Bumrah : ఈ ప్రశ్నలకు జాతీయ మీడియాలో ప్రసారమవుతున్న కథనాల ద్వారా సమాధానాలు లభించాయి. జూన్ నెలలో ఇంగ్లాండ్ జట్టుతో మొదలయ్యే టెస్ట్ సిరీస్ కు సెలక్షన్ కమిటీ కెప్టెన్ రోహిత్ శర్మకు ఉద్వాసన పలికింది. ఈ నేపథ్యంలో సెలక్షన్ కమిటీ తీసుకునే నిర్ణయం అమల్లోకి వచ్చే కంటే ముందే రోహిత్ టెస్ట్ ఫార్మాట్ కు వీడ్కోలు పలికాడు. దీంతో రోహిత్ శర్మ తర్వాత టెస్టులలో టీమిండియా కు సారథ్యం ఎవరు వహిస్తారు? అనే ప్రశ్న అందరిలోనూ ఉత్పన్నమైంది. అయితే రోహిత్ మాదిరి కాకపోయినా.. జట్టులో సీనియర్ ఆటగాడిగా ఉన్న బుమ్రా కు కెప్టెన్ గా అవకాశం కల్పిస్తారని ప్రచారం జరిగింది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియాతో జరిగిన పెర్త్ టెస్టులో టీమిండియా కు బుమ్రా నాయకత్వం వహించాడు. ఆ మ్యాచ్లో టీమిండియా ఆస్ట్రేలియాపై ఘనవిజయం సాధించింది. అయితే దానిని దృష్టిలో పెట్టుకొని తదుపరి టెస్టులలో టీమిండియా కు సారథ్యం వహించే బాధ్యతలను బుమ్రా కు అప్పగిస్తారని ప్రచారం జరిగింది. అయితే దీనిపై సెలక్షన్ కమిటీ ఇంతవరకు ఎటువంటి నిర్ణయాన్ని వెల్లడించలేదు. ఆటగాళ్ల ఎంపిక వరకే ఆగిపోయిన సెలక్షన్ కమిటీ.. మరి కొద్ది రోజుల్లో కెప్టెన్ ను నియమించే అవకాశం కనిపిస్తోంది.
Also Read : గాయమా తీసేసారా.. రోహిత్ శర్మ ముంబై ప్లేయింగ్ 11 లో ఎందుకు లేడు?
అతడేనట..
బుమ్రా కు టెస్టులలో టీమ్ ఇండియాకు కెప్టెన్ అయ్యే అర్హత ఉన్నప్పటికీ..బుమ్రా ఇటీవల కాలంలో తరుచుగా గాయాల బారిన పడుతున్నాడు. సామర్థ్యం విషయాల్లోనూ తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాడు. గతంలోనే అతడికి వెన్నెముక దగ్గర శస్త్ర చికిత్స జరిగింది. అదే గాయం ఇటీవల కాలంలో తిరగబెట్టింది. ముఖ్యంగా ఆస్ట్రేలియా సిరీస్ లో బుమ్రా కు పాత గాయం నరకం చూపించింది. దీంతో అతడు సిడ్ని టెస్ట్ మధ్యలోనే వై దొలగాల్సి వచ్చింది. ఇక అప్పటినుంచి ఐపీఎల్ ప్రారంభం వరకు బుమ్రా నేషనల్ క్రికెట్ అకాడమీకే పరిమితమయ్యాడు. బెంగళూరులో అతడు చికిత్స పొందాడు. జట్టు ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని.. అతడికి కెప్టెన్సీ ఇవ్వకపోవచ్చు అని తెలుస్తోంది. అతడి స్థానంలో వైస్ కెప్టెన్ గా ఉన్న శుభ్ మన్ గిల్ కు కెప్టెన్ గా అవకాశం ఇస్తారని తెలుస్తోంది.. ” బుమ్రా అద్భుతమైన బౌలర్. సమర్థవంతమైన నాయకుడు కూడా. కానీ అతడు ఇటీవల కాలంలో గాయాల బారిన పడుతున్నాడు. శరీర సామర్థ్యాన్ని సంపాదించుకోవడంలో ఇబ్బంది పడుతున్నాడు. సుదీర్ఘ ఫార్మాట్ కు ఇలాంటి ఆటగాడు కెప్టెన్ అయితే ఇబ్బందికర వాతావరణం ఉంటుంది. అందువల్ల అతడికి కెప్టెన్సీ ఇవ్వకపోవచ్చు. జట్టు ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని గిల్ కు నాయకత్వ బాధ్యతలు అప్పగించవచ్చని” జాతీయ మీడియాలో క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి దీనిపై ఒక క్లారిటీ రావాలంటే మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది.
Also Read : ఈ ముగ్గురికి ఏమైంది.. మరీ సింగిల్ డిజిటా?