండ్ గా భారత్ ను ఎంచుకుంది.. అందువల్లే ఛాంపియన్ ట్రోఫీలో ఆఫ్ఘనిస్తాన్ భారత జట్టుకు మద్దతు పలికింది. ఫైనల్ మ్యాచ్లో భారత్ గెలవాలని కోరుకుంది. పాకిస్తాన్ నుంచి మొదలు పెడితే ఆస్ట్రేలియా వరకు న్యూజిలాండ్ కు మద్దతు పలికాయి. ఫైనల్ మ్యాచ్లో టీమిండియా విజయం సాధించిన నేపథ్యంలో ఆఫ్గనిస్తాన్ లో సంబరాలు అంబరాన్నంటాయి. ఆఫ్ఘనిస్తాన్ లో అక్కడి తాలిబన్లు టీమిండియా విజయం సాధించిన తర్వాత ఉత్సాహంగా డాన్సులు చేయడం విశేషం.

Also Read: ఆతిథ్య దేశం నుంచి ఒక్కరూ లేరు.. ఇలా ఎందుకు జరిగింది.. ఐసీసీ టోర్పీ అవార్డు ఫంక్షన్‌పై అక్తర్ అసంతృప్తి!

అందువల్ల టీమ్ ఇండియాకు మద్దతు

కరోనా సమయంలో భారత్ ఆఫ్ఘనిస్తాన్ దేశానికి మద్దతుగా నిలిచింది. వ్యాక్సిన్లు పంపించింది. పాకిస్తాన్తో ఆఫ్ఘనిస్తాన్ ఇబ్బంది పడుతున్నప్పుడు.. భారత్ ఆఫ్ఘనిస్తాన్ వైపు నిలిచింది. తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్ ను ఆక్రమించుకున్నప్పుడు.. సమర్థవంతమైన పరిపాలన అందించాలని భారత్ కోరుకుంది. ఆఫ్ఘనిస్తాన్ అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలని ఆకాంక్షించింది. అందువల్లే ఆఫ్గనిస్తాన్ క్రికెట్ జట్టు తమ హోమ్ గ్రౌండ్ గా భారత్ ను ఎంచుకుంది. ఇక ఇటీవల న్యూజిలాండ్ జట్టు- ఆఫ్ఘనిస్తాన్ జట్టు తొలి టెస్ట్ మ్యాచ్ ఆడేందుకు భారత్ వచ్చాయి. అయితే వర్షం వల్ల మ్యాచ్ నిర్వహణ సాధ్యం కాలేదు. గ్రేటర్ నోయిడా స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో ఈ మ్యాచ్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయగా.. వర్షం వల్ల మైదానంలో వరదనీరు భారీగా పేరుకుపోయింది. వరద నీరును బయటికి పంపించడం సాధ్యం కాకపోవడంతో మ్యాచ్ నిర్వహణ సాధ్యం కాలేదు. అయినప్పటికీ ఆఫ్ఘనిస్తాన్ భారత్ పై ఏ మాత్రం ఆగ్రహం వ్యక్తం చేయలేదు. పైగా తమ హోమ్ గ్రౌండ్ గా నిర్ణయించుకున్నప్పటికీ.. ఏమాత్రం నో చెప్పకుండా సహకరించిన భారత్ కు ఆఫ్గనిస్తాన్ కృతజ్ఞతలు తెలియజేసింది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version