HomeతెలంగాణTelangana BJP: కాంగ్రెస్‌ ప్రచారం.. బీజేపీ అలర్ట్‌.. లైన్లోకి వచ్చిన అమిత్‌షా!

Telangana BJP: కాంగ్రెస్‌ ప్రచారం.. బీజేపీ అలర్ట్‌.. లైన్లోకి వచ్చిన అమిత్‌షా!

Telangana bjp: సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేసింది. ఏప్రిల్‌ 18 నుంచి 25వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. బీజేపీ నుంచి కొందరు ఎంపీ అభ్యర్థులు తొలిరోజే నామినేషన్‌ వేయబోతున్నారు. తర్వాత ప్రచారం జోరు పెరగనుంది. అన్ని పార్టీలు కూడా ఇక ప్రచార జోరు పెంచేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్‌రెడ్డి తెలంగాణలో మరోసారి బీజేపీ–బీఆర్‌ఎస్‌ పొత్తు అంశాన్ని ప్రచారాస్త్రంగా వాడుకోవాలని చూస్తున్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఈ ప్రచారం కాంగ్రెస్‌కు బాగా కలిసి వచ్చింది. బీజేపీ–బీఆర్‌ఎస్‌ మధ్య రహస్య ఒప్పందం ఉన్నట్లు ప్రజలను నమ్మించడంలో కాంగ్రెస్‌ సక్సెస్‌ అయింది. ఫలితంగా బీజేపీకి నాలుగైదు సీట్లు తగ్గాయి. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చింది. బీఆర్‌ఎస్‌ ప్రతిపక్షానికి పరిమితమైంది.

మళ్లీ అదే అస్త్రంతో..
తెలంగాణలో కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చిన అస్త్రాన్నే మళ్లీ లోక్‌సభ ఎన్నికల్లో ప్రయోగించాలని సీఎం రేవంత్‌రెడ్డి చూస్తున్నారు. బీఆర్‌ఎస్‌–బీజేపీ మధ్య రహస్య ఒప్పందం కొనసాగుతోందని సీఎం రేవంత్‌రెడ్డి మరోమారు ఆరోపించారు. ఇందులో భాగంగానే బీఆర్‌ఎస్‌ మల్కాజిగిరి, భువనగిరి, జహీరాబాద్, చేవెళ్ల, మహబూబ్‌నగర్‌ నియోజకవర్గాల్లో బలహీనమైన అభ్యర్థులను బరిలో దించారని ఆరోపించారు. మరోవైపు ఆ పార్టీ కీలక నేతలు కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావులు ఆ నియోజకవర్గాల్లో ప్రచారం కూడా చేయడం లేదని పేర్కొన్నారు. బీజేపీకి పరోక్షంగా సహకరిస్తున్నారని తెలిపారు.

బెయిల్‌ కోసం డీల్‌..
ఇక కేసీఆర్‌ కూతురు, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్‌ అయింది. ప్రస్తుతం తిహార్‌జైల్లో ఉంది. తన కూతురుకు బెయిల్‌ ఇప్పించుకునేందుకు కేసీఆర బీజేపీతో డీల్‌ కుదుర్చుకున్నారని కూడా సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌ను లోక్‌సభ ఎన్నిల్లో ఓడించాలని కోరుతున్నారు.

ఖండించని రెండు పార్టీలు..
ఇదిలా ఉంటే.. సీఎం రేవంత్‌రెడ్డి చేసిన ఆరోపణలను ఇటు బీజేపీ, అటు బీఆర్‌ఎస్‌ ముఖ్యనేతలెవరూ ఖండించకపోవడంతో మరోమారు ఈ ఆరోపణలతో రెండు పార్టీలకు నష్టం జరుగుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పార్టీ కేడర్‌లోనూ రేవంత్‌ ఆరోపణలపై ఆందోళన వ్యక్తమవుతోంది. రేవంత్‌రెడ్డి ఆరోపణల్లో నిజం ఉందా అన్న చర్చ జరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇలాంటి ఆరోపణలను తెలంగాణ ప్రజలు విశ్వసించారని, బీజేపీకి తీవ్ర నష్టం చేసిందని ఆ పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. రేవంత్‌రెడ్డి మరోసారి వ్యూహాత్మకంగానే ఈ ఆరోపణలు చేస్తున్నారని కొందమంది పేర్కొంటున్నారు.

అధిష్టానం అలర్ట్‌..
రేవంత్‌రెడ్డి ఆరోపణల నేపథ్యం.. గత అనుభవం దృష్టా బీజపీ నాయకత్వం అలర్ట్‌ అయింది. లోక్‌సభ ఎన్నికల వేళ రేవంత్‌ ఆరోపణలు తిప్పికొట్టేందుకు కేంద్ర హోం మంత్రి అమిత్‌షా స్వయంగా రంగంలోకి దిగారు. తెలంగాణలో బీజేపీ ప్రచారం తీరుతోపాటు, కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ చేస్తున్న తప్పుడుప్రచారాన్ని పరిశీలిస్తున్నారు. స్థానిక నేతలు తాజాగా రేవంత్‌ చేసిన ఆరోపణలను షా దృష్టికి తీసుకెళ్లారు. దీంతో స్థానిక పరిస్థితులకు అనుగుణంగా అభ్యర్థులకు ఆయన సూచనలు, సలహాలు ఇస్తున్నారు.

టార్గెట్‌ 10..
వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా 370 సీట్లు గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ తెలంగాణలో 10 స్థానాలపై కన్నేసింది. కచ్చితంగా గెలుస్తామని లెక్కలు వేసుకుంటోంది. ఈ క్రమంలో అమిత్‌షా ప్రత్యేక వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. రేవంత్‌ ఆరోపణల ప్రభావం ఈసారి పెద్దగా ఉండబోదని అంచనా వేస్తున్నారు. బీజేపీపై ప్రజలు నమ్మకంతో ఉన్నారని ఆ నమ్మకాన్ని మరింత పెంచేలా పనిచేయాలని సూచిస్తున్నారు. పార్టీలో చేరికలపైనా దృష్టి పెట్టాలంటున్నారు. మారుతున్న రాజకీయాలపై అప్రమత్తంగా ఉండాలని పేర్కొంటున్నారు. ఈమేరకు ఎప్పటికప్పుడు సూచనలు చేస్తున్నారు.

కాంగ్రెస్‌లోకి వలసలు..
ఇదిలా ఉండగా మహబూబ్‌నగర్, మెదక్, మల్కాజిగిరి పార్లమెంట్‌ నియోజకవర్గాలకు చెందిన బీఆర్‌ఎస్‌ నేతలు గత పదిరోజులుగా కాంగ్రెస్‌లో చేరుతున్నారు. ఇందులో గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసిన 9 మంది ఉన్నారు. దీంతో ఈ విషయాన్ని బీజేపీ నేతలు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. బీజేపీ నేతలకు కూడా కాంగ్రెస్‌ గాలం వేస్తుందని తెలిపారు. ఈ క్రమంలో బీజేపీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అన్నది ఆసక్తికరంగా మారింది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular