India Vs New Zealand Semi Final: సెమీ ఫైనల్ మ్యాచ్ లో రికార్డ్ క్రియేట్ చేసిన రోహిత్ శర్మ…

వెస్టిండీస్ టీమ్ దిగ్గజ ప్లేయర్ అయిన క్రిస్ గేల్ పేరు మీద ఉండేది. ఆయన వరల్డ్ కప్ మొత్తం లో 49 సిక్స్ లను కొట్టారు.ఇక ఇప్పుడు రోహిత్ శర్మ 50 సిక్స్ లు కొట్టి క్రిస్ గేల్ పేరు మీద ఉన్న రికార్డ్ ని బ్రేక్ చేసి కొత్తగా తన పేరు మీద ఒక రికార్డుని క్రియేట్ చేసుకున్నాడు.

Written By: Gopi, Updated On : November 15, 2023 5:27 pm

India Vs New Zealand Semi Final

Follow us on

India Vs New Zealand Semi Final: వరల్డ్ కప్ భాగం గా ఇవాళ్ల ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న కీలకమైన మొదటి సెమీ ఫైనల్ మ్యాచ్ లో ఇండియన్ టీమ్ టాస్ గెలిచి మొదటి బ్యాటింగ్ ఎంచుకుంది… ఇక ఇండియన్ టీమ్ ఓపెనర్లు టీమ్ కి ఒక అద్భుతమైన ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని అందించారు.ఇక 29 బంతుల్లో నాలుగు ఫోర్లు, నాలుగు సిక్స్ లు కొట్టి 48 పరుగులు చేశాడు… ఇక దీంతో వన్డే వరల్డ్ కప్ లో అత్యధిక సిక్స్ లు కొట్టిన ప్లేయర్ గా రోహిత్ శర్మ ఒక అద్భుతమైన రికార్డు క్రియేట్ చేశాడు 27 ఇన్నింగల్లోనే 50 సిక్స్ లు కొట్టి ఎవరు క్రియేట్ చేయలేని ఒక రికార్డును ఈ వరల్డ్ కప్పులో నెలకొల్పాడు.

ఇక ఇంతకుముందు ఈ రికార్డు వెస్టిండీస్ టీమ్ దిగ్గజ ప్లేయర్ అయిన క్రిస్ గేల్ పేరు మీద ఉండేది. ఆయన వరల్డ్ కప్ మొత్తం లో 49 సిక్స్ లను కొట్టారు.ఇక ఇప్పుడు రోహిత్ శర్మ 50 సిక్స్ లు కొట్టి క్రిస్ గేల్ పేరు మీద ఉన్న రికార్డ్ ని బ్రేక్ చేసి కొత్తగా తన పేరు మీద ఒక రికార్డుని క్రియేట్ చేసుకున్నాడు. ఇక 49 సిక్స్ లు కొట్టడానికి క్రిస్ గేల్ 32 ఇన్నింగ్స్ లు ఆడితే, రోహిత్ శర్మ మాత్రం కేవలం 27 ఇన్నింగ్స్ లోనే 50 సిక్స్ లు కొట్టి అత్యుత్తమమైన రికార్డుని క్రియేట్ చేశాడు. ఇక ఈ మ్యాచ్ లో రోహిత్ అవుట్ అయిన తర్వాత క్రీజ్ లోకి వచ్చిన విరాట్ కోహ్లీ గిల్ ఇద్దరు కలిసి మ్యాచ్ పొజిషన్ బట్టి అద్భుతమైన పర్ఫామెన్స్ తో ముందుకు కదులుతున్నారు.ఇక ఇలాంటి క్రమంలోనే వీళ్ళిద్దరూ ఒక మంచి నాక్ ఆడుతారు అనుకుంటే అనుకోకుండా గిల్ రిటైర్డ్ హార్ట్ అయ్యాడు.

ఇక ఇప్పుడు టీమ్ భారం మొత్తాన్ని కోహ్లీ నే మోయాల్సి వస్తుంది…ఇక ఈ మ్యాచ్ లో ఇండియన్ టీమ్ భారీ పరుగులు చేసి న్యూజిలాండ్ టీమ్ బ్యాట్స్ మెన్స్ ని కట్టడి చేసినట్లయితే ఈ మ్యాచ్ లో ఇండియా నే ఘన విజయం సాధిస్తుంది అని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఇండియన్ బౌలర్లు ప్రస్తుతం మంచి ఫామ్ లో ఉన్నారు. దానికి తగ్గట్టే ప్రత్యర్థి బ్యాట్స్ మెన్స్ ని అధిక పరుగులు చేయకుండా మన బౌలర్లు అద్బుతం గా బాల్స్ వేస్తూ ప్రత్యర్థి టీమ్ అయిన న్యూజిలాండ్ టీమ్ ని కట్టడి చేస్తే మన ఈ మ్యాచ్ లో ఈజీగా గెలుస్తుంది…