Hardik Pandya: ప్రస్తుతం ఐపీఎల్ లో ప్రతి టీము తమ తమ ఆధిపత్యాన్ని చూపించుకోవడానికి మ్యాచ్ లను ఆడుతున్నాయి. ఇక అందులో భాగంగానే ముంబై టీమ్ కూడా ఈ సీజన్ లో కొత్త కెప్టెన్ అయిన హార్దిక్ పాండ్యా తో బరిలోకి దిగినప్పటికీ ఆశించిన మేరకు విజయాలు మాత్రం అందుకోలేక పోతున్నారు. ఇక ఇప్పటివరకు ఆరు మ్యాచ్ లు ఆడితే అందులో కేవలం రెండు మ్యాచ్ ల్లో మాత్రమే గెలిచి నాలుగు మ్యాచ్ ల్లో దారుణంగా ఓడిపోవడం అనేది నిజంగా ఒక రకంగా ఆ టీమ్ కి చేదు అనుభవం అనే చెప్పాలి…
ఒకప్పుడు ముంబై ఇండియన్స్ టీమ్ అంటే టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగేది. ఇక ముంబై టీమ్ బ్యాట్స్ మెన్స్ లను ఎదురుకోవాలంటే ప్రత్యర్థి బౌలర్లు బెంబేెలెత్తిపోయేవారు. ఇక ముంబై బౌలర్లు వేసే బంతులను ఎదుర్కోవడానికి ప్రత్యర్థి బ్యాట్స్ మెన్స్ భయంతో వణికి పోయేవారు. ఇక అలాంటి ఒక ముంబై ఇండియన్స్ టీమ్ ప్రస్తుతం పాయింట్స్ టేబుల్ లో 9వ పొజిషన్ లో ఉండడం అనేది నిజంగా చాలా దారుణమైన విషయమనే చెప్పాలి. అయితే దీనికంతటికీ కారణం హార్ధిక్ పాండ్యనే అనే విషయం చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే టీమ్ లో ఉన్న ప్లేయర్లు అందరు మంచి ఫామ్ లో ఉన్నారు.
కానీ వాళ్ళందర్నీ వాడుకోవడంలో హార్థిక్ పాండ్యా చాలా వరకు ఫెయిల్ అవుతున్నాడు. ఎలా అంటే రోహిత్ శర్మ , ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, టిం డేవిడ్ లాంటి ప్లేయర్లందరూ అద్భుతమైన ఫామ్ ని కనబరుస్తూ ప్రతి మ్యాచ్ లో వీరిలో ముగ్గురైన అద్భుతమైన పర్ఫామెన్స్ ని ఇస్తున్నారు. అయినప్పటికీ హార్థిక్ పాండ్య ఒక్కడే బ్యాటింగ్ సరిగ్గా చేయడం లేదు. అలాగే బౌలింగ్ లో కూడా సరైన పర్ఫామెన్స్ అయితే ఇవ్వడం లేదు. ఇక్కడ అసలు సమస్య ఏంటి అంటే కెప్టెన్ గా తనని తాను ప్రూవ్ చేసుకోవడం కంటే బ్యాట్స్ మెన్, బౌలర్ గా తనని తాను ప్రూవ్ చేసుకొని నేను ఫిట్ గా ఉన్నాను. టీం నాకు సపోర్ట్ చేయడం లేదు అందుకే మ్యాచ్ లు ఓడిపోతున్నాం అని ప్రూవ్ చేయాలనుకుంటున్నాడు.
కానీ అసలు విషయం ఏంటంటే తను టీం లో ఉన్న ప్లేయర్లందరిని సక్రమంగా అయితే వాడుకోవడం లేదు. నిజానికి డెత్ ఓవర్లలో బుమ్ర లాంటి ఒక వరల్డ్ నెంబర్ వన్ బౌలర్ ని వాడుకోవచ్చు. కానీ అందరికీ షాక్ ఇస్తూ హార్దిక్ పాండ్యా డెత్ ఓవర్లలో తను బౌలింగ్ చేయడం ఏంటి? నిజానికి ఓవర్ లో ఒక యార్కర్ వేయడానికే బౌలర్లు ఇబ్బంది పడుతుంటారు. కానీ ఆరు బంతులకి ఆరు బంతులు డీప్ యార్కర్లు వేసే బుమ్రా టీమ్ లో ఉన్నప్పటికీ అతన్ని సరిగ్గా వాడుకోవడం లేదు. అదే హార్దిక్ పాండ్యా కి గాని, ముంబై ఇండియన్స్ టీమ్ కి గాని మైనస్ గా మారుతుంది. నిజానికి పాండ్య ఇన్ఫిరియార్టీ కాంప్లెక్స్ తో బాధపడుతున్నాడు. అందుకే ఎవరిని సరిగ్గా వాడుకోవడం లేదు.
వాళ్ళని వాడుకుంటే వాళ్ళు తనని బీట్ చేసి ముందుకు వెళ్తారేమో అనే భయం తోనే ఆయన ఇలా చేస్తున్నట్టుగా తెలుస్తుంది…ఇక బ్యాటింగ్, బౌలింగ్ లో టీమ్ లో తనకంటే తోపు ఎవరు లేరు అని తను ప్రూవ్ చేసుకోవాలి అనుకుంటున్నాడు. దానివల్ల ఆయన ఇన్ఫిరియార్టీ కాంప్లెక్స్ లో ఉండి ప్లేయర్లతో సరిగ్గా కోఆర్డినేట్ అవ్వలేకపోతున్నాడు. దానివల్ల టీమ్ లో ఉన్న ప్లేయర్లు సరిగ్గా ఆడలేక టీమ్ చాలా ఇబ్బందులను ఎదుర్కొవాల్సి వస్తుంది. ఇకనైనా ఆయన టీమ్ మెంబర్స్ తో కలిసిమెలిసి ఆడుతూ మంచి డిసిజన్స్ తీసుకుంటే మంచిది లేకపోతే ముంబై టీమ్ పరిస్థితిని ఎవరు మార్చలేరు…