Shoaib Akhtar: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్(ICC Champions Trophy ఆదివారం(మార్చి 9)న దుబాయ్ వేదికగా జరిగింది. భారత్ ఫైనల్‌కు చేరడంతో ముందుగా నిర్ణయించిన ప్రకారం.. హైబ్రిడ్ విధానంలో భాగంగా టోర్నీ ఆతిథ్య దేశం పాకిస్తాన్‌లో కాకుండా దుబాయ్‌లో ఫైనల్ నిర్వహించారు. ఇందులో టీమిండియా ఘన విజయం సాధించి ఛాంపియన్‌గా నిలిచంది.
Also Read: విజయ్ దేవరకొండ చేస్తున్న ‘రౌడీ జనార్ధన్’ మూవీ స్టోరీ ఇదేనా..?
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి ఈసారి పాకిస్తాన్(Pakisthan) ఆతిథ్యం ఇచ్చింది. అయితే భారత జట్టు పాకిస్తాన్ వెళ్లడానికి ఆసక్తి చూపలేదు. దీంతో ఐసీసీ భారత మ్యాచ్‌లను దుబాయ్‌లో నిర్వహించాలని నిర్ణయించింది. ఈమేరకు లీగ్ మ్యాచ్‌లు జరిగాయి. తర్వాత భారత్ సేమీస్‌కు వెళ్లడంతో ఆ మ్యాచ్ కూడా దుబాయ్‌లో జరిగింది. ఫైనల్‌కు టీమిండియా చేరడంతో ఫైనల్ కూడా పాకిస్తాన్‌లో జరగలేదు. దీంతో ఆతిథ్య జట్టుకు తీవ్ర నష్టం జరిగింది. అయితే ఫైనల్‌లో టీమిండియా(Team India) ఘన విజయం సాధించి ఛాంపియన్‌గా నిలిచింది. ఈ మ్యాచ్ అనంతరం నిర్వహించిన అవార్డు ప్రధానోత్సవానికి పాకిస్తాన్ నుంచి ఒక్కరు కూడా హాజరు. కాలేదు. దీనిపై పాకిస్తాన్ క్రికెటర్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఆతిథ్య దేశం నుంచి అవార్డు ఫంక్షన్‌కు ఎవరూ వెళ్లలేదా.. లేక ఐసీసీ ఆహ్వానించలేదా అనేది తెలియాల్సి ఉంది.
షోయబ్ అక్తర్ కీలక వ్యాఖ్యలు..
షోయబ్ అక్తర్(Shoyab Aksthar), పాకిస్థాన్ మాజీ క్రికెటర్, ‘రావల్పిండి ఎక్స్‌ప్రెస్‘గా పిలవబడే వేగవంతమైన బౌలర్, ఇటీవల ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ (PCB) డిమాండ్‌లకు మద్దతు తెలిపారు. PCB హైబ్రిడ్ మోడల్ వల్ల ఎక్కువ ఆదాయ వాటా కోరుతోంది, దీనిని అక్తర్ సమర్థనీయమైనదిగా భావించారు. ఒక పాకిస్థానీ ఛానెల్‌లో మాట్లాడుతూ, ‘మీరు హోస్టింగ్ హక్కులు మరియు ఆదాయం కోసం చెల్లింపు పొందుతున్నారు, అది సరైనదే. పాకిస్థాన్ యొక్క డిమాండ్ కూడా సహేతుకమైనది. వారు తమ స్థానంలో దృఢంగా ఉండాలి. మనం ఛాంపియన్స్ ట్రోఫీని హోస్ట్ చేయగలిగితే, మరియు వారు (భారత్) రాకపోతే, వారు మనకు ఎక్కువ వాటా ఇవ్వాలి‘ అని అన్నారు.
తాజాగా భారత్ న్యూజిలాండ్‌ను ఓడించి టైటిల్ గెలిచిన తర్వాత, అక్తర్ మరోసారి వ్యాఖ్యానించారు. దుబాయ్‌లో జరిగిన ఈ ఫైనల్‌లో పాకిస్థాన్ ప్రాతినిధ్యం లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘పాకిస్థాన్ ఈ టోర్నమెంట్‌ను హోస్ట్ చేసినప్పటికీ, ట్రోఫీ ప్రదానోత్సవంలో ఒక్క పాకిస్థాన్ ప్రతినిధి కూడా లేకపోవడం నాకు అర్థం కావడం లేదు. ఇది చాలా బాధాకరం‘ అని ఎక్స్‌లో పోస్ట్ చేసిన వీడియోలో పేర్కొన్నారు. అదనంగా, ఫైనల్ ముందు న్యూజిలాండ్‌కు సలహా ఇస్తూ, ‘భారత్‌ను ఓడించాలంటే, భారత్ బలమైన జట్టని మర్చిపోవాలి. మీరు తక్కువ జట్టని కూడా భావించకూడదు. అప్పుడే గట్టి పోటీ ఇవ్వగలరు‘ అని అన్నారు. ఈ వ్యాఖ్యలు ఆయన రాజకీయాలకు అతీతంగా క్రికెట్‌పై ఉన్న అభిమానాన్ని, పాకిస్థాన్ జట్టు సామర్థ్యంపై నమ్మకాన్ని ప్రతిబింబిస్తాయి.
This is literally beyond my understanding.
How can this be done???#championstrophy2025 pic.twitter.com/CPIUgevFj9— Shoaib Akhtar (@shoaib100mph) March 9, 2025