Heroes : సినిమా ఇండస్ట్రీలో చాలామంది స్టార్ హీరోలు వాళ్ళకంటూ ఒక సపరేట్ ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటూ ముందుకు సాగుతుంటారు. ఇక ఇలాంటి క్రమంలోనే మరి కొంతమంది హీరోలు మాత్రం వాళ్లను వాళ్లు స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి తీవ్రమైన ప్రయత్నం అయితే చేస్తూ వస్తున్నారు. ఇండస్ట్రీ మొదటి నుంచి ఇప్పటి వరకు కొంతమంది స్టార్ హీరోల దెబ్బకి యంగ్ హీరోలు వాళ్ళ కెరియర్ ని కోల్పోతూ వస్తున్నారు. సినిమా ఇండస్ట్రీ స్టార్టింగ్ నుంచి కూడా ఇలాంటివి సర్వసాధారణంగా జరుగుతూనే ఉన్నాయి. ఒకప్పుడు కత్తి కాంతారావు గా మంచి ఇమేజ్ సంపాదించుకున్న కాంతారావు (kantharao) ఎన్టీఆర్(NTR ), ఏఎన్ ఆర్ (ANR) లు స్టార్ హీరోలుగా ఎదిగిన తర్వాత తను ఇండస్ట్రీ నుంచి ఫెడౌట్ అయిపోయే దశకు చేరుకున్నాడు. కారణం ఏంటి అంటే ఎన్టీఆర్, ఏఎన్నార్ జానపద చిత్రాలను చేస్తూ వాళ్ళకంటూ ఒక సపరేట్ ఇమేజ్ ను సంపాదించుకోవడంతో కాంతారావు సినిమాలకి ఆదరణ తగ్గింది. తద్వారా ప్రేక్షకులందరూ ఎన్టీఆర్, ఏఎన్ ఆర్ సినిమాల వైపు మొగ్గు చూపడంతో ఇండస్ట్రీ నుంచి ఫేడౌట్ అయిపోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది… ఇక వీళ్ల తర్వాత కృష్ణ(Krishna), శోభన్ బాబు(Shobhan Babu) వాళ్ళ ఇమేజ్ ను అంతకంతకు పెంచుకుంటూ వెళ్లిపోయారు. ముఖ్యంగా కృష్ణ కమర్షియల్ సినిమాలను చేస్తూ ముందుకు సాగుతుంటే, శోభన్ బాబు మాత్రం ఫ్యామిలీ మూవీస్ చేస్తూ ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేశాడు. ఇక వీళ్లిద్దరి ముందు ఏ స్టార్ హీరో కూడా నిలవలేకపోయాడు. వీళ్లతో పాటు పోటీకి వచ్చిన మురళీమోహన్, చంద్రమోహన్ లాంటి హీరోలు సైతం సెకండ్ హీరోలుగా, క్యారెక్టర్ ఆర్టిస్టులుగా మారిపోయారు.
Also Read : ఇండియన్ ఇండస్ట్రీ లో టాప్ 5 హీరోస్ వాళ్లేనా..? అందులో మనవాళ్ళు ఉన్నారా..?
ఇక అదే సమయంలో కృష్ణంరాజు ఒక్కడే కొంతవరకు సోలో హీరోగా రాణించగలిగాడు… ఇక వీళ్ల తర్వాత మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) శకం స్టార్ట్ అయింది. ఆయన ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి ఖైదీ (Khaidi) సినిమాతో సూపర్ డూపర్ సక్సెస్ ని సాధించిన తర్వాత హీరోలందరికి ఆదరణ తగ్గడం స్టార్ట్ అయింది. ఇక అప్పటినుంచి మెగాస్టార్ చిరంజీవి మాస్ లో విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకోవడమే కాకుండా తన క్రేజ్ ని అంతకంతకు పెంచుకుంటూ వచ్చాడు.
ఆయన తర్వాత ఎన్టీఆర్ కొడుకుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన బాలయ్య సైతం మంచి సినిమాలు చేస్తూ అప్పటి వరకు ఉన్న హీరోలందరిని పక్కన పెట్టేసాడు… చిరంజీవి వల్ల సుమన్, భానుచందర్ లాంటి హీరోలు కొంతవరకు వాళ్ళ స్టార్ డమ్ ను కోల్పోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. ఇక ఎప్పుడైతే చిరంజీవి తనదైన రీతిలో వరుస సినిమాలతో ఇండస్ట్రీ హిట్లను సాధిస్తూ వచ్చాడో సుమన్ భాను చందర్ క్రేజ్ మొత్తానికి పడిపోవడమే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్టులుగా మారిపోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. ఇక వెంకటేష్, నాగార్జున లాంటి హీరోలు సైతం మంచి సినిమాలను చేస్తూ ఇండస్ట్రీకి గుర్తింపును తీసుకొచ్చారు. ఒకరకంగా చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ లు ఇండస్ట్రీకి నాలుగు పిల్లర్లుగా ఎదిగారు. ఇక నాగార్జున వల్ల అప్పటివరకు రొమాంటిక్ సినిమాలను చేస్తు వచ్చిన హరీష్ (Harish) సైతం తన కెరియర్ ను కోల్పోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది… ఇక వీళ్ల తర్వాత శ్రీకాంత్, జగపతిబాబు లాంటి నటులు సైతం ఫ్యామిలీ సినిమాలను చేస్తూ మంచి క్రేజ్ అందుకున్నారు.
ఇక జెడి చక్రవర్తి సైతం వీళ్లకు పోటీగా గులాబీ, బొంబాయి ప్రియుడు లాంటి సినిమాలతో సక్సెస్ లను సాధించాడు… ఇక ప్రేమదేశం సినిమాతో గొప్ప గుర్తింపును సంపాదించుకున్న అబ్బాస్, పెళ్లి సినిమాతో మంచి సక్సెస్ ని సాధించిన వడ్డే నవీన్ లాంటి హీరోలు సైతం పవన్ కళ్యాణ్ రాకతో ఇండస్ట్రీ నుంచి ఫేడ్ అవుట్ అయిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుసగా భారీ సక్సెస్ లను సాధించడంతో వడ్డే నవీన్, అబ్బాస్ లకు వెళ్లాల్సిన సినిమాలు పవన్ కళ్యాణ్ దగ్గరకు వెళ్ళాయి. తద్వారా ప్రేక్షకులు సైతం పవన్ కళ్యాణ్ సినిమాలను చూడ్డానికి ఎక్కువగా ఆసక్తి చూపించారు. అందువల్లే వాళ్ల సినిమాలకు ఆదరణ అయితే తగ్గింది.
తద్వార మొత్తానికైతే పవన్ కళ్యాణ్ క్రేజ్ అయితే పెరిగింది. ఇక పవన్ కళ్యాణ్ తో పాటు అప్పుడే మహేష్ బాబు కూడా ఇండస్ట్రీ కి రావడంతో ఇద్దరు స్టార్ హీరోలు సూపర్ స్టార్ గా ఎదగడంతో మిగతా హీరోలకి దెబ్బ పడింది. తరుణ్, ఉదయ్ కిరణ్ లాంటి హీరోలు ప్రభాస్ జూనియర్ ఎన్టీఆర్ ల రాకతో కెరీర్ కి ముప్పైతే ఏర్పడింది. చాలా సంవత్సరాల పాటు లవర్ బాయ్ ఇమేజ్ తో ముందుకు సాగుతారని అనుకున్న తరుణ్, ఉదయ్ కిరణ్ లు చాలా తక్కువ సమయంలోనే ఇండస్ట్రీ నుంచి ఫేడ్ ఔట్ అయిపోవడం ప్రతి ఒక్క ప్రేక్షకుడిని కలిచివేసిందనే చెప్పాలి… ఇలా ఇండస్ట్రీలో స్టార్ హీరోల ఇమేజ్ ముందు నిలబడలేక వాళ్ళ స్టార్ డమ్ ని కోల్పోయిన యంగ్ హీరోలు చాలామంది ఉన్నారనే చెప్పాలి.
Also Read : ఆ హీరోలకు రెమ్యునరేషన్ భారీ గా ఉంది..కానీ హిట్టు కొట్టలేకపోతున్నారు..?